Pawan: అందుకే పవన్ అంటే అంత ఇష్టం.. అశ్విని చెప్పిన విషయాలివే!

Pawan: యాక్టర్స్ అశ్విని శ్రీ అంటే పెద్దగా ఎవరికి తెలియకపోవచ్చు కానీ బిగ్ బాస్ సీజన్ సెవెన్ లో మంచి పాపులారిటీని తెచ్చుకుంది ఈ భామ. ఐదో వారంలో వైల్డ్ కార్డు ఎంట్రీ ద్వారా వచ్చిన అశ్విని శ్రీ తర్వాత 12వ వారం ఎలిమినేట్ అయిపోయింది. హౌస్ లో పెద్దగా టాస్క్ లు గేమ్స్ ఆడకపోయినా తన అందం, చార్మింగ్ లుక్ తో మంచి క్రేజ్ ని సంపాదించుకుంది. ఈమె తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొని పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గురించి ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసింది.

 

ఎప్పటికీ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నా ఫేవరెట్ హీరో అని చెప్పిన అశ్విని ఓజి సినిమా సూపర్ హిట్ కావాలని కోరుకుంది. పవన్ కళ్యాణ్ ఎప్పుడూ నా వాడే ఈ సినిమా సూపర్ డూపర్ సక్సెస్ అవ్వాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను దేవుడి దయ వల్ల పవన్ కళ్యాణ్ సీఎం అయితే రోజు స్క్రీన్ పై చూసుకోవచ్చు సీఎం కావాలని కోరుకుంటున్నాను అంటూ ఎంతో ఆనందంగా చెప్పుకొచ్చింది.

పవన్ కళ్యాణ్ గారిని కలిసే అవకాశం వస్తే అనే ఆలోచనకే నాకు మాటలు రావడం లేదు. ఎందుకంటే ఆయనతో దాదాపు మూడు నెలలు జర్నీ చేశాను షూటింగ్ సమయంలో సార్ పక్కన కూర్చోబెట్టుకుని మాట్లాడేవారు. షూటింగ్ స్పాట్లో పవన్ కళ్యాణ్ గారు తాను తినే డ్రై ఫ్రూట్స్ తినమ్మా అంటూ ఇచ్చేవారు. అంతేకాకుండా పాటలు పాడించి డాన్స్ చేయించేవారు.

 

ఆయన చాలా ఓపెన్ గా ఉంటారు అందుకే ఆయన అంటే ఇష్టం అని చెప్పుకొచ్చింది అశ్విని. ఇప్పుడు ఆమె చేసిన ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. బిగ్ బాస్ లోకి రాకముందు ఈ అమ్మడు సినిమాల్లో నటించిన సంగతి చాలా మందికి తెలియదు కానీ ఈమె పవన్ కళ్యాణ్ తో సర్దార్ గబ్బర్ సింగ్, రవితేజ తో రాజ ది గ్రేట్ లోనూ నటించింది.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -