Pawan: పవన్ కొడుకు లేటెస్ట్ లుక్ అదిరిపోయిందిగా.. ఇండస్ట్రీని షేక్ చేస్తాడంటూ?

Pawan: పవన్ కళ్యాణ్ మాజీ భార్య రేణు దేశాయ్ ఆమె కొడుకు అకీరా నందన్, కూతురు ఆద్య గురించి మనందరికీ తెలిసిందే. అకీరా అలాగే ఆద్య ఇంత చిన్న వయసులోనే సెలబ్రిటీ హోదాను దక్కించుకున్నారు. ఇక వీరిద్దరి గురించి ఎటువంటి చిన్న వార్త సోషల్ మీడియాలో వినిపించినా కూడా అది సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతూ ఉంటుంది. రేణు దేశాయ్ కూడా తరచూ తన పిల్లలకు సంబంధించిన విషయాలను సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకుంటూ ఉంటుంది. కాగా అకీరా, ఆద్య ప్రస్తుతం తల్లి దగ్గరే ఉంటున్న విషయం తెలిసిందే. అప్పుడప్పుడు పవన్ కళ్యాణ్ పిల్లల దగ్గరికి వెళుతూ ఉంటారు.

 

ఇకపోతే అకీరా నందన్ సినిమాలలోకి రాబోతున్నాడు అంటూ గతంలో చాలాసార్లు వార్తలు వినిపించగా ఎప్పటికప్పుడు రేణు దేశాయ్ ఆ వార్తలను ఖండిస్తూ వచ్చింది. హీరోగా మాత్రం రాడు అని తేల్చి చెప్పేసింది. ప్రస్తుతం అకిరా అమెరికాలోని ఒక ఫిలిం స్కూల్ లో మ్యూజిక్ కి సంబంధించి కోర్స్ నేర్చుకుంటున్నాడట. తాజాగా సంక్రాంతి పండుగ కావడంతో ఇంటికి వచ్చాడు అకిరా నందన్. పండుగ కావడంతో అకిరా, ఆద్య ఇద్దరు ట్రెడిషినల్ గా రెడీ అవ్వడంతో పాటు ఫోటోలు దిగి అందుకు సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేశారు.

ఈ ఫోటోలని వీడియో రూపంలో పవన్ కళ్యాణ్ అన్నవరం సినిమాలోని అన్నయ్య అన్నావంటే అనే సాంగ్ పెట్టి వీడియో ఎడిట్ చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది రేణు దేశాయ్. ప్రస్తుతం అందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఆ వీడియోలో అకిరానందన్ లుక్ అదిరిపోయింది అంటూ కామెంట్ చేస్తున్నారు పవన్ అభిమానులు. ట్రెడిషనల్ లుక్ లో చాలా హ్యాండ్సమ్ గా అందంగా ఉన్నాడు అంటూ కామెంట్స్ చేస్తున్నారు. అకిరా ఇప్పుడు ఫుల్ మీసాలు, జుట్టు, గడ్డంతో చాలా పెద్దవాడిగా కనిపిస్తున్నాడు. పవన్ తనయుడి కొత్త లుక్ అదిరిపోయింది అంటున్నారు అభిమానులు. ఇక ఆద్య రెడ్ పంజాబీ డ్రెస్ లో పద్దతిగా రెడీ అయింది. ప్రస్తుతానికి ఈ అన్నాచెల్లెళ్ల ఫొటోలు వైరల్ గా మారింది.

Related Articles

ట్రేండింగ్

CM Jagan: కూటమి విజయాన్ని ఫిక్స్ చేసిన జగన్.. మేనిఫెస్టో హామీలతో బొక్కా బోర్లా పడ్డారా?

CM Jagan: త్వరలోనే అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నటువంటి తరుణంలో పెద్ద ఎత్తున ప్రచార కార్యక్రమాలలో నిర్వహిస్తున్నారు. అయితే వైసిపి అధినేత జగన్మోహన్ రెడ్డి వై నాట్ 175 అంటూ ప్రచార కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు....
- Advertisement -
- Advertisement -