Avatar: అవతార్ మూవీ గురించి ఈ సంచలన నిజాలు తెలుసా?

Avatar: ప్రముఖ హాలీవుడ్ డైరెక్టర్ జేమ్స్ కామెరూన్ దర్శకత్వంలో వచ్చిన అద్భుత చిత్రం ‘అవతార్’. ఈ సినిమా ఎంతటి సంచలనం సృష్టించిందో అందరికీ తెలిసిందే. టైటానిక్ వంటి రొమాంటిక్ చిత్రాన్ని తెరకెక్కించిన కామెరూన్.. అవతార్‌తో మరో అద్భుత కళాఖండాన్ని సృష్టించాడు. భూమికి దూరంగా ‘పండోర’ గ్రహాన్ని సృష్టించి.. వింత మనుషులు, వింత జంతువులను డిజైన్ చేశాడు. మనుషుల అత్యాశ వల్ల ఆ గ్రహానికి తలెత్తే ఆపద.. వారి మధ్య పోరాట సన్నివేశాలను తెరపై కళ్లకు కట్టినట్లు చూపించాడు. విజువల్ వండర్‌గా తెరకెక్కిన ఈ చిత్రం.. ప్రపంచవ్యాప్తంగా రూ.కోట్లల్లోనే వసూళ్లు రాబట్టింది. 2009లో విడుదలైన ‘అవతార్’ సినిమా బాక్సాఫీస్ వద్ద రికార్డు సృష్టించింది. 12 వేల కోట్లతో తెరకెక్కిన ఈ చిత్రం.. వరల్డ్ వైడ్ రూ.24 వేల కోట్లు వసూలు చేసింది. అయితే త్వరలో ఈ సినిమా సీక్వెల్ కూడా రాబోతుంది.

 

విజువల్ వండర్‌గా తెరకెక్కుతోన్న ‘అవతార్-2’ రిలీజ్ చేయడానికి దాదాపు 13 ఏళ్ల సమయం పట్టింది. కరోనా టైమ్ వల్ల మూడేళ్లు షూటింగ్ ఆగిపోవడమే ఈ లేట్‌కు కారణమని చిత్రబృందం చెబుతోంది. అయితే తాజాగా ఈ సినిమాపై ఓ పుకారు వినిపిస్తోంది. హాలీవుడ్ సినిమా అయిన అవతార్‌కు దర్శకుడు హిందువుల దేవుడి పేరు పెట్టడం మొదటి నుంచి అందరిలో డౌట్ తెప్పించింది. నిజానికి కామెరూన్ ఒక క్రిస్టియన్ అమెరికన్. కానీ హిందూ దేవుడిని తీసుకోవడానికి గల కారణాన్ని బయటపెట్టాడు. కామెరూన్ క్రిస్టియనే అయినప్పటికీ హిందూ సంప్రదాయం అంటే ఎంతో అభిమానమట. పురాణాల్లో శ్రీ కృష్ణుడు, రాముడు, విష్ణుమూర్తి రూపాల స్ఫూర్తితో ‘అవతార్’ పేరును సంస్కృతం నుంచి తీసుకున్నాడు. అలాగే కృష్ణుడి రంగు కూడా నీలం.. అందుకే అవతార్ సినిమాలోని క్యారెక్టర్లకు కూడా అదే రంగు, రూపం ఇచ్చాడట. ఫస్ట్ పార్ట్ రికార్డు సృష్టించడంతో.. సీక్వెల్‌కు తీసినట్లు కామెరూన్ చెప్పుకొచ్చాడు. అలా ‘అవతార్’ పేరునే బ్రాండ్‌గా చేసుకుని సినిమాలు తీస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -