Ayyanna Patrudu: వైరల్ అవుతున్న అయ్యన్నపాత్రుడు సంచలన వ్యాఖ్యలు!

Ayyanna Patrudu: విశాఖ లో నిర్వహించిన మీడియా సమావేశంలో మాట్లాడిన అయ్యన్నపాత్రుడు వైఎస్సార్ సీపీ ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. అలాగే జగన్ గురించి కూడా మాట్లాడుతూ ఆస్తుల విషయంలో జగన్ కు తల్లి, చెల్లి, బాబాయ్ అనే తేడా లేదని ఆరోపించారు. రాజకీయంగా చెల్లిని ఎదుర్కోలేక ఆమెను అంతమొందించినా ఆశ్చర్యపడక్కర్లేదని ఆందోళన వ్యక్తం చేశారు. వైయస్ రాజశేఖర్ రెడ్డికి కూతురు షర్మిల అంటే ఎంత ప్రేమో సన్నిహితులు అందరికీ తెలుసు.

 

అందుకే ఆమెకు ప్రత్యేకంగా ఆస్తిలో వాటా రాశారని అయ్యన్నపాత్రుడు తెలిపారు ఆ ఆస్తిని జగన్ ఇవ్వకుండా అడ్డుకుంటున్నారని ఆరోపించారు. ఈడీ అటాచ్మెంట్ లో ఉన్న ఆస్తులు చేజారి పోతాయనే భయం జగన్ కు ఉందని విమర్శించారు. ప్రభుత్వ సలహాదారుగా ఉన్న సజ్జల రామకృష్ణారెడ్డి ఇదే అంశంపై నోరు జారిన విషయాన్ని గమనించారా అంటూ కొత్త అంశాన్ని అయ్యన్న తెరపైకి తీసుకువచ్చారు. కొద్ది రోజులుగా జగన్ ను లక్ష్యంగా చేసుకొని అనేక విషయాలు బహిర్గతం చేశారు షర్మిల.

అందుకే ఆమెకు భద్రత పెంచాలని కేంద్రాన్ని డిమాండ్ చేస్తున్నామన్నారు. తనకు కూడా ప్రాణహాని ఉందంటూ ఆందోళన వ్యక్తపరిచారు అయ్యన్నపాత్రుడు. అనకాపల్లి జిల్లా కలెక్టర్ ఎస్పీలను కలిసి తన రివాల్వర్ లైసెన్స్ రెన్యువల్ కు ఆమోదం తెలిపారని కోరామన్నారు. నాలుగున్నర ఏళ్లలో ఉత్తరాంధ్రకు ఏం చేశారని విశాఖలో సిద్ధం సభను ఏర్పాటు చేశారని జగన్ ను అయ్యన్న ప్రశ్నించారు. ఇక్కడ ప్రజలు వైసీపీకి ఎందుకు ఓటు వేయాలి అంటూ నిలదీశారు. ఉత్తరాంధ్ర భూములను దోచుకున్నందుకు మీకు ఓటు వేయాలా అంటూ ప్రశ్నించారు.

 

మూడు నెలల తర్వాత తమ ప్రభుత్వం వస్తుందని అప్పుడు అందరి లెక్కలు తేలుస్తామని చెప్పుకొచ్చారు అయ్యన్నపాత్రుడు. ఎన్నికల తరువాత జగన్ లండన్ అమెరికాలో దాక్కున్నా కూడా లాక్కోస్తామని దోచుకున్న సొమ్ముని కక్కిస్తామని హెచ్చరించారు. విశాఖ బీచ్ నుంచి భీమిలి వరకు ఉన్న ప్రభుత్వ భూములు అన్నింటిని స్వాహా చేశారు అంటూ జగన్ పై విమర్శల వర్షం కురిపించారు.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -