Ayyanna Patrudu: అయ్యన్నకు జనసేన మార్క్ షాక్ తగిలిందా.. ఏం జరిగిందంటే?

Ayyanna Patrudu: తెలుగుదేశం పార్టీలో గత నాలుగు దశాబ్దాలుగా కొనసాగుతూ సీనియర్ నేతగా మంచి గుర్తింపు సంపాదించుకున్న చింతకాయల అయ్యన్నపాత్రుడు గత ఎన్నికలలో వైఎస్ఆర్సిపి పార్టీ నేత పెట్ల ఉమా గణేష్ శంకర్ చేతిలో ఓటమి పార్లయ్యారు. 2024 ఎన్నికలలో ఎలాగైనా గెలుపొందాలని అయ్యన్నపాత్రుడు పెద్ద ఎత్తున కష్టపడుతున్నట్లు తెలుస్తుంది. ఈ క్రమంలోనే తమ నియోజకవర్గంలో తన పార్టీని ముందుకు నడిపించడం కోసం వచ్చే ఎన్నికలలో గెలుపు కోసమే అయ్యన్న శ్రమిస్తున్నారు.

2024 ఎన్నికల్లో జనసేనతో పొత్తు ఉంటే సైకిల్ ని జోరెత్తించవచ్చు అని అయ్యన్న లాంటి సీనియర్లు భావిస్తున్నారు. అదే అయ్యన్న ఇలాకాలో జనసేన ఇటీవల కాలంలో హుషార్ చేస్తోంది. ఆ పార్టీకి చెందిన నియోజకవర్గం నేతలు అయితే వచ్చే ఎన్నికల్లో తమ గెలుపు ఖాయమని జనసేన నాయకులు ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఒకవైపు జనసేన నాయకులు పవన్ సీఎం అయితేనే రాష్ట్ర ప్రజల కష్టాలు తీరుతాయని భావిస్తున్నారు.

 

వచ్చే ఎన్నికల్లో నర్శీపట్నంలో జనసేనను గెలిపించాలని ఇల్లిల్లూ తిరిగి జనాలకు చెబుతున్నారు. నర్శీపట్నం ప్రజల నుంచి జనసేనకు విశేష స్పందన వస్తోందని, తమ పార్టీ గెలుపు ఖాయమని ఆ పార్టీ నాయకులు చెబుతున్నారు. ఒకవైపు అయ్యన్న గెలవాలని తమ పోరాటానికి జనసేన తోడైతే గెలుపు తథ్యం అంటూ అయ్యన్న తెలుపుతూ ఉండగా జనసేన నాయకులు మాత్రం మా నాయకుడు తప్పకుండా గెలుస్తారు అంటూ ధీమా వ్యక్తం చేయడంతో తన సొంత నియోజకవర్గం లోని అయ్యన్నకు జనసేన సెగ తగిలిందని చెప్పాలి.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -