Ganta Srinivara Rao: చీపురుపల్లి నుంచి పోటీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన గంటా.. పొలిటికల్ లెక్కలు మారిపోనున్నాయా?

Ganta Srinivara Rao: ఎన్నికల షెడ్యూల్ వచ్చిన తర్వాత ఏపీలో పొలిటికల్ హీట్ పెరిగింది. పెండింగ్ లో ఉన్న సీట్లలో అభ్యర్థుల ఎంపికపై చంద్రబాబు స్పీడ్ పెంచారు. గత కొంతకాలంగా విజయనగరం జిల్లా చీపురుపల్లి స్థానం హాట్ టాపిక్ గా మారింది. ఇక్కడ నుంచి వైసీపీ తరుఫున బొత్స పోటీ చేస్తున్నారు. టీడీపీ నుంచి గంటా శ్రీనివాస్ రావు పేరు జోరుగా వినిపించింది. దీంతో.. ఒక్కసారిగా ఏపీ రాజకీయాలకు చీపురుపల్లి ముఖచిత్రంగా మారిపోయింది. గంటా పేరు జోరుగా వినిపించినా.. టీడీపీ విడుదల చేసిన రెండు జాబితాల్లో కూడా చీపురుపల్లిని ప్రకటించలేదు. అలా అని గంటా శ్రీనివాస్ కు కూడా మరో చోట సీటు కేటాయించలేదు. గంటా శ్రీనివాస్ అక్కడి నుంచి పోటీ చేయడానికి ఓ అడుగు వెనక్కి వేశారు. బొత్స లాంటి నేతపై పోటీ చేయడం కాస్త కష్టమనే అభిప్రాయాన్ని వ్యక్తి చేశారు. అంతేకాదు.. ఈ సారి భీమిలి నుంచి పోటీ చేయడానికి గంటా సిద్దమైయ్యారు. దీంతో.. చంద్రబాబు, గంటా శ్రీనివాస్ మధ్య పలు దఫాలు చర్చలు కూడా జరిగాయి. ఫైనల్ గా చీపురుపల్లి నుంచి పోటీకి గంటా అంగీకరించినట్టు తెలుస్తోంది. చంద్రబాబు చీపురుపల్లిలో సర్వేలు చేయించారట. గంటా అయితే పక్కాగా గెలుస్తారని సర్వేలో వెల్లడైనట్టు తెలుస్తోంది. అందుకే గంటాను అక్కడ నుంచి పోటీ చేయాలని చంద్రబాబు ఒత్తిడి తెచ్చారు. చంద్రబాబు కూడా అంత బలంగా చెప్పినపుడు గంటా కూడా ఓకే చెప్పారని జోరుగా ప్రచారం జరుగుతోంది. తరువాత జాబితాలో గంటా పేరు ప్రకటించే అవకాశం ఉంది.

అయితే.. చంద్రబాబు చీపురుపల్లి నుంచి గంటాను పోటీ చేయించడం వెనక పెద్ద వ్యూహామే ఉందని ప్రచారం జరుగుతోంది. ఒకప్పుడు టీడీపీ కంచుకోటగా ఉన్న చీపురుపల్లి.. 2004నుంచి బొత్స పోటీ తర్వాత కాంగ్రెస్, వైసీపీకి అనుకూలంగా మారిపోయింది. అక్కడ టీడీపీ అభ్యర్థిగా కిమిడి నాగార్జున ఉన్నాడు. నాగార్జున యువకుడు, ఉత్సాహవంతుడు అయినప్పటికీ బొత్సను ఎదుర్కొని నిలబడటం కష్టమనే అభిప్రాయం ఉంది. దీంతో.. గంటా అయితే, గెలుపు అవకాశాలు ఎక్కువగా ఉంటాయని చంద్రబాబు భావించారట. ఇక, రాబిన్ శర్మ సర్వేలో కూడా ఇదే విషయం తేలిందట. విశాఖ వైసీపీ ఎంపీగా బొత్స సత్యనారాయణ భార్య ఝాన్సీ పోటీ చేస్తున్నారు. చీపురుపల్లిలో గంటా పోటీ చేస్తే.. ఆయన్ని ఎదుర్కోవడానికి బొత్స తన సాయశక్తులన్నీ చీపురుపల్లిపైనే పెట్టాల్సి వస్తుంది. తన భార్యపోటీ చేస్తున్న విశాఖపై కేంద్రీకరించలేరు. బొత్స దూకుడును తగ్గించాలంటే.. చీపురుపల్లి నుంచి గంటా పోటీ చేస్తే బాగుంటుందని టీడీపీ శ్రేణులు భావిస్తున్నారు. గంటా చీపురుపల్లి నుంచి పోటీ చేస్తే.. విశాఖతో పాటు.. విజయనగరం జిల్లాలో మిగిలిన స్థానాలపై కూడా బొత్స ఫోకస్ చేయలేరు. దీంతో.. బొత్స దూకుడుకు కల్లెం వేయొచ్చు.

మరోవైపు విశాఖ టీడీపీలో గంటా వర్సెస్ అయ్యన్న పాత్రుడిగా రాజకీయం ఉంటుంది. ఇద్దరూ ఒకే పార్టీలో ఉన్నా.. ఒకరిపై ఒకరు కత్తులు దూస్తూనే ఉంటారు. అయ్యన్న పాత్రుడు పార్టీకి నిబద్దత కలిగిన నేతగా ఉంటారు. గంటా పలు పార్టీలు మారినా ఆర్థికంగా బలంగా ఉన్నారు. చంద్రబాబుపై వ్యక్తిగతమైన అభిమానం ఉంటుంది. దీంతో.. చంద్రబాబు వీరిద్దరి విషయంలో ఆచీతూచీ అడుగులు వేస్తారు. అయితే, ఈ సారి విశాఖ జిల్లాలో గంటా వర్సెస్ అయ్యన్న పాత్రుడు అనే రాజకీయం నడవకుండా ఉండాలి అంటే గంటాను జిల్లా మార్చాలని నిర్ణయం తీసుకుంటున్నట్టు తెలుస్తోంది.

చీపురుపల్లిలో ఇప్పటికే గ్రౌండ్ లో కిమిడి నాగార్జున పని చేశారు. అందుకే.. ఆయన్ని విజయనగరం ఎంపీగా దింపాలని చంద్రబాబు భావిస్తున్నట్టు తెలుస్తోంది. అశోక్ గజపతిరాజు కూడా ఈసారి పోటీకి ఆసక్తి చూపడం లేదు. పార్టీ వేరేవాళ్లని పోటీకి దించితే తను సహకరిస్తానని ఆయన ప్రకటించారు. నాగార్జునను ఎంపీగా దించితే అక్కడ గెలిచే అవకాశం ఉందని సమాచారం. విజయనగరం ఎంపీగా వైసీపీ నేత బెల్లాన చంద్రశేఖర్ ఉన్నారు. ఆయనపై స్థానికంగా తీవ్రమైన వ్యతిరేకత ఉంది.

Related Articles

ట్రేండింగ్

YSRCP Leaders Tension: టీడీపీ జనసేన కూటమి మేనిఫెస్టో విషయంలో వైసీపీ భయాలివేనా.. ఆ టెన్షన్ తగ్గట్లేదా?

YSRCP Leaders Tension:తెలుగుదేశం పార్టీ మేనిఫెస్టో విడుదల చేసిన తర్వాత జగన్ పార్టీలో భయం మొదలైనట్లుగా ఉంది. ఎందుకంటే వైసీపీ మేనిఫెస్టోలో ఉన్నా హామీల కన్నా కూటమి ఇచ్చిన హామీలు చాలా చాలా...
- Advertisement -
- Advertisement -