Hanuman Movie: హనుమాన్ సినిమాలో బాహుబలి రేంజ్ ట్విస్ట్.. వేరే లెవెల్ ప్లాన్ అంటూ?

Hanuman Movie: ఎన్నో అవంతరాల మధ్య సంక్రాంతికి ఎలాగైనా సినిమా రిలీజ్ చేయాలనే పట్టుదలతో వచ్చిన సినిమా హనుమాన్ ఓ రేంజ్ లో కలెక్షన్ల వర్షం కురిపిస్తుంది. టాలీవుడ్ యంగ్ హీరో తేజ సూపర్ హీరోగా ఈ మూవీ తెరకెక్కింది. రామభక్తుడు హనుమంతుడు వల్ల ఓ కుర్రాడికి సూపర్ పవర్స్ వస్తే ఈ కథ ఎలా ఉంటుందో దర్శకుడు ప్రశాంత్ వర్మ చాలా అద్భుతంగా చూపించాడంటూ సినీ క్రిటిక్స్ సైతం ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.

 

ఈ సినిమాలో గ్రాఫిక్స్ షాట్స్ విఎఫ్ ఎక్స్ సీన్స్ చాలా న్యాచురల్ గా ఉన్నాయి. హిందూ పురాణాలను టచ్ చేసిన ఎక్కడా లైన్ దాటకుండా అందరూ అంగీకరించేలాగా తెరకెక్కించారు. మూవీలో చాలా సీన్స్ ఆడియన్స్ కి గూస్ బంప్స్ ని తెప్పిస్తాయని చెప్తున్నారు. ముఖ్యంగా సినిమా చివర్లో ఆంజనేయస్వామి షాట్స్ అయితే ఆడియన్స్ ని సీట్లో కూర్చొనివ్వవు అంటున్నారు.

ఈ సినిమా ఇంత పెద్ద హిట్ అవుతుందని దర్శకుడు ముందు నుంచి గట్టి నమ్మకంతో ఉన్నట్లు ఉన్నాడు అందుకే పార్ట్ టూ ఉంటుందంటూ ముందే అనౌన్స్ చేశాడు. ఈ సీక్వెల్ ని కూడా మూవీ ఎండ్ లో అనౌన్స్ చేశాడు. హనుమాన్ 2 కి లీడ్ ఇస్తూ బాహుబలి లెవెల్ ట్విస్ట్ పెట్టారంట బాహుబలి లో కట్టప్ప ఎందుకు చంపాడు అనే ట్విస్ట్ సెకండ్ పార్ట్ పై భారీ హైప్ క్రియేట్ చేసింది ఇక ఈ చిత్రంలో హనుమంతుడు రాముడికి ఇచ్చిన మాట ఏంటనే ట్విస్ట్ పెట్టారంట.

 

ఈ సినిమాకి జై హనుమాన్ అనే టైటిల్ కూడా ఖరారు చేశారు ఈ చిత్రాన్ని 2025లో తీసుకురాబోతున్నట్లు అనౌన్స్ చేశారు. ఫస్ట్ పార్ట్ ఘనవిజయాన్ని సాధించడంతో సెకండ్ పార్ట్ పై భారీ అంచనాలే ఏర్పడుతున్నాయి. బడ్జెట్ పరిధిలోనే ఇంత మంచి సినిమా తీసిన దర్శకుడు ఇక జై హనుమాన్ సినిమాని ఇంకెంత బాగా తీస్తాడో అని ఇప్పటినుంచే క్యూరియాసిటీ చూపిస్తున్నారు ప్రేక్షకులు.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -