Star Heroine: వరసగా ఏడో డిజాస్టర్.. ఈ బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దరిద్రం మామూలుగా లేదుగా!

Star Heroine:  జాతీయ ఉత్తమ హీరోయిన్‌ అంటే ఆమెతో సినిమా మూవీ మేకర్స్ హ్యాపీగా ఫీల్ అవుతుంటారు. కానీ ఇక్కడ మాత్రం సీన్ రివర్స్‌లో జరుగుతోంది. జాతీయ ఉత్తమ నటిగా అవార్డు అందుకున్నా ఆమెతో సినిమా అంటే బెదిరిపోతున్నారు దర్శక నిర్మాతలు. ఇంతకీ ఎవరా నేషనల్ అవార్డ్ విన్నింగ్ నటి అనుకుంటున్నారా? ఆమె మరెవరో కాదు కృతి సనన్. ఈమె తెలుగులో ఒకటి రెండు సినిమాలలో మాత్రమే నటించింది.

కానీ బాలీవుడ్ లో మాత్రం వరుస ప్రాజెక్టులలో నటించి అక్కడ మంచి గుర్తింపుని ఏర్పరచుకుంది. దాదాపు 30కి పైగా సినిమాలలో నటించినప్పటికీ ఈమెకు ఆశించిన స్థాయిలో గుర్తింపు దక్కలేదు. పైగా మిమి సినిమాకు గానూ నేషనల్ అవార్డ్ కూడా అందుకున్నారు కృతి. దాంతో ఈ భామ రేంజ్ మరింత పెరిగింది. కానీ కెరీర్ మాత్రం దారుణంగా ఉంది.

వరసగా 7 ఫ్లాపులతో ఐరెన్ లెగ్ అనే ట్యాగ్ నీ వేశారు. గత రెండు మూడు సంవత్సరాలుగా చూసుకుంటే ఈమె కెరియర్ ఏమాత్రం బాగోలేదని చెప్పవచ్చు. మిమి సినిమా తర్వాత ఈమెకు చెప్పుకోదగ్గ విజయమే రాలేదు. తాజాగా టైగర్ ష్రాఫ్‌తో నటించిన గణపత్ కూడా దారుణంగా బోల్తా కొట్టింది. తొలిరోజే ఈ సినిమాకు కనీస ఓపెనింగ్స్ రాలేదు. దాంతో డిజాస్టర్ లిస్ట్‌లో చేరిపోయింది గణపత్.

దీనికి ముందు ఆదిపురుష్, షెహ్‌జాదా కూడా ఇదే ఫలితాన్ని అందుకున్నాయి. 2023లో హ్యాట్రిక్ ఫ్లాప్స్ ఇచ్చిన కృతికి 2022 కూడా కలిసిరాలేదు. గత ఏడాది ఈమె నటించిన భేడియా, బచ్చన్ పాండే, పానిపట్, అర్జున్ పటియాలా కూడా ఫ్లాపులే. వీటిలో ఏ ఒక్కటి హిట్ టాక్ నీ అందుకోలేక పోయాయి. ప్రస్తుతం కృతి సనన్ అడపాదడపా సినిమాలలో నటించడంతో పాటు ప్రస్తుతం బుల్లితెరపై ప్రసారం అవుతున్న ఢీ షోకి జడ్జిగా వ్యవహరిస్తోంది.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -