Adipurush: ఆదిపురుష్ సినిమాలో వింత జంతువులు.. మరీ కామెడీ చేసేశారుగా!

Adipurush: ఓం రౌత్ దర్శకత్వంలో ప్రభాస్,కృతి సనన్ కలిసి నటించిన తాజా చిత్రం ఆదిపురుష్. ఈ సినిమాలో సైఫ్ అలీ ఖాన్ కూడా నటించిన విషయం తెలిసిందే. తాజాగా జూన్ 16న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమా కోసం ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఎంతోమంది అభిమానులు ఎదురు చూశారు. అయితే ఈ సినిమా పాజిటివ్ టాక్ కి బదులు నెగిటివ్ టాక్ ని ఎక్కువగా సొంతం చేసుకుంటోంది. దీంతో దర్శకుడు పై నెట్టిజెన్స్ తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. అంతే కాకుండా ఒక రేంజ్ లో ట్రోలింగ్స్ చేస్తూ ఏకీపారేస్తున్నారు. అసలు ఓం రౌత్ కి రామాయణం అంటే సరైన అవగాహన లేదని అందుకే ఈ సినిమాను ఇలా తెరకెక్కించారు అంటూ మండిపడుతున్నారు.

 

మరి ఈ సినిమాలో డైరెక్టర్ ఎటువంటి తప్పులు చేశాడు ఇప్పుడు మనం తెలుసుకుందాం.. ఓం రౌత్ ప్ర‌య‌త్నం మెచ్చుకోద‌గ్గ‌దే అయినా కొన్ని త‌ప్పులు మాత్రం ఘోరంగా ఉన్నాయ‌నే తెలుస్తోంది. సీతాదేవిని రావ‌ణుడు తీసుకువెళుతున్న‌ప్పుడు భూమితో స‌హా ఎత్తుకు వెళ‌తాడు. అయితే ఇందులో సీత‌ను ఏకంగా తాళ్ల‌తో బంధించి తీసుకువెళ్ల‌డం పెద్ద త‌ప్పుగా చెబుతున్నారు. ఇక రావణాసురుడి గెట‌ప్ నుంచి లంక వ‌ర‌కు మ‌నం ఉన్న‌ది లంక‌లో కాదు. అదేదో లోకంలో అన్న‌ట్టుగా ఉంద‌ంటూ సినిమాను చూసిన వారు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

ఇక రావ‌ణుడి భార్య మండోదరి, విభీషణుడి భార్య శరమ, శూర్పణక అందరూ ఈ కాలం నాటి పేజ్ 3 లేడీస్‌లా ఉన్నార‌న్న వాదనలు వినిపిస్తున్నాయి. వీరిలో ఎవ్వ‌రికి మోహాన క‌ట్టుబొట్టు లేదు. రావ‌ణుడు అయితే ఒక సీన్‌లో ఘోరంగా కొండ చిలువలతో బాడీ మసాజ్ చేయించుకుంటూ ఉంటాడు. అస‌లు ఈ సినిమా హిందూ దేశ‌మైన భార‌తీయ బ్యాన‌ర్‌, భార‌తీయుడు తీసిన‌ట్టుగా కాకుండా ఎవ‌రో తెలిసి తెలియ‌ని ఫారిన‌ర్ తీసిన‌ట్టుగా ఉంద‌ంటూ మండిపడుతున్నారు. ఇక వానరుల్లో హనుమంతుడు మాత్ర‌మే హనుమంతుడిలా ఉన్నాడు. వాలి సుగ్రీవులు చింపాంజీల్లా మిగిలినోళ్లు గొరిల్లాల్లా ఉన్నాయి అని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఇక లంక‌లో రావ‌ణ‌సేన అంటే అవేవో వింత జీవులు ఉన్న‌ట్టుగా ఉన్నాయ‌ట‌. కొన్ని చోట్ల సినిమాలో జాంబీల్లాంటి వింత జీవులు క‌నిపిస్తాయి.

ఇందులో బ్ర‌హ్మ‌దేవుడు చ‌తుర్ముఖుడు కాకుండా ఏ దివ్య తేజ‌స్సు లేకుండా సింపుల్‌గా ఒక రాజ‌గురువులా ప్ర‌త్య‌క్ష‌మ‌వ్వ‌డం కూడా విచిత్రంగా ఉందంటున్నారు. ఇక రావ‌ణుడు కొన్ని చోట్ల కుంటుతూ న‌టించ‌డం ఏంట్రా బాబు? అంటూ అని జ‌నాలు త‌ల‌లు ప‌ట్టుకుంటున్నారు. ఇక చాలా చోట్ల డైలాగులు కూడా తెలుగు వెర్ష‌న్‌లో తేలిపోయాయ‌ని లిప్‌సింక్ కూడా స‌రిగ్గా మ్యాచ్ కాలేదంటున్నారు. ఒక చోట రావ‌ణుడు వెల్డింగ్ ప‌ని చేసుకుంటూ ఉంటాడ‌ట‌. అస‌లు రావ‌ణుడు వెల్డింగ్ ప‌ని చేసుకోవ‌డం ఏంట‌ని కామెడీ అనే అంటున్నారు జ‌నాలు. అలాగే హ‌నుమంతుడికి త‌న గుర్తుగా చూడామ‌ణి ఇవ్వాల్సిన సీత త‌న చేతి గాజును ఇస్తుంది. ఇలా చెప్పుకుంటూ పోతే సినిమాలో చాలానే మైనస్ పాయింట్లు ఉన్నాయి.

Related Articles

ట్రేండింగ్

Budi Mutyala Naidu: వైసీపీ ఎంపీ అభ్యర్థికి “సన్” స్ట్రోక్.. తండ్రి ఓటమి కోసం కొడుకు ప్రచారం చేస్తున్నారా?

Budi Mutyala Naidu:  రాష్ట్ర ఎన్నికలలో ఆసక్తికర ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. రాజకీయాల ముందు కుటుంబ బంధాలు ఓడిపోతున్నాయి. ఇంతకుముందు టెక్కలి లో ఇలాంటి ఘటన ఒకటి చూసాము, ఇప్పుడు అనకాపల్లి పార్లమెంటు...
- Advertisement -
- Advertisement -