Balagam : వైరల్ అవుతున్న బలగం నటి సంచలన వ్యాఖ్యలు!

Balagam: బలగం చిన్న సినిమాగా విడుదలైన ఈ సినిమా సంచలన విజయాన్ని అందుకున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం ఎక్కడ చూసినా కూడా ఈ సినిమా గురించే చర్చించుకుంటున్నారు. ఇప్పటికే థియేటర్లలో కలెక్షన్ల మోత మోగించిన ఈ సినిమా సక్సెస్ ఫుల్ గా రన్ అవుతూ దూసుకుపోతోంది. డైరెక్టర్ వేణు పై ప్రశంసలు కురిపిస్తున్నారు. సినిమా ఇండస్ట్రీలో చాలామంది ఈ సినిమాకు వస్తున్న రెస్పాన్స్ ని చూసి ఆశ్చర్యపోతున్నారు. కాగా ఈ సినిమాని చూసిన ప్రతి ఒక్క ప్రేక్షకుడు కంటతడి పెట్టాల్సిందే అని చెప్పవచ్చు.

ఇది ఇలా ఉంటే ఈ సినిమాలో నటించిన బలగం లలిత ఇంటర్వ్యూలో వ్యక్తిగత విషయాల గురించి తాను పడ్డ కష్టాల గురించి తెలిపింది. ఈ సందర్భంగా లలిత మాట్లాడుతూ.. నాన్నగారి మరణం తర్వాత చాలా ఇబ్బందులు పడ్డాము. అమ్మ మంచి ఆర్టిస్ట్ అని అమ్మ గొంతు బాగుంటుందని డ్యాన్స్ బాగా చేయగలరని సురభిలో చేయదగ్గది అని తెలిపింది లలిత. మా అన్న చనిపోయాక అమ్మమ్మ కుటుంబాన్ని మా అమ్మ పోషించింది. మేము పిన్నివాళ్లు, మేము కలిసి ఉండేవాళ్లం. ఆ సమయంలో అమ్మ బయట ఉద్యోగం చేసింది.

అమ్మకి రోజుకు 20 రూపాయలు వచ్చేది అని చెప్పుకొచ్చింది లలిత. ఆ ఇరవై రూపాయలతో అమ్మ కుటుంబాన్ని పోషించేది అని చెప్పుకొచ్చింది లలిత. ఇక నాన్న లారీ డ్రైవర్ గా పని చేసేవారు. తన భర్త తనని ఎంతో బాగా ప్రేమగా చూసుకుంటారని, ఆమె అత్త వాళ్ళ ఊరు అని ఆమె చెప్పుకొచ్చింది. కాగా ఇంటర్వ్యూలో భాగంగా లలిత చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -