Balagam: స్మాల్ స్క్రీన్ పై మెరిసిన బలగం.. రేటింగ్ ఎంతో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే!

Balagam: కంటెంట్ ఉంటే చిన్న సినిమా ఆయన పెద్ద సక్సెస్ అందుకుంటుందని ఇప్పటికే ఎన్నో సినిమాలు నిరూపించాయి అయితే తాజాగా ఒక చిన్న సినిమాగా ప్రేక్షకుల ముందుకు వచ్చి పెద్ద విజయాన్ని అందుకున్నటువంటి వాటిలో బలగం సినిమా ఒకటి. జబర్దస్త్ మాజీ కమెడియన్ వేణు దర్శకత్వంలో ప్రియదర్శి కావ్య కళ్యాణ్ రామ్ జంటగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన చిత్రం బలగం.

తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలను కళ్ళకు కట్టినట్టు చూపించడమే కాకుండా కుటుంబం అంటే కలిసి ఉండాలని చాటి చెప్పిన ఈ సినిమా వెండితెరపై ఎంతో అద్భుతమైన ఆదరణ సంపాదించుకుంది. అదేవిధంగా ఓటిటిలో కూడా ఈ సినిమా ఊహించని విధంగా సక్సెస్ అందుకుందని చెప్పాలి. ఇలా వెండితెర పైన, ఓటిటిలోనూ ఎంతో మంచి సక్సెస్ అందుకున్న ఈ సినిమా బుల్లితెరపై కూడా ప్రసారమైంది.

 

ఇలా స్మాల్ స్క్రీన్ పై ప్రసారమైనటువంటి బలగం సినిమా ఇక్కడ కూడా పెద్ద ఎత్తున ప్రేక్షకులను ఆకట్టుకొని అద్భుతమైన రేటింగ్ కైవసం చేసుకుంది. స్టార్ మా ఛానెల్ లో వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ గా ప్రసారం చేసిన బలగం సినిమాకు ఏకంగా 14.3 టీఆర్పీ వచ్చింది. రీసెంట్ టైమ్స్ లో స్మాల్ స్క్రీన్ లో ప్రసారమైన సినిమాల్లో ఈ సినిమా అత్యధికంగా రేటింగ్ కైవసం చేసుకోవడం విశేషం.

 

హైదరాబాద్ సెగ్మెంట్ లోనైతే ఏకంగా 22 రేటింగ్ తో సంచలనం సృష్టించింది బలగం మూవీ.ఈ మధ్యకాలంలో భారీ బడ్జెట్ సినిమాలకు ఈ విధమైనటువంటి రేటింగ్ రావడం లేదని చిన్న సినిమాలకి పెద్ద ఎత్తున ప్రేక్షకులు పట్టడం కడుతున్నారని తెలుస్తోంది.కంటెంట్ ఉంటే సినిమాలో హీరో హీరోయిన్లు ఎవరు అనే విషయాన్ని పక్కన పెట్టి సినిమాని ఆదరిస్తారు అనడానికి బలగం సినిమా నిదర్శనం అని చెప్పాలి.

 

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -