Bandaru Satyanarayana: నడి సంద్రంలో టీడీపీ నౌక.. బండారు సత్యనారాయణ వల్ల టీడీపీ పరువు గంగలో కలిసిందా?

Bandaru Satyanarayana: ఏపీలో టీడీపీ పార్టీ నేతల పరిస్థితి అయోమయంగా మారింది. ఒకవైపు టీడీపీ అధినేత బాబు అరెస్టు అయ్యాడు అన్న బాధ,మరోవైపు ఆయనని విడిపించుకు రాలేదు అన్న బాధ. ఈ పరిస్థితిని అవకాశంగా తీసుకున్న వైసీపీ పార్టీ టీడీపీ పార్టీ పై అలాగే ఆ పార్టీ నేతలపై నోటికి వచ్చిన విధంగా కామెంట్స్ చేస్తూ విమర్శలు చేస్తూ సంతోషంతో చంకలు గుద్దుకుంటుంది. అంతేకాకుండా దాదాపు నలభై ఏళ్లుగా రాజకీయాల్లో ఉంటూ ఎమ్మెల్యేగా, మంత్రిగా చేసిన విశాఖ టీడీపీ నాయకుడు బండారు సత్యనారాయణమూర్తి మంత్రి రోజాపై చేసిన వ్యాఖ్యలు టీడీపీ నాయకుల మానసిక స్థితిని ప్రతిబింబిస్తున్నాయి.

మహిళా మంత్రిని ఉద్దేశించి రాయడానికి వీల్లేని భాషలో దూషిస్తూ ఘన కార్యం చేసినట్లు విర్రవీగడం చూస్తుంటే పార్టీ ఏ వైపు పయనిస్తోంది నాయకుల వ్యవహారశైలి ఇలా మారిందేమి అనే సందేహాలు కలుగుతున్నాయి. అంతేకాకుండా టిడిపి నాయకులు ఏం చేస్తున్నారు ఎలా మాట్లాడుతున్నారు ఎలా ప్రవర్తిస్తున్నారు తెలియని సోయలో ఉన్నారు. పార్టీ పెద్దదిక్కు అయినా చంద్రబాబు నాయుడు జైల్లో ఉండగా మరోవైపు యువనేత లోకేష్ కూడా పరారీలో ఉన్నారు. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అస్సలు ఉన్నాడో లేడో కూడా తెలీదు. సీనియర్లు యనమల,కెఈ కృష్ణమూర్తి వంటివారు కూడా సైలెంట్ అయ్యారు. ఇక జిల్లాల్లో క్యాడర్ సైతం గప్ చుప్ అయ్యారు. అలా మొత్తానికి పార్టీకి దిశానిర్దేశం లేక జాతరలో దారితప్పిన పిల్లాడిలా మారింది.

ఈ నేపథ్యంలోనే చంద్రబాబుకు, భువనేశ్వరి, బ్రహ్మణి వంటివారి దృష్టిలో పడేందుకు, సాధ్యమైనన్ని ఎక్కువ మార్కులు కొట్టేయడానికి బండారు వంటివారు తమ స్థాయి మరిచి సోయి తప్పి మాట్లాడుతున్నట్లు స్పష్టమవుతోంది. బాలకృష్ణ వంటి సంస్కారవంతైన నాయకుడిని రోజా విమర్శిస్తూ మాట్లాడతారా అంటూ బండారు తమ నాయకుడు బాలయ్యను వెనకేసుకు రావడం చూస్తుంటే ఆయనకు బాలయ్య లోని అజ్ఞానం కనిపించలేదు అనిపిస్తోంది. ఆడపిల్ల కనిపిస్తే ముద్దయినా పెట్టాలి,కడుపైనా చేయాలి అని బహిరంగంగా మాట్లాడిన బాలయ్యను సంస్కారానికి ప్రతిరూపం అని చెప్పడం ద్వారా బండారు తన గులాంగిరీ స్థాయిని బయటపెట్టకున్నారు. ఇలాగైనా చంద్రబాబు కుటుంబం ఆశీస్సులు పొందాలన్న ఆతృతతో బండారు మరో సీనియర్ నేత అయ్యన్నపాత్రుడు ఇష్టానుసారం మాట్లాడుతూ తమ నోటి దురద తీర్చుకుంటున్నారు. కానీ టీడీపీ అంతర్గత వర్గాలలో మాత్రం బండారు సత్యనారాయణ వల్ల టీడీపీ పరువు గంగలో అని చర్చించుకుంటున్నారు. మొత్తానికి టీడీపీ పరిస్థితి చూస్తుంటే నడి సముద్రంలో నౌకలా ఉంది.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -