BCCI: ఆ పదవికి దరఖాస్తు చేసుకున్న మాజీ దిగ్గజాలు..వారి మధ్య గట్టి పోటీ

BCCI: భారత క్రికెట్ చరిత్రను సచిన్ టెండూల్కర్ మలుపు తిప్పారు. ఆయన తర్వాత సెహ్వాగ్ కూడా అద్భుత రికార్డులు సాధించారు. ఈ ఇద్దరే కాకుండా ఇండియా టీమ్ ను విజయ తీరాలవైపు నడిపిన వారిలో మహేంద్ర సింగ్ ధోనీ కూడా ఉన్నారు. ప్రస్తుతం ఈ ముగ్గురు రిటైర్ అయ్యారు. అయితే సచిన్ బీసీసీఐకి పలు సందర్భాల్లో సేవలందిస్తూ వస్తున్నాడు.

సెహ్వాగ్ కూడా టీవీ కామెంట్రీలతో పాటు పలు విశ్లేషణలు చేస్తున్నారు. ప్రస్తుతం ధోనీ మాత్రమే ఐపీఎల్ లో కొనసాగుతున్నారు. అయితే ఇప్పుడు ఈ ముగ్గురూ సెలక్టర్ల రేసుకు వచ్చారు. సెలక్టర్లుగా వీరు ముగ్గురు దరఖాస్తు కూడా చేసుకున్నారు. ఈ మధ్య కాలంలో భారత సెలక్షన్ కమిటీ దారుణ వైఫల్యాలను ఎదుర్కొంటోంది. అందుకే సమర్ధుల కోసం బీసీసీఐ దరఖాస్తులు కోరుతోంది. అందులో భాగంగానే సచిన్, సెహ్వాగ్, ధోనీలు దరఖాస్తులు చేసుకోవడం విశేేషం. వారి దరఖాస్తులను చూసి అధికారులు కూడా ఆశ్చర్యపోయారు.

ఈ మధ్యన టీమిండియా వరుస వైఫల్యాలను చవిచూస్తోంది. ఏడాదిగా టీమిండియా పరాజయాల పాలు కావడంతో బీసీసీఐ ఇటీవల సెలక్షన్ కమిటీపై వేటు వేసి పలు చర్యలు తీసుకుంది. మళ్లీ కొత్త కమిటీ ఎంపికకు దరఖాస్తులను కూడా ఆహ్వానించింది. అయితే ఇందులో సచిన్, సెహ్వాగ్, ధోనీల పేరుతో కొందరు ఆకతాయిలు నకిలీ ఈ-మెయిల్ ఐడీలతో పంపించినట్లు తేలడంతో అధికారులు ఆశ్చర్యపోయారు.

పోస్టులు 5 ఉంటే దరఖాస్తులు మాత్రం 600 పైనే ఉన్నాయని, టీమిండియా సెలక్టర్ అంటే మామూలుగా ఉండదని కొందరు చెబుతన్నారు. ఇక్కడ మరో విషయం ఏంటంటే పాకిస్థాన్ మాజీ కెప్టెన్ ఇంజమామ్ ఉల్ హక్ పేరుతోనూ దరఖాస్తులు వచ్చినట్లు అధికారులు తెలిపారు. బీసీసీఐ సమయాన్ని వృథా చేసేందుకు కొందరు ఆకతాయిలు ఇలా చేసినట్లు అధికారులు గుర్తించారు. అయితే వినోద్ కాంబ్లి కూడా సెలక్టర్ పదవికి దరఖాస్తు చేసుకున్నట్లుగా తెలుస్తోంది.

Related Articles

- Advertisement -

ట్రేండింగ్

LIC policy: ఈ ఎల్ఐసీ పాలసీ గురించి తెలుసా.. రూ.కోటి పొందే అవకాశం!

LIC policy: లైఫ్ ఇన్స్యూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా వేర్వేరు వర్గాల కస్టమర్ల కోసం పలు రకాల పాలసీలను అందిస్తోంది. కస్టమర్ల అవసరాలను దృష్టిలో పెట్టుకొని ఎప్పటికప్పుడు వేర్వేరు ఎల్ఐసీ పాలసీలను ప్రకటిస్తూ...
- Advertisement -