Sneha Reddy: ఆ రీజన్ వల్లే బన్నీ భార్యలో ఇన్ని మార్పులు వచ్చాయా?

Sneha Reddy: సాధారణంగా మన స్థాయిని బట్టి మన మనస్తత్వం వ్యక్తిత్వం కూడా ఉంటుంది ఎప్పుడైతే మనకు హోదా స్థాయి పెరుగుతుందో అప్పుడు మన వ్యవహార శైలిలోనూ మన మనస్తత్వంలో కూడా మార్పులు చోటు చేసుకుంటాయి. అయితే ఇది కేవలం సాధారణ వారికి మాత్రమే కాకుండా స్టార్ సెలబ్రిటీలలో కొందరు ఇలా తమ హోదా స్థాయికి అనుగుణంగా నడుచుకుంటూ ఉంటారు. అలాంటి కోవకు చెందిన వారే అల్లు అర్జున్ సతీమణి స్నేహ రెడ్డి.

స్నేహ రెడ్డి ఓ గొప్ప ఇంటి కూతురు మాత్రమే కాకుండా మరో గొప్ప ఇంటి కోడలుగా అడుగు పెట్టారు. అయితే ఈమె భర్త సౌత్ ఇండస్ట్రీలో కొనసాగుతున్న సమయంలో అల్లు స్నేహారెడ్డి ప్రవర్తన కూడా చాలా మంచిగా ఉండేది ఎంతో సాంప్రదాయబద్ధంగా దుస్తులు ధరిస్తూ పద్ధతిగా కనిపించేవారు.అయితే ఎప్పుడైతే పుష్ప సినిమా ద్వారా అల్లు అర్జున్ పాన్ ఇండియా స్టార్ హీరోగా మారిపోయారో అదే సమయంలో స్నేహ రెడ్డి ప్రవర్తనలో కూడా మార్పులు చోటు చేసుకున్నాయి.

పాన్ ఇండియా స్టార్ హీరో భార్యలాగే ఈమె కూడా పెద్ద ఎత్తున గ్లామర్ షో చేస్తూ రచ్చ చేస్తున్నారు. ఈ క్రమంలోనే పలువురు నెటిజన్స్ ఈమె వ్యవహార శైలి పై తీవ్ర స్థాయిలో ట్రోల్స్ చేస్తున్నారు. అయితే అల్లు అర్జున్ తో పాటు ఎన్టీఆర్ రామ్ చరణ్ కూడా పాన్ ఇండియా స్టార్ హీరోలుగా గుర్తింపు సంపాదించుకున్నారు. అంతేకాకుండా ఈ ఇద్దరి హీరోలు గ్లోబల్ స్టార్ అనే టాగ్స్ కూడా తగిలించుకున్నారు.

కానీ ఈ ఇద్దరు హీరోల భార్యలు ఉపాసన లక్ష్మీ ప్రణతిలో మాత్రం ఎలాంటి మార్పులు లేదు.ఉపాసన ఎప్పుడు చూసినా నిండుగా దుస్తులు ధరిస్తూ మెగా కుటుంబ పరువు ప్రతిష్టలను కాపాడుతూ వస్తున్నారు. దేశం మారిన ఉపాసన వస్త్రధారణ మాత్రం మారదు.ఇక ఎన్టీఆర్ భార్య లక్ష్మీ ప్రణతి విషయానికి వస్తే కనీసం ఈమె సోషల్ మీడియాలో కూడా కనిపించదు. సోషల్ మీడియాకు కూడా దూరంగా చాలా సింపుల్ గా బ్రతుకుతున్నారు. ఇలా ఈ ఇద్దరి హీరోల భార్యలు మారకపోయినా స్నేహ రెడ్డి మాత్రం మారడంతో పలువురు ఈమె వ్యవహార శైలి పై కామెంట్లు చేస్తున్నారు.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -