YCP: గెలిస్తే ఏం చేస్తాడో చెప్పలేని పరిస్థితిలో జగన్.. ఇంత ఘోరమా?

YCP: విశాఖలోని భీమిలి నుంచి సీఎం జగన్ ఎన్నికల శంఖారావం పూరించారు. సిద్దం పేరుతో నిర్వహించిన సభలో వైసీపీ నేతలను, కార్యకర్తలను ఎన్నికలకు దిశానిర్థేశం చేశారు. అయితే, జగన్ స్పీచ్‌లో కొత్తదనం ఏం లేదు. బటన్ నొక్కే సభలో జగన్ ఏదైతే మాట్లాడుతారో? సిద్దం సభలో కూడా అదే మాట్లాడారు. ఒక సీఎంగా ఏదైనా కార్యక్రమంలో మాట్లాడినపుడు ఆ కార్యక్రమానికి సంబంధించి మాట్లాడాలి. ఆ పథకానికి ఎంత ఖర్చు అయిందో ప్రజలకు కోసం ఏం చేశామో చెబితే సరిపోతుంది. కానీ, జగన్ ఆ కార్యక్రమంలో కూడా చంద్రబాబు, పవన్ ను తిడతారు.

 

అది పక్కన పెడితే, ఇది ప్రభుత్వ కార్యక్రమం కాదు. ఎలక్షన్ మీటింగ్. ఇక్కడ నుంచి ప్రజల్లో తిరగాలి. ఒక్కొక్క నేత ప్రజలకు ఏం చేయాలో చెప్పాలి. ఏ ప్రాంతంలో ఏ సమస్యలు ఉన్నాయో వాటికి పరిష్కారం చూపిస్తామని హామీ ఇవ్వాలి. ప్రజలు ఏం కోరుకుంటున్నారో దాన్ని తెలుసుకొని మరోసారి అధికారంలోకి వస్తే.. ఆ పని పూర్తి చేస్తామని చెప్పాలి. మరి పార్టీ కార్యకర్తలు, నేతలు ఈ విధంగా ప్రజలకు హామీ ఇవ్వాలంటే.. జగన్ కూడా ఎన్నికల సభలో ప్రజలకు ఏం చేస్తామో చెప్పాలి. ఎన్నికల తర్వాత ఇది చేస్తామని జగన్ మచ్చుకు కూడా అనలేదు. ఎప్పటిలాగే.. చంద్రబాబు, పవన్‌ని తిట్టారు. ఈసారి షర్మిల, పురందేశ్వరిని కూడా కలిపారు. అంతే, అంతకు మించి ఇంకా ఏం మాట్లాడలేదు. చంద్రబాబు, పవన్ గురించి మాకెందుకు అని జనం అనుకునేలా చేశారు. మరోసారి గెలిపిస్తే మీరేం చేస్తారో చెప్పాలి కదా? కనీసం గతంలో బటన్ నొక్కే సభకు, సిద్దం సభకు తేడా ఏంటీ? ఏమైనా ఉందా? అసలు ఇది ఎన్నికల సభ అని ఎలా అనుకోవాలని అని చాలా ప్రశ్నలు వినిపిస్తున్నాయి.

కనీసం ఈ ఐదేళ్ల ఏం చేశారో.. అది అయినా చెప్పాలి కదా? ఇన్ని లక్షల కోట్లు జనం అకౌంట్స్ లో వేశాం. ఇది ప్రజల్లోకి తీసుకొని వెళ్తే మనం ఈజీగా మరోసారి గెలుస్తామని పార్టీనేతలకు చెప్పారు. నిజానికి జగన్ చెప్పినట్టు డబ్బు నేరుగా జనం అకౌంట్స్ లోకి వెళ్లింది. దానికి పార్టీ నేతలకు సంబంధం లేదు. ఎంత డబ్బు వేశారో జనానికి తెలుసు. జగన్ కి తెలుసు. పార్టీ నేతలకే ఇది కొత్త. కాబట్టి ప్రజలకు ఈ విషయం కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. పథకాల పేరుతో ఎంత డబ్బు వేశారో? తిరిగి ఎంతడబ్బు తీసుకున్నారో ప్రజలకు బాగా తెలుసు. కొత్తగా చెబితే ప్రజల అభిప్రాయాలు మారవు. జనానికి చెప్పాల్సింది అభివృద్ధి గురించి ఎన్ని ఉద్యోగాలు ఇచ్చాం? ఎన్ని కంపెనీలు తీసుకొచ్చాం? ఎన్ని రోడ్లు వేశాం? ఎన్ని ప్రాజెక్టులు కట్టాం? ఇవి జనానికి కావాలి. దీని బట్టి అభివృద్ధిపై ఓ లెక్క తెలుస్తోంది. కానీ, ఇవేమీ చెప్పకుండా డబ్బులు అకౌంట్ లో వేశామంటే.. ఐదేళ్లుగా ఈ విషయం చెబుతూనే ఉన్నారు. జనం వింటూనే ఉన్నారు.

 

రేపు ఏపీలో ఎలా చేయాలి అనుకుంటున్నారో చెబితే.. అది విని.. జనానికి నమ్మకం కలిగితే ఓటు వేస్తారు. లేదంటే లేదు. కానీ, అధికారంలోకి వచ్చిన తర్వాత ఏం చేస్తామో చెప్పకుండా ఎన్నికల ప్రచారం చేయడం.. ఆయుధం లేకుండా యుద్దానికి వెళ్లడం లాంటిదేనని సెటైర్లు పేలుతున్నాయి. అంతేకాదు, జనంతో మాట్లాడటానికి వీలుగా సిద్దం సభలో ఓ ర్యాంప్ ఏర్పాటు చేశారు. అది గ్రీన్ కలర్ లో శిలువ ఆకారంలో ఉంది. ఇది చూసిన క్రైస్తువులు.. దేవుడునే తొక్కున్నాడని అనుకుంటే.. ఇవేం పిచ్చి పనులు అని మిగిలిన వారు అనుకుంటున్నారు. మొత్తానికి ఏదో అనుకుంటే.. ఏదో జరిగిందే అనేలా తయారైంది సీఎం జగన్ సిద్దం సభ పరిస్థితి.’

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -