Bheemili: భీమిలి సభతో వైసీపీ సత్తా చూపనున్న జగన్.. ఆ రేంజ్ లో ఏర్పాట్లు చేశారా?

Bheemili: ఏపీ సీఎం జగన్ ఉత్తరాంధ్ర నుంచి ఎన్నికల శంఖారావాన్ని పూరించబోతున్నారు. భీమిలి నియోజకవర్గం తగరపువలస లో సిద్ధం పేరుతో భారీ బహిరంగ సభను నిర్వహించబోతున్నారు. ఈ మధ్యాహ్నం రెండున్నర గంటలకు సభ ప్రారంభం కానుంది. గత సభలకు భిన్నంగా ఈ సభను నిర్వహించబోతున్నారు. ఈ సభకు విజయనగరం, పార్వతీపురం, మన్యం జిల్లాలో నుంచి భారీ ఎత్తున తరలి వెళ్లడానికి పార్టీ శ్రేణులు సన్నద్ధమవుతున్నారు.

 

ఉత్తరాంధ్రలోని 34 అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించి విశాఖ జిల్లాలోని విశాఖపట్నం, భువనేశ్వర్ జాతీయ రహదారిని అనుకొని తగరపువలస 3 కోవేళ్ళు ఎదురుగా ఉన్న విశాలమైన స్థలాన్ని ఇందుకోసం ఎంపిక చేశారు. సభా వేదిక మాత్రమే కాకుండా పెద్ద ర్యాంపును కూడా ఏర్పాటు చేశారు. ఈ ర్యాంప్ మీద నడుచుకుంటూ వెళ్లి కార్యకర్తల్లో మమేకమవుతారు జగన్ పార్టీ కేడర్ అభిప్రాయాలను కూడా స్వయంగా తెలుసుకుంటారు.

ఎన్నికలలో ప్రజలను ఎలా భాగస్వామ్యం చేయాలి అనేది జగన్ కార్యకర్తలకు వివరిస్తారు. ప్రతి కుటుంబానికి వైసీపీ ప్రభుత్వం చేసిన మేలును గుర్తు చేసి ఓటు వేయించాలని కార్యకర్తలకు దిశా నిర్దేశం చేస్తారు. ఎన్నికలకు క్యాడర్ ను సంసిద్ధం చేయడమే లక్ష్యంగా నిర్వహించబోతున్న సిద్ధం సభలో భీమిలి సభతో ప్రారంభం కానున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా ఈ సభలు జరగనున్నాయి వచ్చే ఎన్నికల్లో 176 స్థానాలను గెలుచుకోవడమే ఈ లక్ష్యంగా ఈ సభలను నిర్వహిస్తున్నారు.

 

భీమిలి బహిరంగ సభకు ప్రతి నియోజకవర్గ నుంచి భారీ ఎత్తున పార్టీ శ్రేణులు తరలి వెళ్ళేందుకు ఇప్పటికే సన్నద్ధతపై ఆయా ఎమ్మెల్యేల ఆధ్వర్యంలో సమావేశాలు ఏర్పాటు చేశారు. వాహనాలు ఏ విధంగా సమకూర్చారు అనేది, ఎవరెవరు వెళ్లాలనేది ఇప్పటికే దిశా నిర్దేశం చేశారు. అన్ని జిల్లాల నుంచి క్యాడర్లు తరలివస్తున్న దృష్ట్యా ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా ఎవరు ఏ విధంగా ఏ సమయంలో చేరుకోవాలని నాయకులకు తెలియజేశారు

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -