Bhagavanth Kesari: భగవంత్ కేసరి బాలయ్య 2.ఓ.. బాక్సాఫీస్ వద్ద సరికొత్త రికార్డులు క్రియేట్ కానున్నాయా?

Bhagavanth Kesari: బాలయ్య సినిమాలు అంటే కచ్చితంగా యాక్షన్ బ్యాక్ డ్రాప్ తో వచ్చిన సినిమాలు గుర్తొస్తాయి. ఆయన సూపర్ హిట్ సినిమాలు సింహా, లెజెండ్, అఖండ సినిమాలని చూస్తే ఆయనలోని నట విశ్వరూపం మనకి కనిపిస్తుంది. అందుకే ఆయనని ఎక్కువగా యాక్షన్ ఓరియంటెడ్ సినిమాలలో చూడటానికి ఇష్టపడతారు ఆయన ఫ్యాన్స్. అయితే ఈ మధ్య రిలీజ్ అయిన అఖండ, వీర సింహారెడ్డి ఇంకా రిలీజ్ కి సిద్ధంగా ఉన్న భగవంత్ కేసరి సినిమాలలో ని పాత్రలలో ఒక సిమిలారిటీ కనిపిస్తుంది.

అదేమిటంటే ఆ పాత్రలన్నీ ఆయన వయసుకి తగ్గ విధంగా ఉన్నవే. సింహలో డాక్టర్ గా చేసినా, అఖండలో అఘోరగా చేసినా అవన్నీ బాలయ్య మాత్రమే చేయగలడు అనేలాగా నటించాడు బాలయ్య. భగవంత్ కేసరి లో కూడా ఆయన వయసుకు తగ్గట్టుగా తండ్రి పాత్రలో నటిస్తున్నాడు. ఈ సినిమాకి దర్శకుడు అనిల్ రావిపూడి. నిజానికి అనిల్ రావిపూడి కి ఈ జోనర్ పూర్తిగా కొత్త. ఇంతకుముందు ఆయన తీసిన సినిమాలన్నీ కామెడీ జోనర్ లో వచ్చినవే.

 

కానీ బాలకృష్ణ కోసం మాత్రం తన పంధా మార్చుకొని యాక్షన్ సీక్వెన్స్ ని తెరకెక్కిస్తున్నాడు. బాలయ్య కూడా అందుకు తగ్గట్టుగానే తన నట విశ్వరూపం చూపిస్తున్నాడు. సాధారణంగా షూటింగ్లో బాలకృష్ణ ఉంటే అందరూ చాలా గంభీరంగా ఉంటారు. బాలకృష్ణ వెళ్లి పలకరించడమే తప్పితే ఎవరూ చొరవచేసి ఆయనతో సరదాగా మాట్లాడరు. ఎందుకంటే ఎప్పుడు ఆయన స్వభావం ఎలా ఉంటుందో ఆయనకే తెలియదు అనేది ఒక టాక్.

 

అయితే భగవత్ సింగ్ షూటింగులో మాత్రం ఆయన ప్రవర్తన చాలా భిన్నంగా ఉంది అంటున్నారు. చాలా సరదాగా ఉంటూ షూటింగ్లో అందరినీ పేరుపేరునా పలకరిస్తూ చాలా హుందాగా ప్రవర్తిస్తున్నారట. అలాగే శ్రీలీలని కూడా అమ్మ.. అమ్మ అంటూ సొంత కూతురు లాగా ట్రీట్ చేస్తున్నారట. ఆయన అభిమానానికి శ్రీలీల కూడా తెగ సంబరపడిపోతుందట. మరి ఈ సినిమా కూడా బాక్స్ ఆఫీస్ వద్ద రికార్డులు క్రియేట్ చేస్తాయా అంటే సినిమా విడుదల అయ్యేవరకు చూడాల్సిందే.

Related Articles

ట్రేండింగ్

Nara Chandrababu Naidu: అలా జరిగి ఉంటే ఓట్లు అడిగేవాడిని కాదు.. చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు వైరల్!

Nara Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు ప్రజాగళంలో భాగంగా ఆదివారం కర్నూలు జిల్లా మంత్రాలయం నియోజకవర్గంలో కౌతాళం సభలో మాట్లాడారు. జగన్ పాలన గురించి మాట్లాడుతూ గత ఐదేళ్లలో రాష్ట్రంలో ఎలాంటి అభివృద్ధి...
- Advertisement -
- Advertisement -