Bhargav Ram: భార్గవ్ రామ్ ప్రతిభ గురించి తెలిస్తే షాక్ అవ్వాల్సిందే!

Bhargav Ram: ప్రస్తుతం టాలీవుడ్‌లో స్టార్ హీరోగా కొనసాగుతున్న వారిలో జూనియర్ ఎన్టీఆర్ ఒకరు. బాల నటుడిగా ఇండస్ట్రీలో అడుగుపెట్టిన ఎన్టీఆర్.. ‘నిన్ను చూడాలని’ సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. రాజమౌళి దర్శకత్వంలో ‘స్టూడెంట్ నెం.1’ సినిమాలో నటించాడు. ఈ సినిమా మంచి హిట్ అందుకుంది. ‘ఆది, సింహాద్రి’ సినిమాలు ఎన్టీఆర్ కెరీర్‌లో ది బెస్ట్ గా నిలిచాయి. యమదొంగ సినిమాలో యముడి పాత్రలో ఎన్టీఆర్‌ యాక్టింగ్‌కు మంచి మార్కులు పడ్డాయి. ‘టెంపర్, నాన్నకు ప్రేమతో, జనతా గ్యారేజ్, జై లవకుశ’ సినిమాల్లో ఎన్టీఆర్ విభిన్న పాత్రల్లో నటించి.. తన నట విశ్వరూపాన్ని చూపించాడు. ఎన్టీఆర్.. బుల్లితెరపై కూడా అడుగులు వేశారు. బుల్లితెర రియాలిటీ షో.. ‘బిగ్‌బాస్‌’కు హోస్ట్ గా కూడా వ్యవహరించారు.

 

కాగా, ఎన్టీఆర్‌కు 2011 మే 5న లక్ష్మీ ప్రణతితో వివాహం జరిగింది. వీరికి ఇద్దరు పిల్లలు. 2014లో మొదటి కొడుకు అభయ్ రామ్ పుట్టాడు. 2019లో రెండో కొడుకు భార్గవ్ రామ్ జన్మించాడు. ఎన్టీఆర్‌కు సినిమాలు ఎంత ఇష్టమో.. ఫ్యామిలీతో టైం స్పెండ్ చేయడం కూడా అంతే ఇష్టం. ఎన్టీఆర్ పిల్లలకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు చాలా రేర్‌గా బయటికి వస్తుంటాయి. అయితే తాజాగా ఎన్టీఆర్ చిన్న కొడుకు భార్గవ్ రామ్‌కు సంబంధించిన ఓ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. ప్రస్తుతం భార్గవ్ రామ్ వయసు కేవలం నాలుగేళ్లే. అయితే భార్గవ్.. తన బుజ్జి బుజ్జి మాటలతో డైలాగ్స్ అద్భుతంగా చెప్పాడు. ఎన్టీఆర్ వీడియోను చూసి అదే విధంగా ఎక్స్ ప్రెషన్స్ ఇస్తూ భార్గవ్ డైలాగ్‌లను చెప్తాడు. ఈ వీడియోను చూసిన ఎన్టీఆర్ ఫ్యాన్స్ సంతోషంలో మునిగి తేలుతున్నారు. భార్గవ్ డైలాగ్స్, క్యూట్ ఎక్స్ ప్రెషన్స్ కి అందరూ ఫిదా అవుతున్నారు. పులి కడుపున పులే పుడుతుందని కామెంట్లు చేస్తున్నారు. భవిష్యత్‌తో భార్గవ్ స్టార్ హీరో అవ్వడం కన్‌ఫర్మ్ అని అభిమానులు చెప్పుకొస్తున్నారు.

 

Related Articles

ట్రేండింగ్

Andhra Pradesh Assembly Elections: గులకరాళ్లతో, పసుపు చీరలతో రాజకీయాలు.. ఏపీ పరిస్థితి ఇంత దారుణంగా ఉందా?

Andhra Pradesh Assembly Elections: మరొక రెండు వారాలలో ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలతో పాటు పార్లమెంట్ ఎన్నికలు కూడా జరగబోతున్నటువంటి నేపథ్యంలో రాజకీయ వేడి రాజుకుంది. ఈ విధంగా ఎన్నికల త్వరలో జరగబోతున్నటువంటి...
- Advertisement -
- Advertisement -