Bhola Shankar: భోళా శంకర్ ఫ్లాపైతే మెహర్ రమేష్ కు ఇబ్బందేనా.. ఆ స్టార్లు ఛాన్స్ ఇవ్వలేరా?

Bhola Shankar: మెగాస్టార్ చిరంజీవి మెగా మూవీ బోళా శంకర్ ఆగస్టు 11న రిలీజ్ డేట్ ఫిక్స్ చేసిన సంగతి అందరికీ తెలిసిందే. ఈ ఏడాది సంక్రాంతికి వాల్తేరు వీరయ్య గా వచ్చి హిట్ అందుకున్న చిరంజీవి బోళా శంకర్ తో కూడా ఆ రేంజ్ హిట్ కొట్టాలని చూస్తున్నాడు. బోళా శంకర్ సినిమా మెగా మార్క్ ఎంటర్టైర్ గా వస్తుందని తెలుస్తుంది. ముఖ్యంగా దశాబ్దం కాలం తర్వాత డైరెక్షన్ చేస్తున్న మెహర్ రమేష్ ఈసారి హిట్ టార్గెట్తో రంగంలో దిగుతున్నాడు.

శక్తి సినిమా వంటి భారీ అపజయాన్ని మూట కట్టుకున్న తర్వాత కూడా చిరంజీవితో సినిమా చేస్తున్నాడు అంటే అది నిజంగా అతనికి సెకండ్ లైఫ్ లాంటిదే. నిజానికి చిరంజీవి రిస్క్ ఫేస్ చేశాడనే చెప్పాలి. ఈ సినిమా హిట్ అయితే మాత్రం మళ్లీ మెహర్ రమేష్ మళ్లీ హిట్ ట్రాక్ లోకి వచ్చినట్లే. కానీ ఈ సినిమా ఫ్లాప్ అయితే మాత్రం మెహర్ పరిస్థితి మరింత దారుణంగా ఉంటుంది. ఈ సినిమాలో తమన్నా, కీర్తి సురేష్ హీరోయిన్స్ గా నటించారు. ఇది ఇలా ఉండగా భోళా శంకర్ సినిమా వేదాళం అనే తమిళ సినిమాకి రీమేక్.

 

ఈ సినిమాకి ఏమాత్రం ఫామ్ లో లేని మెహర్ రమేష్ ని డైరెక్టర్ గా పెట్టడం చిరు ఫ్యాన్స్ భరించలేకపోతున్నారు. అందుకే మూవీ పై పెద్దగా ఇంట్రెస్ట్ చూపించడం లేదు. పైగా ఈ రీమేక్ అవసరమా అంటూ సోషల్ మీడియాలో సైతం కామెంట్స్ వస్తున్న మాట నిజం కానీ ఇవేవీ పట్టించుకోకుండా మెహర్ రమేష్ మాత్రం దూసుకుపోతున్నాడు. అనుకున్నట్టే ఈ టీజర్ ఏమాత్రం ఆకట్టుకునే లాగా లేదు.

 

ఒక రొటీన్ మాస్ మూవీ లాగా టీజర్ ఉంది. ఈ సినిమాలో మెగాస్టార్ గెటప్, తెలంగాణ యాస, డైలాగులు ఏమాత్రం ఇంప్రెస్ చేసే లాగా లేవు. సోషల్ మీడియాలో ఇది కూడా ఈ సినిమాపై నెగటివ్ కామెంట్స్ ఎక్కువగా వస్తున్నాయి. సినిమా ఏ మాత్రం తేడా కొట్టిన ట్రోల్లింగ్ కి కేరాఫ్ అడ్రస్ గా మారిపోవడం ఖాయం అంటున్నారు నెటిజన్స్. మరి ఈ సినిమా హిట్టు ఫట్టు తెలియాలంటే 11 వ తారీకు వరకు ఆగాల్సిందే.

 

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -