Bhuma Naga Mounika: భూమా మౌనికకు ఏకంగా ఆ రేంజ్ లో అస్తులున్నాయా?

Bhuma Naga Mounika: మోహన్ బాబు తనయుడు మనోజ్ రెండో పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. మార్చి 3వ తేదీన తన స్నేహితురాలు భూమా మౌనిక రెడ్డిని తన జీవితంలోకి ఆహ్వానిస్తూ మూడు ముళ్ళు వేశారు మంచు మనోజ్. ఈ క్రమంలోనే ఈ జంట గురించి ఆసక్తికర విషయాలు తెలుస్తున్నాయి. ఇంకా చెప్పాలంటే మౌనిక రెడ్డి గురించి ఓ షాకింగ్ విషయం తెలిసింది.

మంచు వారబ్బాయి, మోహన్ బాబు తనయుడు మనోజ్ రెండో పెళ్లి చేసుకున్నాడు. పొలిటికల్ బ్యాగ్రౌండ్ ఉన్న భూమా ఫ్యామిలీ అమ్మాయితో వివాహం అయ్యింది. వీరి పెళ్లికి సినీ, రాజకీయ ప్రముఖలు వచ్చారు. అంగరంగం వైభవంగా ఈ పెళ్లి జరిగింది. మోహన్ బాబుకు మెుదట ఈ పెళ్లి ఇష్టం లేదని తెలిసింది. కానీ ఆ తర్వాత పెళ్లికి వచ్చి, కొత్త జంటను ఆశీర్వదించారు మోహన్ బాబు.

 

రెండు కుటుంబాలకు మంచి బ్యాగ్రౌండ్ ఉంది. మోహన్ బాబుకు కూడా భారీగా ఆస్తులు ఉన్నాయి. ఇటు సినీ రంగం, అటు విద్యా రంగంలో వందల కోట్లు సంపాంధించినట్లు సమాచారం. భూమా ఫ్యామిలీ కూడా ఎప్పటి నుంచో సౌండ్ పార్టీ. వీరికి వేల కోట్ల ఆస్తులు ఉన్నట్లు తెలుస్తోంది. తల్లిదండ్రులు ఇద్దరూ లేకపోయినా, ముగ్గురు పిల్లలకు భూమా నాగిరెడ్డి ఆస్తులు పంపకాలు చేసినట్లు సమాచారం. ఈ లెక్కనే భూమా మౌనిక రెడ్డికి ఏకంగా వేల కోట్ల ఆస్తి వాటా కింద వచ్చింది. సుమారు 2 వేల కోట్లకుపైగానే మౌనికా రెడ్డికి ఆస్తులు ఉన్నట్లు తెలుస్తోంది.

ప్రణతి రెడ్డిని పెళ్లాడాక ముందునుంచే మంచు మనోజ్, భూమా మౌనిక రెడ్డి మంచి స్నేహితులు. అప్పట్లో మౌనిక మొదటి పెళ్లికి కూడా మనోజ్ అటెండ్ అయ్యారు. కానీ అనుకోని కారణాల వల్ల ఇద్దరూ మెుదటి వ్యక్తులతో విడాకులు తీసుకున్నారు. అయితే ఇప్పుడు అదే మౌనిక.. మనోజ్ రెండో భార్యగా మంచు వాటింట అడుగుపెట్టింది.

Related Articles

ట్రేండింగ్

Andhra Pradesh Assembly Elections: గులకరాళ్లతో, పసుపు చీరలతో రాజకీయాలు.. ఏపీ పరిస్థితి ఇంత దారుణంగా ఉందా?

Andhra Pradesh Assembly Elections: మరొక రెండు వారాలలో ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలతో పాటు పార్లమెంట్ ఎన్నికలు కూడా జరగబోతున్నటువంటి నేపథ్యంలో రాజకీయ వేడి రాజుకుంది. ఈ విధంగా ఎన్నికల త్వరలో జరగబోతున్నటువంటి...
- Advertisement -
- Advertisement -