Bhuma Mounika: తన అమ్మనాన్న గురించి అలాంటి వ్యాఖ్యలు చేసిన భూమా మౌనిక రెడ్డి?

Bhuma Mounika: భూమా మౌనిక తెలుగు రాష్ట్రాల ప్రజలకు అంతగా పరిచయం లేకపోవచ్చు. కానీ ఆమె తండ్రి భూమా నాగిరెడ్డి అంటే ఎవరైనా గుర్తు పడతారు. భూమా నాగిరెడ్డి కర్నూలు జిల్లా రాజకీయాన్ని ఒక రేంజ్ లో శాసించాడు. అప్పట్లో భూమా నాగిరెడ్డి మంత్రిగా కూడా కర్నూలు జిల్లాలో ఒక వెలుగు వెలిగాడు. ఇటువంటి భూమా నాగిరెడ్డి 2017లో మార్చి 12 న గుండెపోటుతో మరణించాడు.

ఇక ఇటీవల భూమా నాగిరెడ్డి రెండవ కూతురు మౌనిక రెడ్డి మంచు మనోజ్ తో కలిసి హైదరాబాదులో ఉన్న సీతాఫల్ మండి అనే గణేష్ గుడిలో పూజలు చేసారు. ఈ నేపథ్యంలో వీరిద్దరి ఫోటోలు సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతున్నాయి. అంతేకాకుండా వీరిద్దరు త్వరలో పెళ్లి చేసుకోబోతున్నారని వార్తలు కూడా సోషల్ మీడియాలో జోరుగా వినిపిస్తున్నాయి. ఇక ఇటీవలే టీవీ9 మీడియాతో మాట్లాడుతూ మౌనిక తన ఫ్యామిలీ గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలు బయట పెట్టింది.

ఆ మీడియాతో మాట్లాడుతూ మౌనిక రెడ్డి మా నాన్న ఎప్పటికీ నా హీరో అని తెలిపింది. మా నాన్న మీద ఉన్న భయం, రెస్పెక్ట్ ఎప్పటికీ నాకు అలాగనే ఉంటుందని తెలిపింది. ఇక మా నాన్న క్యారెక్టర్ నుంచి చాలా నేర్చుకున్నాను అని చెప్పుకు వచ్చింది. అప్పట్లో ఫ్యాక్షనిజం నేపథ్యంలో మా నాన్నగారు మమ్మల్ని దూరంగా చదివించారు. ఇక ఉన్నన్ని రోజులు తన తండ్రి వాళ్ళని బాగా చూసుకున్నాడని మౌనిక రెడ్డి వెల్లడించింది.

ఇక పగలు, రాత్రి నాన్న ప్రజల గురించి మా గురించి ఆలోచించే వారిని తెలిపింది. ఇక మా అమ్మ, నాన్న చనిపోయి.. పైన చాలా హ్యాపీగా ఉంటున్నట్లు నేను భావిస్తున్నాను అన్నట్లు తెలిపింది. ఇక తన తండ్రి ఎప్పుడూ నంద్యాల ప్రజలు నంద్యాల ప్రజలు అంటూ జపం చేసేవాడని, చివరికి మాకు కూడా అదే నింపి వెళ్లిపోయాడని మౌనిక తెలిపింది. ఇక నేను.. మా అమ్మ బ్రతికి ఉన్నప్పుడు తనని ఫన్నీగా ఏడిపించే దాన్ని.. అలా నేను మా అమ్మని ఏడిపించడాన్ని మా నాన్న బాగా ఎంజాయ్ చేస్తూ ఉంటాడు అని తెలిపింది మౌనిక.

Related Articles

ట్రేండింగ్

Janasena Glass Symbol Confusion: గాజు గ్లాస్ గందరగోళం వెనుక తప్పెవరిది.. జనసేనకు చేటు చేయాలనే కుట్ర చేశారా?

Janasena Glass Symbol Confusion: ఎన్నికలు సమీపిస్తున్నటువంటి తరుణంలో ప్రజలందరికీ కూడా ఓట్లు వేసే విధానంపై అవగాహన కల్పిస్తున్నారు. అయితే పార్టీలకు గుర్తింపు ఉంటే ఆ పార్టీ సింబల్ ను అధికారకంగా రిజర్వ్...
- Advertisement -
- Advertisement -