God Father: చిరంజీవి నటించిన గాడ్ ఫాదర్ పై పెరిగిన భారీ అంచనాలు.. సెన్సార్ బోర్డు సైతం ప్రశంసలు!

God Father: మెగాస్టార్ చిరంజీవి తెలుగు చలనచిత్ర ప్రముఖ నటుడుగా అందరికీ సుపరిచితమే. గత కొన్ని దశాబ్దాలుగా తెలుగు ఇండస్ట్రీలో అగ్ర హీరోగా కొనసాగుతున్నారు. చిరంజీవి సినిమా రంగంలోనూ, రాజకీయరంగంలోనూ మంచి పేరు, గుర్తింపు సంపాదించుకున్నారు.

ఇక అసలు విషయానికి వస్తే చిరంజీవి నటించిన ఆచార్య సినిమా సానుకూల ఫలితాలు రావడం అందరికీ తెలిసిందే. అయితే అక్టోబర్ 5న చిరంజీవి నటించిన గాడ్ ఫాదర్ సినిమా విడుదల అవుతూ ఉండడంతో ప్రేక్షకుల్లో ఆనందం నెలకొంది. మలయాళం లో సూపర్ హిట్ అయిన లూసిఫర్ చిత్రానికి ఇది రీమేక్ అని తెలియగానే దీనిపై భారీగా అంచనాలు పెరిగాయి.

అయితే ఇలాంటి పొలిటికల్ యాక్షన్ చిత్రాలు చాలానే వచ్చాయి. కానీ ఇందులో విశేషమేమిటంటే ఈ చిత్రం రీమేక్ బాధ్యతను దర్శకుడు మోహన్ రాజాకు అప్పగించడం జరిగింది. మోహన్ రాజా రీమేక్ కింగ్ గా ప్రసిద్ధి చెందిన విషయం తెలిసిందే. ఆయన కాస్త సంథింగ్ స్పెషల్ గా దర్శకత్వం వహించినట్లు సమాచారం.

ఈ చిత్రంలో నయనతార ఇంకా సల్మాన్ ఖాన్ కూడా నటించడంతో ఈ సినిమా క్రేజ్ భారీగా పెరిగింది. ఇక ఈ సినిమా సెన్సార్ బోర్డు పనులు పూర్తిచేసుకుని, U/A సర్టిఫికెట్ కూడా పొందింది. ఇక సెన్సార్ బోర్డు సభ్యులు సైతం సినిమా అద్భుతంగా ఉందని చిత్ర యూనిట్ పై ప్రశంసల వర్షం కురిపించారు.

ఇక ఈ చిత్రాన్ని తెలుగు, హిందీ భాషలలో దసరా కానుకగా అక్టోబర్ ఐదు న ప్రేక్షకుల ముందుకు వస్తుందని నిర్మాతలలో ఒకరైన ఎన్ వి ప్రసాద్ తెలిపారు. ఇక భారతదేశ చలనచిత్ర పరిశ్రమ లో మెగాస్టార్స్ అయినా చిరంజీవి, సల్మాన్ ఖాన్ ఈ సినిమాలో నటించడంతో భారీ సక్సెస్ సొంతమవుతుందని మరో నిర్మాత ఆర్.బి చౌదరి తెలిపారు. ఈ సినిమాకు కొణిదెల సురేఖ సమర్పకురాలుగా, సూర్య సెల్వరాజన్ ఆర్ట్ డైరెక్షన్ చేశారు.

Related Articles

ట్రేండింగ్

Pawan Kalyan: జనసేన పార్టీ నేతలకు కీలక ఆదేశాలు ఇచ్చిన పవన్ కళ్యాణ్.. ఆ నేతలు పాటిస్తారా?

Pawan Kalyan:  పవన్ కళ్యాణ్ లో ఇప్పుడు పరిపూర్ణ రాజకీయ నాయకుడు కనిపిస్తున్నాడు. పార్టీకి సంబంధించి అనేకమైన కీలక నిర్ణయాలను చాలా పరిణితితో తీసుకుంటున్నారు. పోలింగ్ రెండు వారాల్లో ఉంది కాబట్టి ఈ...
- Advertisement -
- Advertisement -