Adipurush: ఆదిపురుష్ కు నైజాంలో భారీ షాక్.. అసలేం జరిగిందంటే?

Adipurush: టాలీవుడ్ పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటించిన తాజా చిత్రం ఆదిపురుష్. ప్రస్తుతం ఎక్కడ చూసినా కూడా ఈ సినిమా పేరు వినిపిస్తోంది. సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా కూడా ఈ సినిమాకు సంబంధించిన వార్తలు వినిపిస్తున్నాయి. ఈ సినిమా కోసం అభిమానులు కళ్ళు కాయలు కాచే విధంగా ఎదురుచూస్తున్నారు. ఈ సినిమా విడుదల కావడానికి కేవలం ఒక్కరోజు మాత్రమే సమయం ఉంది. జూన్ 16 న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ గా విడుదల కానుంది. ఇది ఇలా ఉంటే ఈ సినిమా ఇంకా విడుదల కాకముందే కనెక్షన్ల విషయంలో థియేటర్ల విషయంలో గందరగోళం నడుస్తోంది. ఆ సంగతి పక్కన పెడితే ప్రస్తుతం నైజాంలో ఆది పురుష్ సినిమా టీం కి భారీ షాక్ తగిలేలా కనిపిస్తోంది.

ఎందుకంటె నైజాంలో డీపాల్ట్ గా వున్న బయ్యర్లు కాకుండా కొత్త వాళ్లు ఎవరు సినిమా కొన్నా ఇక్కడ ఇబ్బందులు ఎదుర్కోవాల్సిందే. అది ఎంత సౌండ్ పార్టీ అయినా పాట్లు తప్పవు. ఈ ఏడాది సంక్రాంతికి వీరసింహారెడ్డి, వాల్తేర్ వీరయ్య విడుదల సమయంలో కూడా ఇదే సమస్య. మళ్లీ ఇప్పుడు ఆదిపురుష్ కు ఇదే సమస్య రిపీట్ అవుతోంది. థియేటర్ అడ్వాన్స్ లు అనుకున్న మేరకు రావు, అద్దెలు అమాంతం పెరిగిపోతాయి. కాగా ఈ స్ట్రక్చర్ ఎలా వుంటుందంటే డిస్ట్రిబ్యూటర్ కు వున్న క్రెడిబులిటీ, నమ్మకం, సినిమా స్టామినా ఇవన్నీ బట్టి థియేటర్ల నుంచి అడ్వాన్స్ లు వస్తాయి. అవన్నీ కలిపి, తన స్వంత సొమ్ము జోడించి నిర్మాతకు ఇస్తారు డిస్ట్రిబ్యూటర్.

ఆదిపురుష్ సినిమాను నైజాం ఏరియాకు 50 కోట్ల నాన్ రిటర్నబుల్, 10 కోట్ల రిటర్నబుల్ అడ్వాన్స్ బేసిస్ లో కొన్నారు మైత్రీ డిస్ట్రిబ్యూటర్లు. ఇప్పుడు ఆ మేరకు కాకపోయినా కనీసం ఒక నలభై నుంచి యాభై కోట్లు అయినా అడ్వాన్స్ లు థియేటర్ల నుంచి రావాలి. కానీ అక్కడే వచ్చింది సమస్య. పెద్ద ఎగ్జిబిటర్ల నుంచి సహాయ నిరాకరణ ఎదురయింది. సంక్రాంతి సమయంలో ఇచ్చిన రేషియోలో కూడా అడ్వాన్స్ లు ఇవ్వడానికి ముందుకు రావడం లేదు. పోనీ సొంత సొమ్ము అన్న జత చేద్దాం అనుకుంటే మరొకవైపు నుంచి ఇంకో విధమైన ట్రీట్ మెంట్ ఎదురైంది. సంక్రాంతి సమయంలోనే రెంట్లు పెంచేసారు. ఇప్పుడు మళ్లీ అంతకన్నా పెంచి లిస్ట్ ఇచ్చారని తెలుస్తోంది. అసలే థియేటర్లకు సినిమాలు లేవు, అడ్వాన్స్ లు ఇవ్వలేము అంటూ, థియేటర్ల రెంట్లు పెంచడం ఏమిటి అన్నది వీళ్ల బాధ.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -