Tammineni Seetharam: ఆముదాలవలస రివ్యూ.. ఏపీ స్పీకర్ కు షాక్ తప్పదా.. ఓటమికి సిద్ధం కావాల్సిందేనా?

Tammineni Seetharam: తెలుగు రాష్ట్రాల రాజకీయాల్లో స్పీకర్ సెంటిమెంట్ బలంగా ఉంటుంది. స్పీకర్ గా పని చేసిన వ్యక్తి మరోసారి గెలవరనే సెంటిమెంట్ ఉంది. నాదండ్ల మనోహర్, ప్రతిభా భారతి, కోడెల శివప్రసాద్ లాంటివారు దీనికి ఉదాహరణ. స్పీకర్ పోటీ చేసిన వాళ్లు ఓడిపోవడమే కాకుండా.. వారి రాజకీయ భవిష్యత్ కూడా అక్కడి నుంచి మసకబారుతుంది. అయితే, ఈ సెంటిమెంట్ ను పోచారం శ్రీనివాస్ రెడ్డి బ్రేక్ చేశారు. కానీ, ఆయన పార్టీ మాత్రం ఓడిపోయింది. దీంతో.. ఇప్పుడు అందరి చూపు శ్రీకాకుళం జిల్లా ఆముదాలవలస నుంచి పోటీ చేస్తున్న స్పీకర్ తమ్మినేని సీతారంపై పడింది. ఆయన ఇప్పుడు గెలుస్తారా? ఓడిపోతారా? అన్న ఉత్కంఠ నెలకొంది.

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో కానీ.. విభజిత ఆంధ్రలో కానీ.. ఆ సెంటిమెంట్ వర్క్ అవుట్ వస్తూ ఉంది. దీంతో ఆ టెన్షన్ స్పీకర్ తమ్మినేనిలో ఉంటుంది. అందుకే.. ఆయన గడిచిన ఐదేళ్లలో స్పీకర్ పదవి నుంచి బయటకు వచ్చి మంత్రి పదవిని చేపట్టాలని చాలా బలంగా ప్రయత్నించారు. చాలా సార్లు అసెంబ్లీలో మంత్రుల కంటే ఎక్కువగా అధికార పార్టీని ప్రొటక్ట్ చేస్తూ వచ్చారు. ఇలా జగన్ మన్ననలు పొంది మంత్రిగా చాన్స్ కొడదామని చూశారు. కానీ.. జగన్ మాత్రం ఆయనకు అవకాశం ఇవ్వలేదు. మంత్రిగా పని చేయాలని తమ్మినేని సీతారం కల. అందుకే.. స్పీకర్ గా ఉంటూనే మంత్రి పదవి కోసం ప్రయత్నించారు. కానీ, అది నెరవేరలేదు. మంత్రిపదవిని చేపడితే.. రాజకీయాలను నుంచి తప్పుకొని తన కొడుకును రాజకీయ అరంగేట్రం చేయాలని అనుకున్నారు. కానీ, మంత్రిగా పని చేసే అవకాశం దక్కకపోవడంతో.. మరోసారి గెలిచి మంత్రిగా అసెంబ్లీలో అడుగుపెట్టాలని అనుకుంటున్నారు. అందుకే, తన కొడుకును అసెంబ్లీ బరిలో దించాలనే ఆలోచనను విరమించుకొని మరోసారి ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నారు. ప్రస్తుతం ఆయన్ని ఎలాగూ స్పీకర్ సెంటిమెంట్ వెంటాడుతుంది. కనీసం నియోజవర్గంలో పరిస్థితులు ఎలా ఉన్నాయని చూస్తే అవి కూడా ఆయనకు ప్రతికూలంగానే ఉన్నాయి.

తమ్మినేనిపై నియోజకవర్గ ప్రజలు వ్యతిరేకంగా ఉన్నారు. ఇసుక దందా, అక్రమ కేసులు బనాయించరనే ఆరోపణలు ఉన్నాయి. తమ్మినేనిపై ఆయన బావమరిది కూన రవికుమార్ పోటీ చేస్తున్నారు. 2014లో సీతరాంను ఆయన ఓడించి గెలిచారు. 2019లో తమ్మినేని అత్తెసరు మెజార్టీతో గెలిచారు. ఇప్పుడు మరోసారి వారిద్దరూ తలపడనున్నారు. గత ఐదేళ్లలో టీడీపీ నేతలపై అక్రమకేసులు పెరిగాయి. వారికి అండగా కూన రవికుమార్ అండగా ఉన్నారు. దీంతో.. ఆయనపై సానుభూతి పెరిగింది. అటు.. 2014- 2019 మధ్యలో ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో కూన రవికుమార్ ఇలాంటి అక్రమకేసులు, కక్షపూరిత చర్యలకు పాల్పడలేదు. దీంతో.. ఇద్దరి మధ్య తేడా నియోజవర్గ ప్రజలకు తెలిసింది. ఓవైపు ప్రజలు, టీడీపీ శ్రేణులు తమ్మినేని ఓడించాలని బలంగా అనుకుంటుంటే.. వైసీపీ శ్రేణులు కూడా ఆయనకు పూర్తిగా సహకరించే పరిస్తితి లేదు.

ఆయనకు టికెట్ ఇవ్వొద్దని.. ఏడాది ముందు నుంచి నియోజవర్గ నేతలు అధిష్టానాన్ని కోరుతున్నారు. కానీ, జగన్ దగ్గర స్వామి భక్తి ప్రదర్శించి టికెట్ తెచ్చుకున్నారు తమ్మినేని. అయితే.. టికెట్ తెచ్చుకున్నంత ఈజీగా గెలిచే పరిస్థితి కనిపించడం లేదు. ఆయనకు టికెట్ ఇచ్చిన వెంటనే అధిష్టానం నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ జిల్లా గ్రంథాలయ చైర్మన్ పదవికి రాజీనామా చేసి నువ్వారి గాంధీ కుటుంబం వైసీపీకి గుడ్ బై చెప్పింది. ఇక..ఆముదాలవలస మండలంలో కోట గోవింద్ రావు బ్రదర్స్ కూడా తమ్మినేనికి సపోర్టు చేసేదే లేదని చెబుతున్నారు. దీంతో.. తమ్మినేని ఓటమి ఖాయంగా తెలుస్తోంది. తమ్మినేని కూడా స్పీకర్ సెంటిమెంట్ ను కొనసాగిస్తారని అంటున్నారు.

Related Articles

ట్రేండింగ్

Pawan Kalyan: జనసేన పార్టీ నేతలకు కీలక ఆదేశాలు ఇచ్చిన పవన్ కళ్యాణ్.. ఆ నేతలు పాటిస్తారా?

Pawan Kalyan:  పవన్ కళ్యాణ్ లో ఇప్పుడు పరిపూర్ణ రాజకీయ నాయకుడు కనిపిస్తున్నాడు. పార్టీకి సంబంధించి అనేకమైన కీలక నిర్ణయాలను చాలా పరిణితితో తీసుకుంటున్నారు. పోలింగ్ రెండు వారాల్లో ఉంది కాబట్టి ఈ...
- Advertisement -
- Advertisement -