Bigg Boss 6 Telugu: ఇష్టం లేకపోతే బయటకు వెళ్ళండి.. సీరియస్ వార్నింగ్ ఇచ్చిన బిగ్ బాస్!

Bigg Boss 6 Telugu: ఇండియాస్ బిగ్గెస్ట్ రియాలిటీ షోగా బిగ్ బాస్ రియాలిటీ షో గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. దేశవ్యాప్తంగా అన్ని భాషలలో ప్రసారమవుతున్న ఈ రియాలిటీ షో తెలుగులో కూడా గత కొన్ని సంవత్సరాలుగా ప్రసారమవుతోంది. ఇప్పటికే ఐదు సీజన్లు పూర్తి చేసుకున్న ఈ రియాలిటీ షో ఇటీవల ఆరవ సీజన్ కూడా ప్రారంభమైంది. ఈ ఆరవ సీజన్లో మొత్తం 21 మంది కంటెస్టెంట్లు పాల్గొన్నారు.

ఇప్పటికే ఆరు వారాలు పూర్తి చేసుకున్న ఈ సీజన్ 6 లో మొత్తం 6 మంది కంటెస్టెంట్లు ఎలిమినేట్ అయ్యారు. ప్రస్తుతం ఈ 6వ సీజన్ 7వ వారంలో కొనసాగుతోంది. ఇక ఇప్పటికే ఈ ఏడవ వారంలో ఎలిమినేషన్ కోసం నామినేషన్ ప్రక్రియ కూడా పూర్తయింది. ఇక ఈ ఏడవ వారంలో కెప్టెన్సీ పదవి కోసం బిగ్ బాస్ సెలబ్రిటీ టాస్క్ ఇచ్చాడు. ఈ సెలబ్రిటీ టాస్క్ లో భాగంగా ఒక్కో సినిమాలోని ఒక్కో క్యారెక్టర్ ని ఇంటి సభ్యులకు కేటాయించాడు.

ఇక ఈ కెప్టెన్సీ పదవి కోసం బిగ్ బాస్ ఇచ్చిన టాస్ ని హౌస్ మేట్స్ అందరూ తేలికగా తీసుకొని పంచులు, సెటైర్లు వేసుకుంటూ ఎంజాయ్ చేశారు. దీంతో ఇంటి సభ్యులపై మండిపడ్డ బిగ్ బాస్ ప్రేక్షకులకు ఎంటర్టైన్మెంట్ ఇవ్వకుండా మీరు ఎంటర్టైన్ అవ్వాలనుకుంటే ఇక్కడ ఉండాల్సిన పనిలేదు అంటూ సీరియస్ వార్నింగ్ ఇచ్చాడు. ఆ తర్వాత ఈ వారం కెప్టెన్సీ పదవి లేదు అంటూ టాస్క్ క్యాన్సిల్ చేశాడు. ఈ క్రమంలో హౌస్ మేట్స్ అందరూ వారు చేసిన తప్పుని తెలుసుకొని బిగ్ బాస్ ని ప్రాధేయపడటం ప్రారంభించారు.

ఈ క్రమంలో శ్రీహన్ రియాక్ట్ అవుతూ.. హౌస్ మేట్స్ మీద సంచలన వ్యాఖ్యలు చేశాడు. బిగ్ బాస్ హౌస్ లో ఉన్న మీరు ఎవరికి సీరియస్ నెస్ లేదని… బిగ్ బాస్ అంటే ఏంటో ఒకసారి చెప్పండి బిగ్ బాస్ అంటూ హౌస్ మేట్స్ గురించి సంచలన వ్యాఖ్యలు చేశాడు. అయితే బిగ్ బాస్ హౌస్ లో కంటెస్టెంట్ గా ఉన్న శ్రీహాన్ కి బిగ్ బాస్ అంటే ఏంటో తెలుసా? కొంతమంది విమర్శలు చేస్తున్నారు. మొత్తానికి ఈయన చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -