BJP: బీజేపీలో లక్ష్మణ్ కు ప్రమోషన్… కీలక పదవికి అసలు కారణం ఇదేనా?

BJP: తెలంగాణకు చెందిన బీజేపీ రాజ్యసభ సభ్యుడు డా.లక్ష్మణ్ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. తెలుగు రాష్ట్రాల్లో ఆయన అందకీ సుపరిచితమే. తెలంగాణ బీజేపీలో సీనియర్ నేతగా ఉన్న ఆయన.. బండి సంజయ్ కంటే ముందు రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడిగా పనిచేశారు. జాతీయ స్థాయిలో బీజేపీ పెద్దలతో కూడా లక్ష్మణ్ కు మంచి సంబంధాలు ఉన్నాయి. దీంతో ఆయనకు ఉత్తరప్రదేశ్ నుంచి రాజ్యసభ సభ్యుడిగా బీజేపీ అవకాశం కల్పించింది. ఆయనను పెద్దల సభకు పంపి తెలంగాణ నేతకు బీజేపీ ప్రాధాన్యత కల్పించింది.

అయితే తాజాగా లక్ష్మణ్ కు బీజేపీలో ప్రమోషన్ కల్పించింది. బీజేపీలో నిర్ణయాలు తీసుకునే అత్యున్నత పార్లమెంటరీ బోర్డులో లక్ష్మణ్ కు అవకాశం కల్పించారు. అలాగే కేంద్ర ఎన్నికల కమిటీలో కూడా లక్ష్మణ్ కు అవకాశం కల్పించారు. ప్రధాని మోదీ, అమిత్ షా, రాజ్ నాథ్ సింగ్ లాంటి ముఖ్యనేతలు ఉన్న పార్లమెంటరీ బోర్డులో లక్ష్మణ్ కు చోటు కల్పించి తెలంగాణకు అత్యంత ప్రాధాన్యత కల్పించింది బీజేపీ హైకమాండ్. తెలంగాణకు చెందిన లక్ష్మణ్ కు రాజ్యసభ పదవితో పాటు బీజేపీలో ప్రమోషన్ కల్పించడం హాట్ టాపిక్ గా మారింది.

తెలంగాణలో బలపడాలని బీజేపీ చూస్తోంది. టీఆర్ఎస్ కు ప్రత్యామ్నాయంగా తయారుకావాలని చూస్తోంది. అందుకే తెలంగాణకు బీజేపీ అత్యంత ప్రయారిటీ ఇస్తోంది. తెలంగాణకు చెందిన నేతలకు కీలక పదవులు ఇస్తోంది. కిషన్ రెడ్డికి కేంద్రమంత్రిగా అవకాశం కల్పించిన మోదీ…

ఇటీవల యూపీ నుంచి లక్ష్మణ్ ను రాజ్యసభకు పంపింది. అంతేకాకుండా అత్యంత కీలకమైన పార్లమెంటరీ బోర్డులో కూడా ఆయనకు అవకాశం కల్పించింది. దీనిని బట్టి చూస్తే తెలంగాణకు బీజేపీ ప్రాధాన్యత ఇస్తుందని తెలుస్తుంది. తెలంగాణకు చెందిన నేతకు కీలక పదవులు ఇవ్వడం ద్వారా మిగతా నేతల్లో కూడా ఉత్సాహం నింపే ప్రయత్నాన్ని కమలనాథులు చేస్తున్నారు. పార్టీలో కష్టపడితే ఎవరికైనా కీలక పదవులు వస్తాయనే సంకేతాన్ని దీనిని ద్వారా పంపాలని కేంద్ర నాయకత్వం భావిస్తోంది.
11 మందితో పార్లమెంటరీ బోర్డు, 15 మందితో కేంద్ర ఎన్నికల కమిటీని ప్రకటించింది. పాత నేతలు కాకుండా పార్లమెంటరీ బోర్డులో ముగ్గురికి కొత్తగా అవకాశం కల్పించారు. కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ, మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహన్ లను పార్లమెంటరీ బోర్డు నుంచి తప్పించారు. కొత్తగా కర్ణాటక మాజీ సీఎం యుడియూర్ప, సర్బానంద సోనోవాల్, డా.లక్షణ్ కు చోటు కల్పించారు. బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా అధ్యక్షతన పార్లమెంటరీ బోర్డు నడుస్తుంది. ప్రధాని మోదీ, రక్షణశాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా, యుడియూరప్ప, సర్బానంద సోనోవాల్, కె.లక్ష్మణ్, ఇక్బాల్ సింగ్ లాల్ పుర, సుధా యాదవ్, సత్యనారాయణ జతియా, కేఎల్ సంతోష్ లు ఉన్నారు.

ఇక కేంద్ర ఎన్నికల కమిటీలో ప్రధాని నరేంద్ర మోదీతో పాటు జేపీ నడ్డా, రాజ్ నాథ్ సింగ్, అమిత్ షా, యడియూరప్ప, సర్బానంద సోనోవాల్, కె.లక్ష్మణ్, ఇక్బాల్ సింగ్ లార్ పుర, సుధా యాదవ్, సత్యనారాయణ జటియా, కేఎల్ సంతోష్, దేవేంద్ర ఫడ్నవీస్, భూపేంద్ర యాదవ్, ఓమ్ మథుర్, వనతి శ్రీనివాస్ లు ఉన్నారు. తెలంగాణకు చెందిన లక్ష్మణ్ కు చోటు కల్పించడం ద్వారా రాష్ట్రంలో బీజేపీని బలోపేతం చేయాలని కమలనాథులు భావిస్తున్నారు.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -