Amit Shah KTR: అమిత్ షా కేటీఆర్ భేటీ వెనుక అసలు కథ ఇదేనా?

Amit Shah KTR: తెలంగాణ ఐటి శాఖ మంత్రి కేటీఆర్ రెండు రోజు పర్యటనలలో భాగంగా ఢిల్లీ వెళ్లనున్నారు.ఇలా ఈయన ఢిల్లీ పర్యటనలో భాగంగా కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షాతో భేటీ కానున్నరని తెలుస్తుంది. ఇలా కేటీఆర్ అమిత్ షా తో బేటి కావడంతో ఈ విషయం కాస్త తెలంగాణ రాష్ట్ర రాజకీయాలలో చర్చ నీయాంశంగా మారింది. జాతీయ పార్టీగా మారినటువంటి బిఆర్ఎస్ పార్టీ ఉన్నఫలంగా చాలా సైలెంట్ అయిపోయింది.

ఢిల్లీ లిక్కర్స్ స్కామ్ లో భాగంగా కవిత అరెస్టు ఆగిపోవడం మరోవైపు బిజెపినేతల గురించి కేటీఆర్ కేసీఆర్ ఇద్దరు కూడా మౌనం వహించడంతో ఇద్దరు కూడా మిత్రపక్షం అన్న వాదనలు తెరపైకి వచ్చాయి. ఈ విధంగా ఈ రెండు పార్టీలు ఒకటేనని ప్రచారం జరుగుతున్నప్పటి నుంచి తెలంగాణలో బిజెపి నేతల పరిస్థితి మరింత దిగజారిపోయింది. ఆ పార్టీలో చేరాలనుకున్న వారు ఆగిపోయారు. ఉన్న వారు కూడా వెళ్లిపోతారన్న ప్రచారం జరుగుతోంది.

 

ఈ విధంగా తెలంగాణలో ఇలాంటి రాజకీయ పరిణామాలు చోటు చేసుకున్న హై కమాండ్ ఏమాత్రం పట్టించుకోకపోవడంతో బిజెపి నేతలు షాక్ అవుతున్నారు. బీజేపీకి వచ్చిన హైప్ అనూహ్యంగా తగ్గిపోవడంతో ఇప్పుడు ఏం చేయాలో వారికి తెలియడం లేదు. ఓ వైపు హైకమాండ్ లైట్ తీసుకుంటోంది. బీఆర్ఎస్ పార్టీని టార్గెట్ చేయాల్సింది పోయి.. మిత్రపక్షం అన్నట్లుగా వ్యవహరించడం పట్ల తెలంగాణ బిజెపి నేతలు ఈ విషయాన్ని జర్నించుకోలేకపోతున్నారు.

 

ఈ నేపథ్యంలోనే కేటీఆర్ ఢిల్లీ పర్యటన వెళ్లి కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షాను కలవడంతో తెలంగాణ తెలంగాణ రాష్ట్ర రాజకీయాలలో మార్పులు రాబోతున్నాయని స్పష్టంగా అర్థం అవుతుంది.ఈ పర్యటన పూర్తి కాగానే తెలంగాణలో టిఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ అనేలాగే రాజకీయాలు కొనసాగుతాయని మరికొందరు భావిస్తున్నారు.

Related Articles

ట్రేండింగ్

YSRCP Leaders Tension: టీడీపీ జనసేన కూటమి మేనిఫెస్టో విషయంలో వైసీపీ భయాలివేనా.. ఆ టెన్షన్ తగ్గట్లేదా?

YSRCP Leaders Tension:తెలుగుదేశం పార్టీ మేనిఫెస్టో విడుదల చేసిన తర్వాత జగన్ పార్టీలో భయం మొదలైనట్లుగా ఉంది. ఎందుకంటే వైసీపీ మేనిఫెస్టోలో ఉన్నా హామీల కన్నా కూటమి ఇచ్చిన హామీలు చాలా చాలా...
- Advertisement -
- Advertisement -