Adipurush Row: ప్రభాస్ ఆది పురుష్ టీజర్ పై ఆగ్రహం వ్యక్తం చేసిన బీజేపీ ప్రతినిధి?

Adipurush Row: ఇటీవల విడుదలైన ప్రభాస్ ఆది పురుష్ టీజర్ మాత్రం భారీ స్థాయిలో విమర్శలు ఎదుర్కొంటుంది. దేశవ్యాప్తంగా ప్రేక్షకులందరూ సోషల్ మీడియాలో ఆది పురుష్ టీజర్ గురించి చెవులు కొరుక్కుంటున్నారు. మొత్తానికి ఈ సినిమా టీజర్ తో డైరెక్టర్ ఓం రౌత్ మాత్రం ప్రభాస్ అభిమానులకు కంట కన్నీరే మిగిల్చాడని చెప్పవచ్చు.

అంతేకాకుండా ఈ సినిమా విపరీతమైన ట్రోల్స్ కు గురవుతుంది. కొత్తగా ఈ సినిమా టీజర్ లో సైఫ్ అలీ ఖాన్ రావణాసురుడు పాత్ర విషయంలో హిందూ వర్గాలు.. బాయ్ కాట్ ఆది పురుష్ అంటూ పిలుపునిస్తున్నాయి. ఇక తాజాగా ఈ మూవీ టీజర్ పై బీజేపీ పార్టీ అధికార ప్రతినిధి మాళవిక అవినాష్ ఆగ్రహం వ్యక్తం చేశాడు. అసలు రామాయణం గురించి సదరు డైరెక్టర్ కి తెలుసా అని మండిపడ్డాడు.

మాళవిక అవినాష్ టీజర్ గురించి మాట్లాడుతూ.. ఈ విషయంలో ఎంతో బాధగా ఉంది. వాల్మీకి రామాయణం, తులసీదాస్ రామాయణంలో రాముడి పాత్ర ఎలా ఉంటుందో డైరెక్టర్ ఓం రౌత్ సరిగా అధ్యయనం చేయలేదని అవినాష్ తెలిపారు. అలాగే భూకైలాస్ చిత్రంలో సీనియర్ ఎన్టీఆర్ పాత్ర, సంపూర్ణ రామాయణంలో ఎస్వీ రంగారావు గారు చేసిన రావణుడి పాత్ర చూసి అర్థం చేసుకోవచ్చు అని తెలిపాడు.

కానీ ఈ టీజర్ లో రావణాసురుడు నీలి కళ్ళతో లెదర్ జాకెట్ వేసుకొని కనిపించాడు. నిజంగా ఈ విషయం నాకు చాలా బాధ కలిగిస్తుందని మాళవిక అవినాష్ తెలియజేసాడు. నిజానికి రోజురోజుకి ప్రభాస్ ఆది పురుష్ సినిమా అనేక రకాల విమర్శలకు దారి తీస్తుంది. మరి ఈ సినిమాను డైరెక్టర్ ఓం రౌత్ ఏ విధంగా ఆలోచించి చిత్రీకరించాడో కానీ.. టీజర్ మాత్రం ఎవరికి వంటపట్టడం లేదు. నిజానికి ఈ సినిమా విషయం లో ప్రభాస్ కి కూడా మనశ్శాంతి లేకుండా పోయినట్లు అర్థమవుతుంది. సైతం ఓం రౌత్ పై ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలుస్తుంది.

Related Articles

- Advertisement -

ట్రేండింగ్

LIC policy: ఈ ఎల్ఐసీ పాలసీ గురించి తెలుసా.. రూ.కోటి పొందే అవకాశం!

LIC policy: లైఫ్ ఇన్స్యూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా వేర్వేరు వర్గాల కస్టమర్ల కోసం పలు రకాల పాలసీలను అందిస్తోంది. కస్టమర్ల అవసరాలను దృష్టిలో పెట్టుకొని ఎప్పటికప్పుడు వేర్వేరు ఎల్ఐసీ పాలసీలను ప్రకటిస్తూ...
- Advertisement -