Delhi Liquor Scam: త్వరలో లిక్కర్ స్కాంలో జైలుకు కవిత.. బీజేపీ ఎంపీ సెన్సేషనల్ కామెంట్స్

Dharmapuri Arvind: ఢిల్లీ లిక్కర్ స్కాం తెలుగు రాష్ట్రాల్లో కలకలం రేపుతూనే ఉంది. రాజకీయంగా ఈ స్కాం ప్రకంపనలు రేపుతూనే ఉంది. తెలంగాణకు చెందిన బోయినపల్లి అభిషేక్ రావు సీబీఐ అరెస్ట్ చేయగా.. ఇటీవల గోరంట్ల అసోసియేట్స్ సంస్థ నిర్వాకులు గోరంట్ల బుచ్చిబాబుకు సీబీఐ నోటీసులు జారీ చేసి విచారణకు పిలిచింది. అభిషేక్ రావు, గోరంట్ల బుచ్చిబాబులిద్దరూ సీఎం కేసీఆర్ కూతురు, టీఆర్ఎస్ ఎమ్మెల్యే కవితకు అత్యంత సన్నిహితులు అని ప్రచారం సాగుతోంది. గోరంట్ల బుచ్చిబాబు గతంలో కవితకు సీఏగా పనిచేసినట్లు చెబుతున్నారు.

ఈ క్రమంలో నిజామాబాద్ బీజేపీ ఎంపీ ధర్మపురి అర్వింద్ సంచలన వ్యాఖ్యలు చేశారు. త్వరలోనే లిక్కర్ స్కాంలో కవిత జైలుకు వెళ్లడం ఖాయమంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు తెలంగాణ రాజకీయాల్లో ప్రకంపనలు రేపుతోన్నాయి. లిక్కర్ రాణి త్వరలోనే జైలుుకు వెళ్లేందుకు సిద్దంగా ఉందని అర్వింద్ జోస్యం చెప్పారు. తాజాగా మునుగోడు ఉపఎన్నికల ప్రచారంలో అర్వింద్ పాల్గొన్నారు. బీజేపీ అభ్యర్థి రాజగోపాల్ రెడ్డి తరపున ప్రచారం నిర్వహించారు. ఈ సందర్బంగా నిర్వహించిన బహిరంగ సభలో మాట్లాడారు. రాజగోపాల్ రెడ్డికి ఎందుకు రాజీనామా చేశారని కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావులు మాట్లాడుతున్నారని, మరి తెలంగాణ ఉద్యమంలో వాళ్లు రాజీనామా చేయలేదా అని ప్రశ్నించారు.

తెలంగాణ ఉద్యమ సమయంలో కేసీఆర్, హరీష్ రావులు రాజీనామా చేశారు కదా అని అర్వింద్ గుర్తు చేశారు. కేటీఆర్, హరీష్ రావు 2004 నుంచి 2014 దాకా అన్నిసార్లు ఎందుకు రాజీనామా చేశారని ధర్మపురి అర్వింద్ ప్రశ్నించారు. తెలంగాణ సర్కార్ కు గుడి కట్టేందుకు, మోదీ సర్కార్ ను తీసుకువచచేందుకు రాజగోపాల్ రెడ్డి రాజీనామ చేశారని అన్నారు. ఈ సందర్బంగా మునుగోడులో వామపక్ష పార్టీలు టీఆర్ఎస్ కు మద్దతు ఇవ్వడంపై అర్వింద్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఎర్ర పార్టీలు సీఎం కేసీఆర్ కు బౌన్సరర్లుగా మారాయని అర్వింద్ ఆరోపించారు. మోదీ ప్రభుత్వం తెలంగాణకు రావడానికి మునుగోడు ఉపఎన్నిక ఒక ప్రారంభం అని అన్నారు.

దొరల మీద, భూస్వాముల మీద తిరగబడి పోరాటం చేసిన కమ్యూనిస్టులు ఇప్పుడు కేసీఆర్ అనే దొరకు గులాంగిరి చేయడాన్ని తప్పుబట్టారు. రాష్ట్ర నేతలు తీసుకున్న నిర్ణయాన్ని చూసి పాత కమ్యూనిస్టులు వాపోతున్నారని అర్వింద్ తెలిపారు. డబుల్ బెడ్ రూంలు, పేదలకు భూములు ఇవ్వనందుకు వామపక్షాలు కేసీఆర్ కు మద్దతు తెలుపుతున్నాయా అంటూ అర్వింద్ ప్రశ్నించారు. దళితులకు మూడు ఎకరాల భూమి ఇస్తానని చెప్పి ఇప్పటివరకు ఇవ్వలేదని, అందుకే 15 రోజుల్లో ఓటు ద్వారా కేసీఆర్ కు మునుగోడు ప్రజలు బుద్ది చెబుతురన అన్నారు. పంటలకు పంట బీమా ఇవ్వడం లేదని, అన్ని రంగాల్లో కేసీఆర్ ప్రభుత్వం విఫలమైందన్నారు.

కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తోన్న ఇంటి నిర్మాణాలకు నిధులు, ఆరోగ్య బీమా పథకం ద్వారా ఇస్తున్న ఐదు లక్షలకు కేసీఆర్ పంగనామాలు పెడుతున్నారని ధర్మపురి అర్వింద్ విమర్శలు కురిపించారు. ధరణి పేరుతో భూములను ఆగం చేవారని, రజాకారుల్లా కేసీఆర్ బిహేవ్ చేస్తున్నారని అన్నారు.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -