BJP-Jana Sena: జనసేనకు బీజేపీ గుడ్ బై? తెగిన పొత్తు బంధం

BJP-Jana Sena: జనసేన, బీజేపీ ప్రస్తుతం ఏపీలో అధికారకంగా పొత్తులో ఉండగా.. అసలు ఆ రెండు పార్టీల మధ్య పొత్తు ఉందా.. లేదా అనేది ఎవరికీ అర్ధం కావడం లేదు. రెండు పార్టీలు కలిసి పొత్తులో ఉన్నా.. ఎక్కడా కూడా కలిసి ఆందోళనలు, నిరసనలు, ధర్నాలు చేసింది లేదు. తిరుపతి లోక్ సభ ఉపఎన్నికతో పాటు గత ఎన్నికల తర్వాత ఏపీలో జరిగిన ఉపఎన్నికల్లో కూడా ఈ రెండు పార్టీలు అంటీముంటన్లుగానే ఉన్నాయి. ఉమ్మడి అభ్యర్ధిని ఎక్కడా బరిలోకి దిగలేదు. బీజేపీ తరపున మాత్రమే ఉపఎన్నికలో అభ్యర్థులు పోటీలోకి దిగగా.. జనసేన ఏ ఎన్నికల్లో పోటీ చేయలేదు. అంతేకాకుండా బీజేపీ తరపున జనసేన ప్రచారం కూడా చేయలేదు.

దీనిని బట్టి చూస్తే ఏపీలో జనసేన, బీజేపీ మధ్య పొత్తు లేనట్లే కనిపిస్తోంది. అంతేకాదు మోదీ, అమిత్ షాలతో పాటు స్థానిక బీజేపీ నేతలు కూడా పవన్ ను పట్టించుకోవడం లేదు. ఒక్కసారి కూడా పవన్ ను కలిసింది లేదు. ఉమ్మడి సమావేశాలు నిర్వహించి కార్యచరణ చేపట్టింది కూడా లేదు. పవన్ తన పార్టీ తరపున రూట్ మ్యాప్ సిద్దం చేసుకుని ప్రజల్లో తిరుగుతున్నారు. తనవంతు సహయం చేస్తున్నారు. ప్రజావాణి లాంటి కార్యక్రమాలతో ప్రజల్లోకి వెళుతున్నారు. కానీ పొత్తులో ఉన్న బీజేపీని మాత్రం పవన్ ఒక్కమాట కూడా అనండం లేదు.

రాష్ట్ర బీజేపీ నేతలతో తనకు సంబంధం లేదని, కేంద్ర అధినాయకత్వంలోనే తాను టచ్ లో ఉంటానని పలుమార్లు పవన్ చెప్పుకొచ్చారు. లక్ష్మి నారాయణ స్టేట్ బీజేపీ చీఫ్ గా ఉన్నప్పుడు జనసేన-బీజేపీ మధ్య పొత్తు కుదిరింది. కానీ అప్పటినుంచి రెండు పార్టీలు అంటీముంటనట్లుగానే ఉన్నాయి. పొత్తు ఉన్నా.. రెండు పార్టీల మధ్య పొత్తు లేనట్లే ప్రజలు భావిస్తున్నారు. తాజాగా బీజేపీ రాజ్యసభ సభ్యుడు జీవీఎస్ చేసిన వ్యాఖ్యలతో జనసేన, బీజేపీ మధ్య పొత్తు లేదనే విషయం బయటపడింది.

తాజాగా మీడియాతో మాట్లాడిన జీవీఎస్.. వచ్చే ఎన్నికల్లో ఏపీలోని 175 నియోజవర్గాల్లో బీజేపీ పోటీ చేస్తుందని వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలు ఏపీ రాజకీయ వర్గాల్లో చర్చ రేపుతోన్నాయి. 175 నియోజకవర్గాల్లో బీజేపీ పోటీ చేస్తుందంటే.. జనసేనను వదిలేసినట్లేనా అని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. దీనిన బట్టి చూస్తే జనసేన-బీజేపీ-టీడీపీ పొత్తు ఉండదనే సంకేతాలు జీవీఎల్ ఇచ్చారని చెబుతున్నారు. బీజేపీలో జీవీఎల్ కీలక నేతగా ఉన్నారు. దీంతో ఆయన చేసిన కామెంట్స్ హాట్ టాపిక్ గా మారాయి.

Related Articles

ట్రేండింగ్

YSRCP: తొలి విడత డబ్బు పంపిణీ దిశగా వైసీపీ అడుగులు.. కోట్లు చేతులు మారుతున్నాయా?

YSRCP: సాధారణంగా ఎన్నికల ప్రచార కార్యక్రమాలలో భాగంగా ప్రచార కార్యక్రమాలకు వచ్చే కార్యకర్తలకు మందు, భోజనంతో పాటు రోజువారీ కూలీ కూడా డబ్బులను కూడా అందజేస్తూ ఉన్నారు అయితే ఇప్పటికే కూటమి చేతిలో...
- Advertisement -
- Advertisement -