TRS MLA’s: బీజేపీ టార్గెట్ ఆ నలుగురు కాదు.. ఏకంగా 15 మందితో టచ్‌లోకి..

TRS MLA’s: మెయినాబాద్ ఫాంహౌస్‌లో నలుగురు టీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారం తెలంగాణ రాజకీయాల్లో సంచలనంగా మారుతోంది. బుధవారం సాయంత్రం నుంచి ఈ వ్యవహారం ప్రకంపనలు రేపుతోంది. టీఆర్ఎస్, బీజేపీ మధ్య ఈ ఏపిసోడ్‌తో పొలిటికల్ వార్ మరింత పెరిగిపోయింది. టీఆర్ఎస్, బీజేపీ మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. కేంద్రమంత్రి కిషన్ రెడ్డికి సన్నిహిత వ్యక్తిగా ఉన్న ఒకరు ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారంలో కీలక పాత్ర పోషించారని పోలీసులు గుర్తించారు. ఇప్పటికే దీనిపై ఎఫ్ఐఆర్ కూడా నమోదు చేసి దర్యాప్తు చేశారు. ఇక ఈ కేసులో కాల్ రికార్డింగ్ లు సంచలనం రేపుతోన్నాయి.

కేంద్రమంత్రి కిషన్ రెడ్డితో టీఆర్ఎస్ ఎమ్మెల్యేల బేరసారాలకు సంబంధించి మాట్లాడిన ఆడియో కాల్స్ ఉన్నట్లు పోలీసులు గుర్తించరాు. దీంతో కేంద్రమంత్రి కిషన్ రెడ్డిని కూడా ఈ కేసులో అరెస్ట్ చేసే అవకాశముందనే ప్రచారం జోరుగా జరుగుతోంది. ఆయనపై కూడా పోలీసులు కేసు నమోదు చేసే అవకాశముందని చెబుతున్నారు. మునుగోడు ఉపఎన్నిక వేళ ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారం బయటపడటం సంచలనంగా మారింది. దీని వెనుక టీఆర్ఎస్ కట్ర ఉందని, ఆ పార్టీనే తమ ఎమ్మెల్యేలతో ఆ పని చేయించిందని బీజేపీ నేతలు చెబుతున్నారు. దీనిపై హైకోర్టు ఇప్పటికే బీజేపీ పిటిషన్ దాఖలు చేసింది. దీనిపై సీబీఐతో విచారణ చేయించాలని బీజేపీ డిమాండ్ చేస్తోంది.

గతంలో చంద్రబాబు, రేవంత్ రెడ్డి ఎమ్మెల్సీ స్టీఫెన్ ను కొనుగోలు చేసి అడ్డంగా బుక్ అయినట్లుగానే.. ఇప్పుడు టీఆర్ఎస్ పార్టీ బీజేపీని బుక్ చేసిందని చెబుతున్నారు. అయతే ఇది నిజంగా టీఆర్ఎస్ కుట్రనా.. లేదా నిజంగానే టీఆర్ఎస్ ఎమ్మెల్యేలను బీజేపీ కొనుగోలు చేసిందా అనేది ఎవరికీ అర్దం కావడం లేదు. అయితే బీజేపీ కొనుగోలు చేయడానికి ప్రయత్నించింది నలుగురు ఎమ్మెల్యేలను కాదని, 15 మంది టీఆర్ఎస్ ఎమ్మెల్యేలను కొనుగోలు చేసేందుకు ప్రయత్నించిందని చెబుతున్నారు. ఆ 15 మందితో ఈ నలుగురు ఉన్నారనే ప్రచారం జరుగుతోంది. కేసీఆర్ ప్రభుత్వాన్ని తాము పడగొడతామని, టీఆర్ఎస్ లో ఏక్ నాథ్ షిండేలు ఉన్నారనే వ్యాఖ్యలు బీజేపీ నేతల నుంచి గత కొంతకాలంగా వినిపిస్తున్నాయి.

మహారాష్ట్రాలో ఏక్ నాథ్ షిండే వ్యవహారం చోటుచేసుకున్న దగ్గర నుంచి తెలంగాణలోని బీజేపీ నేతలు కూడా టీఆర్ఎస్ లో ఏక్ నాథ్ షిండేలు ఉన్నారని, టీఆర్ఎస్ ప్రభుత్వం పడిపోతుందంటూ వ్యాఖ్యలు చేస్తున్నారు. ఇలాంటి నేపథ్యంలో టీఆర్ఎస్ ఎమ్మెల్యేలను కొనుగోలు చేసేందుకు బీజేపీ ప్రయత్నించినట్లు వీడియోలు, ఆడియోలు బయటపడటం సంచలనం రేపుతోంది. నలుగురు మంత్రులు, పది మంది టీఆర్ఎస్ ఎమ్మెల్యేలతో తమతో టచ్ లో ఉన్నారని, మునుగోడు ఉపఎన్నికల తర్వాత వాళ్లు బీజేపీలో చేరుతారంటూ మునుగోడు ఉపఎన్నికల ప్రచాంలో బీజేపీ నేతలు రోజూ చెబుతూనే ఉన్నారు. ఇలాంటి నేపథ్యంలో టీఆర్ఎస్ ఎమ్మెల్యేలను కొనుగోలు చేస్తూ బీజేపీ పట్టుబడం కలకలం రేపుతోంది. మునుగోడు ఉపఎన్నికల్లో బీజేపీపై దీని ప్రభావం పడుతుందని, బీజేపీకి ఇది గట్టి ఎదురుదెబ్బ అంటూ రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తోన్నారు.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -