Sharmila-Jayasudha: షర్మిల, జయసుధ ఇద్దరి టార్గెట్లు ఒకటే.. రాజకీయాల్లో సంచలనాలు సృష్టిస్తారా?

Sharmila-Jayasudha: వచ్చే ఎన్నికలలో భాగంగా ఇప్పటికే రెండు తెలుగు రాష్ట్రాలలో పెద్ద ఎత్తున రాజకీయ నాయకులు ప్రచార కార్యక్రమాలలో మునిగిపోయారు. ఈ క్రమంలోనే తెలంగాణలోని సికింద్రాబాద్ నియోజకవర్గంపై అందరి ఫోకస్ పడింది సికింద్రాబాద్ నియోజకవర్గంలో ఎమ్మెల్యే ఎంపీ సీట్లకు భారీగా పోటీ ఉందని తెలుస్తుంది. ఈ క్రమంలోనే వచ్చే ఎన్నికలలో ఈ సికింద్రాబాద్ ఎమ్మెల్యే ఎంపీ ఎలక్షన్లలో భాగంగా ఇద్దరు మహిళల అభ్యర్థుల మధ్య గట్టి పోటీ ఉండబోతుందని తెలుస్తోంది.

సీనియర్ నటిగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి జయసుధ బిజెపి పార్టీలోకిచేరిన సంగతి మనకు తెలిసిందే. ఇక ఈమె సికింద్రాబాద్ ఎమ్మెల్యే అభ్యర్థిగాను లేకపోతే ఎంపీ అభ్యర్థిగా నిలబడాలన్న ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తుంది. అయితే ఈమెకు పోటీగా వైయస్సార్ టీపి అధినేత వైయస్ షర్మిల కూడా సికింద్రాబాద్ నుంచి పోటీ చేయబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి.

 

వైఎస్ షర్మిల తన పార్టీని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేయబోతున్నారు అంటూ పెద్ద ఎత్తున వార్తలు వస్తున్నాయి. ఒకవేళ ఈమె కాంగ్రెస్ పార్టీలోకి తన పార్టీను విలీనం చేస్తే ఈమె పాలేరు నుంచి కాకుండా సికింద్రాబాద్ నుంచి ఎమ్మెల్యే గాను లేదా ఎంపీగాను పోటీ చేయబోతున్నారని తెలుస్తుంది. అలా కాకుండా తన పార్టీని కాంగ్రెస్లో విలీనం చేయకపోతే పాలేరు నుంచి ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేయబోతున్నారు.

 

ఇక ఈమె సికింద్రాబాద్ నుంచి ఎమ్మెల్యే లేదా ఎంపీ పోటీకి సిద్ధమవుతున్నటువంటి తరుణంలో బీజేపీ పార్టీ నుంచి సినీనటి జయసుధని కూడా రంగంలోకి దింపబోతున్నారు. దీంతో వీరిద్దరి మధ్య వచ్చే ఎన్నికలలో పెద్ద ఎత్తున పోటీ ఏర్పడబోతుందనేది తెలుస్తుంది. మరి ఈ ఇద్దరు మహిళలు తెలంగాణ రాష్ట్ర రాజకీయాలలో సరికొత్త సంచలనం సృష్టిస్తారా లేదా అన్నది తెలియాల్సి ఉంది.

Related Articles

ట్రేండింగ్

Union Minister Piyush Goyal: వైఎస్సార్ ను సైతం ముంచేసిన సీఎం జగన్.. ఆ కేసులో కావాలనే ఇరికించారా?

Union Minister Piyush Goyal: వైయస్సార్ కాలనీ పట్ల కేంద్రమంత్రి పియూష్ గోయెల్ తన ఆవేదన వ్యక్తం చేశారు. విజయవాడలో పీయూష్ గోయల్ విలేకరులతో మాట్లాడుతూ జగన్ పాలనపట్ల విరుచుకుపడ్డారు. వైయస్సార్ కాంగ్రెస్...
- Advertisement -
- Advertisement -