Sharmila: బూమ్ బూమ్ గురించి షర్మిల సంచలన వ్యాఖ్యలు.. సెటైర్లు వేస్తూ?

Sharmila: అన్నయ్యకు వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీలో చేరినటువంటి వైయస్ షర్మిల పెద్ద ఎత్తున ఆంధ్రప్రదేశ్లో పర్యటిస్తూ భారీ బహిరంగ సభలో రచ్చబండ కార్యక్రమాలను నిర్వహిస్తూ కాంగ్రెస్ అనే పదాన్నే మర్చిపోయిన ఏపీలో తిరిగి కాంగ్రెస్ పార్టీ పుంజుకొనేలా ప్రయత్నాలు చేస్తున్నారు. ఇలా కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నటువంటి ఈమె తరచూ తన అన్న వైఎస్ఆర్సిపి పార్టీపై తీవ్రస్థాయిలో విమర్శలు కురిపిస్తున్నారు.

 

తాజాగా పాడేరులో నిర్వహించిన సభలో ఈమె జగన్మోహన్ రెడ్డి 2019 ఎన్నికల ముందు ఇచ్చిన హామీల గురించి మాట్లాడుతూ తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. తాను అధికారంలోకి వస్తే పూర్తి మద్యపాన నిషేధం చేస్తానని చెప్పారు ఎక్కడ చేశావు జగన్ రెడ్డి అంటూ ప్రశ్నించారు. జాబ్ క్యాలెండర్ అన్నావ్ నీ జాబ్ క్యాలెండర్ ఎక్కడ తీరా ఎన్నికల ముందు మెగా డీఎస్సీ అంటూ 6000 పోస్టులు వదిలి ఎన్నికలకు ఎరవేస్తున్నారు అంటూ విమర్శలు కురిపించారు.

ఇక ఈయన గత ఐదు సంవత్సరాల కాలంలో ఏదైనా అభివృద్ధి చేశారు అంటే ఆ అభివృద్ధి మొత్తం మందు షాపులోనే మందుబాబుల దగ్గర దొరుకుతుందని తెలిపారు.మధ్యపానం నిషేధం అని చెబుతూనే ఎన్నో రకాల బ్రాండ్లను అందుబాటులోకి తీసుకువచ్చిందని సర్కార్ ఏది అమ్మితే మందుబాబులు అదే కొనాలని ఈమె తెలిపారు..

 

వాళ్ళు బూమ్ బూమ్ అమ్మితే బూమ్ బూమ్ కొనాలి, స్పెషల్ స్టేటస్ అమ్మితే స్పెషల్ స్టేటస్ కొనాలి, మెగా డీఎస్సి అమ్మితే దాన్నే కొనాలి. ఎక్కడయ్యా నీ ఎన్నికల హామీలు జగన్ రెడ్డి అంటే అన్ని మద్యం షాపులలో ఉన్నాయి అనేలా ఈ ప్రభుత్వ పాలన జరుగుతోంది అంటూ ఈమె విమర్శించారు. తనకు 25 ఎంపీలు వస్తే కేంద్రం మెడలు వంచి రాష్ట్రానికి ప్రత్యేక హోదా తీసుకువస్తానని జగన్ రెడ్డి హామీ ఇచ్చారు. ఇప్పుడు బిజెపి పెద్దలకు మద్దతిస్తున్నారని తెలిపారు. ఇలా రాజశేఖర్ రెడ్డి బిడ్డగా రాజశేఖర్ రెడ్డి వారసత్వాన్ని నిలపడం ఇదేనా అంటూ జగన్మోహన్ రెడ్డి పై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -