Anil Kumar: ఆ మతస్థులు జగన్ కు అనుకూలంగా ఓటు వేయడం కష్టమేనా?

Anil Kumar:  వైయస్ జగన్మోహన్ రెడ్డికి గత ఎన్నికలలో గెలుపు అందుకోవడానికి ఏవైతే మంచి అస్త్రాలుగా మారాయి ఇప్పుడు అవే వ్యతిరేక అస్త్రాలుగా మారి తనని ఓటమిపాలు చేయడానికి కంకణం కట్టుకున్నాయి. ఎలాగైనా జగన్మోహన్ రెడ్డిని గద్దె దింపడం కోసం విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. వైయస్ జగన్మోహన్ గత ఎన్నికలలో అద్భుతమైనటువంటి విజయాన్ని సొంతం చేసుకోవడానికి ఎన్నో అంశాలు ఆయనకు అనుకూలంగా మారాయి.

ముఖ్యంగా వైషు షర్మిల పెద్ద ఎత్తున పాదయాత్ర చేసి గొంతు పోయేలా స్పీచ్ లు ఇస్తూ తన అన్న విజయానికి కారణమయ్యారు ఇప్పుడు అదే షర్మిల కాంగ్రెస్ పక్షాన చేరి తన అన్నపై విమర్శలు కురిపిస్తూ తనని ఓటమిపాలు చేయడానికి కంకణం కట్టుకున్నారు. ఇక కోడి కత్తి కేసు ద్వారా సానుభూతి పొందినటువంటి వైయస్ జగన్ కోడి కత్తి శీను విషయంలో నిజానిజాలు ప్రజలకు తెలిసిపోయాయి అలాగే తన బాబాయ్ వైయస్ వివేకానంద రెడ్డి హత్య ఇంకా ఎన్నికలకు ఆయనకు ఎంతో ఉపయోగపడింది.

ఇప్పుడు మాత్రం వైయస్ వివేకానంద రెడ్డి హత్య వెనుక కారణాలు ప్రజలందరికీ తెలియడంతో ఈ విషయం కూడా జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా మారింది. ఇలా ఈ అంశాలు మాత్రమే కాకుండా మరో అంశం కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గత ఎన్నికలలో గెలవడానికి ఎంతగానో దోహదం చేసింది. వైయస్ షర్మిల భర్త బ్రదర్ అనిల్ కుమార్ అప్పట్లో క్రైస్తవ మతస్తులతో పెద్ద ఎత్తున సమావేశాలు జరిపి జగన్మోహన్ రెడ్డి విజయానికి దోహదపడ్డారు.

ఇప్పుడు బ్రదర్ అనిల్ కుమార్ కూడా క్రైస్తవ మతస్థులతో చర్చలు జరిపి జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా సమావేశాలను నిర్వహిస్తున్నారు. ఇలా బ్రదర్ అనిల్ కుమార్ కూడా జగన్మోహన్ రెడ్డి ఓటమికి కీలకపాత్ర పోషిస్తున్నారు ఇలా ఈయన తన క్రైస్తవ మతస్థులతో కలిసి సమావేశాలు నిర్వహించడంతో ఆ మతస్తుల ఓట్లు జగన్మోహన్ రెడ్డికి పడటం కష్టమేనని ఈసారి జగన్ గెలవాలి అంటే ఎన్నో అంశాలను దీటుగా ఎదుర్కోవాల్సి ఉంటుంది లేకపోతే ఆయన గద్దె దిగడం ఖాయమని పలువురు భావిస్తున్నారు.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -