Telangana Assembly Elections 2023: కేసీఆర్ కష్టం ఫలిస్తుందా.. తెలంగాణలో బి.ఆర్.ఎస్. పార్టీకి అధికారం పక్కానా?

Telangana Assembly Elections 2023: మరో రెండు నెలలలో తెలంగాణలో ఎన్నికలు జరగబోతున్నటువంటి నేపథ్యంలో ఇప్పటికే పెద్ద ఎత్తున రాష్ట్రంలో ఎన్నికల హడావిడి ఏర్పడింది ఇప్పటికే అన్ని పార్టీలు కూడా పార్టీ నేతలను ప్రకటించాయి. ఇక గత రెండుసార్లు కూడా ముఖ్యమంత్రిగా కొనసాగుతున్నటువంటి కెసిఆర్ ఏ విధమైనటువంటి ఇబ్బంది లేకుండా చాలా సునాయసంగా గెలుపొందారు.

ప్రస్తుత ఎన్నికల విషయానికి వస్తే పరిస్థితిలో అలా లేవని స్పష్టంగా అర్థమవుతుంది. ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ పూర్తిగా పుంజుకుంది కాంగ్రెస్ పార్టీలో కూడా కీలకమైనటువంటి నేతలు ఉన్నారు దీంతో విజయం ఒకరి వైపే కాకుండా కష్టపడిన వారికే వారించేలాగా ఉండటంతో కెసిఆర్ కూడా ప్రగతి భవన్ లో కూర్చోకుండా ప్రజల ముందుకు వస్తున్నారు.

గత ఎన్నికల సమయంలో తమ పార్టీని గెలుస్తుంది అన్న ధీమాతో కెసిఆర్ నామినేషన్స్ వేసిన తర్వాతనే ప్రజల ముందుకు వచ్చి తన పార్టీలకు ప్రచార కార్యక్రమాలను నిర్వహించారు అయితే ఈసారి అలా కాకుండా కెసిఆర్లో ఏదో తెలియని భయం పట్టుకుందని తెలుస్తోంది. ఎక్కడ ఓడిపోతామోనన్న అనుమానం తనలో ఉండడంతో ముందు గానే ప్రజాక్షేత్రంలోకి అడుగు పెట్టారు.

కాంగ్రెస్ పార్టీ బలంగా ఉండడంతో ఎన్నికల విజయంపై తీవ్ర ఉత్కంఠత నెలకొంది ఈ క్రమంలోనే తమ పార్టీని ఎలాగైనా గెలిపించుకోవాలనే దిశగా కెసిఆర్ అడుగులు వేస్తూ జిల్లాల బాట పట్టారు అందుకే ఈయన ఇప్పటికే పలు జిల్లాలలో పెద్ద ఎత్తున పర్యటనలు చేస్తూ తమ పార్టీని గెలిపించుకునే దిశగా అడుగులు వేస్తున్నారు. ఇక కెసిఆర్ ప్రభుత్వంలో ఉన్న సమయంలో ఈయన సరైన పాలన అందించకపోవడంతోని కాస్త వ్యతిరేకత కూడా ఏర్పడిందని తెలుస్తుంది. ఆ భయంతోనే ఈయన ప్రజాక్షేత్రంలోకి అడుగు పెట్టారు. మరి ఇప్పటినుంచే ఇలా కష్టపడుతున్నటువంటి కెసిఆర్ కు విజయం వరించిన లేక తన కష్టం మొత్తం వృధాగా నిలిచిపోయేనా అనేది తెలియాల్సి ఉంది.

Related Articles

ట్రేండింగ్

CM Jagan: కూటమి విజయాన్ని ఫిక్స్ చేసిన జగన్.. మేనిఫెస్టో హామీలతో బొక్కా బోర్లా పడ్డారా?

CM Jagan: త్వరలోనే అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నటువంటి తరుణంలో పెద్ద ఎత్తున ప్రచార కార్యక్రమాలలో నిర్వహిస్తున్నారు. అయితే వైసిపి అధినేత జగన్మోహన్ రెడ్డి వై నాట్ 175 అంటూ ప్రచార కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు....
- Advertisement -
- Advertisement -