CM Jagan: సీఎం జగన్ అలా చెప్పుకోగలరా.. ప్రజలు సంధిస్తున్న ప్రశ్నలివే!

CM Jagan: ఏ రాజకీయ పార్టీ అయినా రాజకీయ నాయకుడు అయిన అధికారంలోకి రావాలని ఎంతో ఆకాంక్షిస్తూ ఉంటారు.ఒకసారి అధికారంలోకి వస్తే తమ అభివృద్ధి ఏంటో చూపిస్తామని ఎన్నికల ముందు ప్రజలను మభ్యపెడుతూ ఉంటారు. అయితే సరైన నాయకులు అధికారంలోకి వచ్చిన తర్వాత ఇచ్చిన హామీలను నెరవేరుస్తూ రాష్ట్రాన్ని అభివృద్ధి దిశలో నడిపిస్తూ రాష్ట్ర ప్రజల సంక్షేమం కోసం ఆలోచిస్తారు.

మరి కొంతమంది నాయకులు అందిన కాడికి దోచుకుని వారి స్వలాభం వారి అభివృద్ధిని చూసుకుంటారు. ఆంధ్రప్రదేశ్లో అధికారంలో ఉన్నటువంటి జగన్ ప్రభుత్వం అధికారం చేపట్టి నాలుగు సంవత్సరాలు పూర్తి చేసుకుంది. ఈ నాలుగు సంవత్సరాల కాలంలో ప్రజలు చాలా సంతోషంగా ఉన్నారని, ఎన్నికల సమయంలో తమ ఇచ్చిన హామీలలో 90% నెరవేర్చమని వైయస్ఆర్సీపీ నాయకులు ముఖ్యమంత్రి కూడా అదే ఆలోచనలోనే ఉన్నారు.

 

ప్రజలకు సంక్షేమ ఫలాలను అందించడం అభివృద్ధి కాదు అనే విషయం నాయకులకి కూడా తెలుసు కానీ ఇదే విషయాన్ని బయటకు చెప్పడానికి వెనుకడుగు వేస్తారు. ఈ నాలుగేళ్ల పాలనలో ఏపీ ప్రభుత్వం ప్రజలకు కేవలం సంక్షేమ ఫలాలను మాత్రమే అందించింది అలాగే మూడు రాజధానుల పేరిట కబుర్లు చెప్పింది కానీ రాజధానిని మాత్రం ప్రకటించలేదు అలాగే ఏ ఒక్క ప్రాజెక్టును కూడా పూర్తి చేయలేదు అంతేకాకుండా మన రాష్ట్రానికి కంపెనీలను తీసుకురావడం పక్కనపెట్టి ఉన్న కంపెనీలను పక్క రాష్ట్రాలకు పంపిన ఘనత ఈ పార్టీకే చెల్లిందని చెప్పాలి.

 

ఇలా వైఎస్ఆర్సిపి నాలుగేళ్ల పాలనలో ఎక్కడ కూడా అభివృద్ధి పనులు జరగలేదని కేవలం సంక్షేమ పథకాలు మాత్రమే అందాయని ఈ సంక్షేమ పథకాల ఆధారంగా వచ్చే ఎన్నికలలో పోటీ చేయడం గెలవడం అసాధ్యం అనే విషయం సదరు నాయకులకు కూడా అర్థమవుతుందని తెలుస్తుంది.అధికారంలోకి వచ్చిన వెంటనే శంకుస్థాపనలు చేసి అభివృద్ధి పనులు చేసి ఉంటే ఇది మేము చేసిన అభివృద్ధి అని చెప్పుకోగల సత్తా నాయకులలో ఉండేది అయితే తీరా ఎన్నికల ముందు శంకుస్థాపనలు చేసి అభివృద్ధి అని చెప్పుకోలేని పరిస్థితులలో ఏపీ అధికార పక్ష నాయకులు ఉన్నారని తెలుస్తోంది. ఏది ఏమైనా ఈ నాలుగేళ్ల పాలనలో అభివృద్ధి అనేది ఏదైనా జరిగి ఉంది అంటే అది కేవలం వైఎస్ఆర్సిపి నాయకుల అభివృద్ధి మాత్రమేనని పలువురు భావిస్తున్నారు.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -