Egg: డయాబెటిస్ ఉన్నవారు కోడి గుడ్డు తింటే కలిగే లాభనష్టాలు ఇవే!

Egg: మారుతున్న కాలానికి అనుగుణంగా మనుషుల జీవనశైలిలో, ఆహారపు అలవాట్లలో అనేక రకాల మార్పులు వచ్చాయి. ఈ ఆహారపు అలవాట్లు, పని ఒత్తిడి కారణంగా మనుషులు వ్యాధుల బారిన పడుతున్నారు. కాగా ప్రస్తుత కాలంలో ఎక్కువ మందిని వేధిస్తున్న సమస్య మధుమేహం. ఈ మధుమేహం సమస్యతో చిన్న పెద్ద అని తేడా లేకుండా ప్రతి ఒక్కరూ బాధపడుతున్నారు. అయితే మారుతున్న ఆహారపు అలవాట్ల వల్ల ఈ మధుమేహం సమస్య చిన్న పిల్లలను వేధిస్తోంది. అయితే ప్రపంచ వ్యాప్తంగా కొన్ని మిలియన్ల మంది ఈ వ్యాధి బారిన పడి ఇబ్బందులు పడుతున్నారు. అయితే ఈ వ్యాధికి గురైన వారిలో రక్తంలోని చక్కెర స్థాయి ఎక్కువ అవ్వడం మాత్రమే కాకుండా శరీరంలోని ఇతర అవయవాలపై కూడా ప్రభావం చూపిస్తుంది.
ఈ మధుమేహం ఉన్నవారికి ఎటువంటి చిన్న గాయం అయినా కూడా అది అంత తొందరగా మానిపోదు. కాబట్టి మధుమేహం ఉన్నవారు ఆరోగ్యం పై ఎక్కువ శ్రద్ద వహించాలి. అయితే డయాబెటిస్ ఉన్నవారు ఎటువంటి ఆహారం తీసుకోవాలి అన్నా కూడా భయపడుతూ ఉంటారు. చాలామందికి వారు తినే ప్రతి ఆహారం మీద అనేక రకాల అనుమానాలు ఉంటాయి. ఏది ఆరోగ్యానికి మంచిది ఏది చెడ్డది అంటూ భయభయంగా ఆలోచించుకుంటూ తింటూ ఉంటారు. ఇకపోతే మధుమేహం ఉన్నవారు కోడిగుడ్లు తినడంపై అనేక రకాల అభిప్రాయాలు ఉన్నాయి. ఈ గుడ్డు షుగర్ మీద ఎటువంటి ప్రభావం చూపిస్తుందో అని ఆలోచిస్తూ ఉంటారు. ఇకపోతే ఇటీవల జరిగిన ఒక అధ్యయనం ప్రకారం గుడ్లు ప్రోటీన్ ఫుడ్.
మధుమేహం సమస్య ఉన్నవారు గుడ్లు తినడం వల్ల ఎటువంటి ముప్పు వాటిల్లదు. ఒక పెద్ద గుడ్డులో 6.25 గ్రాముల ప్రోటీన్ 4.74 గ్రాముల కొవ్వు,0.35 గ్రాముల కార్బోహైడ్రేట్లు,72 కేలరీలు ఉంటాయి. అయితే చాలామంది గుడ్డు లోపలి పచ్చ సొన తీసేసి తింటూ ఉంటే మరి కొంతమంది పచ్చ సోన తింటూ తెల్లది పడేస్తూ ఉంటారు. కానీ ఇలా చేయకూడదట. ఎందుకంటే ఇందులో శరీరానికి కావాల్సిన మంచి కొలెస్ట్రాల్ ఉత్పత్తి అవుతుంది. శరీరం తనంతట తాను ఉత్పత్తి చేయని తొమ్మిది రకాల అమినో ఆమ్లాలను గుడ్డు తినడం వల్ల పొందవచ్చు. అయితే మధుమేహం ఉన్నవారిలో గుడ్డు తినే వారి కంటే తినని వారికి తొందరగా గుండె సమస్యలు వస్తూ ఉంటాయి. కాబట్టి చక్కెర వ్యాధి ఉన్నవారు వారానికి కనీసం 12 గుడ్లు అయినా మీ డైట్ లో చేర్చుకోవడం వల్ల ఎటువంటి సమస్యలు దరి చేరవు. గుడ్డులోని పచ్చ సొనలో విటమిన్ ఏ, ఈ,డి, కె వంటి ఆరోగ్యవంతమైన కొవ్వులు ఉంటాయి. కాబట్టి డయాబెటిస్ ఉన్నవారు ఎటువంటి భయం లేకుండా గుడ్డును తీసుకోవచ్చు.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -