Chiranjeevi: ఆ హీరోయిన్ జాతకాన్ని మెగాస్టార్ చిరంజీవి మార్చేయగలరా?

Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవి తన తదుపరి సినిమా షూటింగ్ పనులలో ఎంతో బిజీగా ఉన్నారు. ఈయన భోళా శంకర్ వంటి భారీ డిజాస్టర్ సినిమా తర్వాత తన తదుపరి చిత్రాన్ని బింబిసారా డైరెక్టర్ వశిష్ట దర్శకత్వంలో నటిస్తున్న సంగతి తెలిసిందే.ఈ సినిమా విశ్వంభర అనే టైటిల్ తో షూటింగ్ పనులను జరుపుకుంటుంది. ఈ సినిమా సోషియో ఫాంటసీ నేపథ్యంలో ప్రేక్షకుల ముందుకు రాబోతుందని తెలుస్తుంది. ఈ సినిమా కోసం ప్రత్యేకంగా 13 సెట్స్ వేసి సరికొత్త ప్రపంచాన్ని సృష్టించారని తెలుస్తోంది.

 

ఇక చిరంజీవి ఈ సినిమా షూటింగ్ పనులలో ఇదివరకే పాల్గొన్నారు. ఇక తాజాగా ఈ సినిమా షూటింగ్ లొకేషన్లోకి హీరోయిన్ కూడా అడుగు పెట్టారు. ఈ సినిమాలో చిరంజీవి సరసన ఎవరు నటించబోతున్నారు అంటూ గతంలో పెద్ద ఎత్తున వార్తలు వచ్చాయి. అయితే ఈ సినిమాలో హీరోయిన్ త్రిష అంటూ కూడా వార్తలు వినిపించాయి.

తాజాగా ఈ సినిమా షూటింగ్ లొకేషన్లోకి త్రిష ఎంట్రీ ఇవ్వడంతో మేకర్స్ కూడా ఈ విషయాన్ని అధికారకంగా తెలియజేశారు. ఈ సినిమా ద్వారా మరోసారి త్రిష చిరంజీవి ఇద్దరు కూడా తెరపై సందడి చేయడానికి సిద్ధమయ్యారు. వీరిద్దరి కాంబినేషన్లో ఇదివరకే స్టాలిన్ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే.

 

చిరంజీవి త్రిష కాంబినేషన్లో తెరకెక్కిన స్టాలిన్ సినిమా 2006వ సంవత్సరంలో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇప్పుడు మరోసారి ఈ జోడి సిల్వర్ స్క్రీన్ పై మెరువనున్నారు దాదాపు 18 సంవత్సరాల తర్వాత మరోసారి ఈ జోడి కుదిరింది. ఇక ఇప్పటికే ఈ సినిమాపై భారీ స్థాయిలోనే అంచనాలు ఉన్నాయి. ఇక ఈ సినిమాలో నటించడంతో త్రిష జాతకం కూడా మారబోతుందని తెలుస్తుంది. ఇక ఈ సినిమా వచ్చే ఏడాది జనవరి 10వ తేదీ ప్రేక్షకుల ముందుకు రాబోతున్న సంగతి తెలిసిందే.

Related Articles

ట్రేండింగ్

Union Minister Piyush Goyal: వైఎస్సార్ ను సైతం ముంచేసిన సీఎం జగన్.. ఆ కేసులో కావాలనే ఇరికించారా?

Union Minister Piyush Goyal: వైయస్సార్ కాలనీ పట్ల కేంద్రమంత్రి పియూష్ గోయెల్ తన ఆవేదన వ్యక్తం చేశారు. విజయవాడలో పీయూష్ గోయల్ విలేకరులతో మాట్లాడుతూ జగన్ పాలనపట్ల విరుచుకుపడ్డారు. వైయస్సార్ కాంగ్రెస్...
- Advertisement -
- Advertisement -