Kodali Nani: ఇప్పటికైనా కొడాలి మారతాడా.. ఆ ఆలోచనలు మార్చుకుంటాడా?

Kodali Nani: మాజీ మంత్రి, గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నానిని అరెస్ట్ చేసే అవకాశాలు ఉన్నాయి. ఆయనపై చాలా కాలంగా అరెస్ట్ వారెంట్ పెండింగ్‌లో ఉంది. పోలీసులు అమలు చేయడం లేదు. విజయవాడలోని గవర్నరుపేట సీఐ సురేష్‌ కుమార్ గురువారం కోర్టుకు హాజరై వివరణ ఇచ్చారు. నానిపై అరెస్టు వారెంట్‌ పెండింగ్‌లో ఉందని.. దాన్ని అమలు చేయాలని న్యాయమూర్తి గాయత్రీదేవి సీఐని ఆదేశించారు. దీంతో గవర్నర్ పేట సీఐ కొడాలి నానిని అరెస్ట్ చేయక తప్పని పరిస్థితి ఏర్పడుతోంది.

గత ప్రభుత్వ హయాంలో ప్రత్యేక హోదా అంశంపై ర్యాలీ చేశారు. 2016 మే 10న కొడాలి నాని, మాజీ మంత్రి కొలుసు పార్థసారథితోపాటు మరికొందరు విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రం నుంచి వన్‌వేలో ర్యాలీ నిర్వహించారు. అయితే పోలీసుల ఉత్తర్వులు, నిబంధనలు ఉల్లంఘించినందుకు.. ట్రాఫిక్‌కు అంతరాయం కలిగించారనే ఆరోపణలతో గవర్నర్‌పేట పోలీసుస్టేషన్‌లో కేసు నమోదైంది. ఈ కేసుల విచారణకు కొడాలి నాని కోర్టుకు హాజరుకాకపోవడంతో వారెంట్‌ జారీ చేసింది. దాన్ని పోలీసులు అమలు చేయడం లేదు.

 

కానీ ఆయన ఉద్దేశపూర్వకగా వాయిదాలకు హాజరుకాలేదని న్యాయస్థానాన్ని లెక్క చేయకపోవడంతో వారెంట్ జారీ అయింది. అయినా లెక్క చేయకపోవడంతో కోర్టు సీరియస్ అవ్వాల్సి వచ్చింది. ఆయనను అరెస్ట్ చేసి.. కోర్టు ముందు హాజరు పరిస్తే బెయిల్ ఇచ్చే అవకాశం ఉంది.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -