CM KCR: కేసీఆర్ పై బీజేపీ మరో అస్త్రం.. ఇరుకున పెట్టేందుకు కలిసొచ్చిన జగన్ ఫిర్యాదు

సీఎం కేసీఆర్ కు కేంద్రం బిగ్ షాకిచ్చింది. ఏపీకి చెల్లించాల్సిన విద్యుత్ బకాయిలను చెల్లించాలని కేంద్ర విద్యుత్ శాఖ సోమవారం రాత్రి ఆదేశాలు జారీ చేసింది. నెల రోజుల్లోనే పెండింగ్ విద్యుత్ బిల్లులన్నీ చెల్లించాలని తెలంగాణ ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది. 2014 నుంచి 2017 వరకకు తెలంగాణ డిస్కంలకు ఏపీ ప్రభుత్వం విద్యుత్ సరఫరా చేసింది. ఈ బిల్లులు రూ. 3,441 కోట్లు కాగా.. లేట్ పేమెంట్ సర్ ఛార్జీల కింద మరో రూ.3,315 కోట్లు చెల్లించాల్సి ఉంది. మొత్తం రూ.6,766 కోట్లు చెల్లించాల్సి ఉంది. మొత్తం రేూ.6,766 కోట్లు చెల్లించాల్సి ఉంది. కానీ పెండింగ్ బిల్లులు చెల్లించాలని తెలంగాణ సర్కార్ ను ఏపీ ప్రభుత్వం ఎప్పటినుంచో కోరుతుంది. కానీ తెలంగాణ ప్రభుత్వం మాత్రం చెల్లించకుండా పెండింగ్ లో పెడుతూనే ఉంది. ఈ బకాయిల కోసం టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు గట్టిగానే ప్రయత్నాలు చేశారు. తెలంగాణ ప్రభుత్వానికి లేఖ రాయడంతో పాటు కేంద్ర ప్రభుత్వానికి కూడా చంద్రబాబు అప్పట్లో ఫిర్యాదు చేశారు.

కానీ కేంద్రం పట్టించుకోకపోవడంతో ఆ నిధులు పెండింగ్ లోనే ఉన్నాయి. అయితే జగన్ అధికారంలోకి వచ్చాక తెలంగాణ నుంచి రావాల్సిన నిధుల కోసం ప్రయత్నాలు మొదలుపెట్టారు. ఢిల్లీకి పర్యటనకు వెళ్లినప్పుడల్లా కేంద్ర విద్యుత్ శాఖ మంత్రులను కలుస్తూ తెలంగాణ ప్రభుత్వం నుంచి ఏపీకి రావాల్సిన విద్యుత్ బకాయిలను ఇప్పించాలని వినతిపత్రం ఇస్తున్నారు. అయితే మూడేన్నళ్లుగా అడుగుతున్నా కేంద్రం, తెలంగాణ ప్రభుత్వం మాత్రం నోరు మెదపడం లేదు. అయితే ఇటీవల ఢిల్లీ వెళ్లి సీఎం జగన్.,. మరోసారి విద్యుత్ శాఖ మంత్రిని కలిసి పెండింగ్ బకాయిలపై ఫిర్యాదు చేశారు.

ఈ క్రమంలో కేంద్ర ప్రభుత్వం వెంటనే స్పందించింది. 30 రోజుల్లోగా విద్యుత్ బకాయిలను ఏపీ ప్రభుత్వానికి చెల్లించాలని కేసీఆర్ సర్కార్ నోటీసులిచ్చింది. అయితే దీని వెనుక రాజకీయ కారణాలు ఉన్నట్లు తెలుస్తోంది. కేసీఆర్ పై ఒత్తిడి తెచ్చేందుకే ఇప్పుడు విద్యుత్ బకాయిల అంశంపై కేంద్రం ఆదేశాలు చేసిందనే చర్చ జరుగుతోంది. గత 8 ఏళ్లుగా అసలు పట్టించుకోని కేంద్రం.. కేసీఆర్ ను ఇబ్బంది పెట్టేందుకే ఈ ఆదేశాలు ఇచ్చిందని అభిప్రాయపడుతున్నారు. తెలంగాణలో కేసీఆర్, బీజేపీ మధ్య పొలిటికల్ వార్ తారాస్ధాయికి చేరుకుంది. ఒకరిపై ఒకరు దుమ్మెత్తిపోసుకుంటున్నారు. ఒకరినొకరు ఇబ్బంది పెట్టుకునేవరకు రాజకీయం వెళ్లింది. కవితపై ఢిల్లీ లిక్కర్ కుంభకోణం ఆరోపణలు, కేటీఆర్ సన్నిహితుల రియల్ ఎస్టేట్ కంపెనీలపై ఐటీ దాడులు చేయడంతో.. ఎప్పుడో నమోదైన కేసులో బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ పై తెలంగాణ పోలీసులు పీడీ యాక్ట్ కేసులు చేశారు.

ఇక కేసీఆర్ ను ఇబ్బంది పెట్టేందుకు కేంద్రం నుంచి రావాల్సిన నిధులు ఇవ్వకపోడం, ఆర్ బీఐ నుంచి అప్పులు తీసుకోవడానికి అనుమతి ఇవ్వకపోవడం లాంటివి చేస్తూనే ఉంది. ఇలాంటి తరుణంలో విద్యుత్ బకాయి అంశాన్ని కూడా కేసీఆర్ ను ఇబ్బంది పెట్టేందుకు బీజేపీ రాజకీయంగా వాడుకుందనే చర్చ జరుగుతోంది. ప్రస్తుతం తెలంగాణ ఆర్ధిక పరిస్ధితి దారుణంగా ఉంది. అప్పుల ఊబిలో చిక్కుకుంది. సంక్షేమ పథకాలకు డబ్బులు, ఉద్యోగులకు ఆలస్యంగా జీతాలు ఇవ్వాల్సిన పరిస్ధితి. ఇలాంటి టైమ్ లో రూ.6 వేల కోట్లు నెల రోజుల్లో ఇవ్వాలని ఆర్డర్ పాస్ చేయడం కాస్త ఇబ్బంది కలిగించే అంశమే.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -