Bigg Boss Season 6: కొంచెం వాళ్లకు మేకప్ వెయ్యండిరా బాబు అంటూ ట్రోల్స్?

Bigg Boss Season 6: బుల్లితెరపై బిగ్ బాస్ సీజన్ సిక్స్ ఒక రేంజ్ లో హడావిడిగా కొనసాగుతుంది. ఈ సీజన్ సిక్స్ గత వారం ఎంతో గ్రాండ్ గా విడుదలైంది. హోస్ట్ నాగార్జున కంటెస్టెంట్లు అందర్నీ ఒక్కొక్కరిగా ప్రేక్షకులకు పరిచయం చేశారు. మొత్తం 21 మంది కంటెస్టెంట్లు హౌస్ లోకి అడుగు పెట్టారు. కాగా ఘనంగా మూడు ఎపిసోడ్లు పూర్తి చేసుకున్నాయి.

ఈ క్రమంలో నామినేషన్లు మొదలుపెట్టారు. ఇక బిగ్ బాస్ ఇంటి సభ్యులతో క్లాస్-మాస్-ట్రాష్ అనే టాస్క్ ను ఆడించారు. ఈ టాస్క్ లో టాలెంట్ పరంగా ముగ్గురిని సేవ్ చేసి మరో ముగ్గురిని ఎలిమినేట్ చేస్తారు. ఇక బాలాదిత్య, ఇనయా సుల్తానా, అభి నయశ్రీ ఎలిమినేషన్ అయ్యారు. ఇక గీతు రాయల్, ఆదిరెడ్డి, నేహా చౌదరిలు సేవ్ అయ్యారు.

ఇక రేపటి ఎపిసోడ్లో మరి కొంతమంది ఎలిమినేట్ కి రెడీ గా ఉన్నారు. మరికొందరు నామినేట్ కి రెడీగా ఉన్నారు. నామినేట్ అయిన ఇంటి కంటెస్టెంట్ లో ఒకరు ప్రేక్షకుల ఓట్లు ఆధారంగా ఎలిమినేట్ చేయబడతారని తెలుస్తుంది. ఇక మొదటివారం హౌస్ నుంచి బయటికి వెళ్లే కంటెస్టెంట్లు ఎవరు అన్నదానిపై ప్రేక్షకులు బాగా ఎదురుచూస్తున్నారు.

దాదాపు లేడి కంటెస్టెంట్ లో ఎలిమినేట్ అయ్యే ఛాన్స్ ఉందని తెలుస్తుంది. ఇక ఇదంతా పక్కన పెడితే.. బిగ్ బాస్ పై వచ్చే ట్రోల్స్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ముఖ్యంగా అందులో పాల్గొనే కంటెస్టెంట్ లపై రేంజిలో ట్రోల్స్ వస్తుంటాయి. అలా తాజాగా కొందరు లేడీ కంటెస్టెంట్లు ప్రేక్షకులను మేకప్ లేకుండా భయపడే విధంగా చేస్తున్నారు. బుల్లితెరపై, వెండితెరపై మేకప్ వేసుకొని హడావిడి చేసిన సెలబ్రేటీలు ప్రస్తుతం హౌస్ లో మేకప్ లేకుండా కనబడుతున్నారు. ఈ మేకప్ లెస్ లో వాళ్లు అసలు గుర్తుపట్టకుండా కనిపిస్తున్నారు.

ఈ క్రమంలో వాళ్లపై ఒక రేంజ్ లో ట్రోల్స్ నడుస్తున్నాయి. మేకప్ తో ఎంట్రీ ఇచ్చిన కంటెస్టెంట్ ల అసలు రూపాలు బయటపడడంతో వాళ్లకి కొంచెం మేకప్ వెయ్యండి రా బాబూ అంటూ ట్రోల్స్ చేస్తున్నారు. సీరియల్ నటి కీర్తి బట్, ఆరోహి రావు, గీతు రాయల్ , నేహా చౌదరి, ఫైమా లా గురించి సోషల్ మీడియాలో విపరీతమైన ట్రోల్స్ నడుస్తున్నాయి. ఈ విధంగా బిగ్ బాస్ కంటెస్టెంట్లను నెటిజన్లు అవమాన పరుస్తున్నారు.

Related Articles

ట్రేండింగ్

YSRCP Leaders Tension: టీడీపీ జనసేన కూటమి మేనిఫెస్టో విషయంలో వైసీపీ భయాలివేనా.. ఆ టెన్షన్ తగ్గట్లేదా?

YSRCP Leaders Tension:తెలుగుదేశం పార్టీ మేనిఫెస్టో విడుదల చేసిన తర్వాత జగన్ పార్టీలో భయం మొదలైనట్లుగా ఉంది. ఎందుకంటే వైసీపీ మేనిఫెస్టోలో ఉన్నా హామీల కన్నా కూటమి ఇచ్చిన హామీలు చాలా చాలా...
- Advertisement -
- Advertisement -