Chandrababu: ఏపీలోని వాళ్లకు అదిరిపోయే తీపికబురు చెప్పిన చంద్రబాబు.. రూ.6000 పెన్షన్ ఇస్తానంటూ?

Chandrababu: చంద్రబాబు తనదైన శైలిలో ప్రచారం చేస్తున్నారు. వైసీపీ తన మ్యానిఫెస్టో విడుదల చేయడంలో వెనకబడుతుంటే.. చంద్రబాబు మాత్రం టీడీపీ గెలిస్తే భవిష్యత్ లో ఏం చేస్తానో క్లియర్‌గా చెబుతున్నారు. ఇప్పటికే సూపర్ సిక్స్ ప్రజల్లోకి బాగా వెళ్లింది. ఇవే కాకుండా తన పర్యటనలో భాగంగా ఒక్కో ప్రాంతంలో ఒక్కో హామీని ఇస్తూ దూసుకుపోతున్నారు. ఇప్పటికే నిరుద్యోగులకు కళ్లు చెదిరే హామీ ఇచ్చారు. మెగా డీఎస్సీ ఇస్తానని ప్రకటించారు. అధికారంలోకి వచ్చిన తొలి 60 రోజుల్లోనే నోటిఫికేషన్ ఉంటుందని చెప్పారు. అంతేకాదు.. వచ్చే ఐదేళ్లలో 25 లక్షల ఉద్యోగాల కల్పనే తన లక్ష్యమని చంద్రబాబు హామీ ఇచ్చారు. ఉద్యోగాలు కల్పిస్తామని హామీ ఇచ్చి యువతను ఆకట్టుకున్నారు. ఆ తర్వాత
చేనేత కార్మికుల సమస్యలపై దృష్టి పెట్టారు. ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత చేనేత కార్మికులకు 500 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ అందిస్తామని చెప్పారు. దేశ వ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో ఉచిత విద్యుత్ అమలవుతుంది కానీ.. 200 యూనిట్లు వరకే ఉంది. దేశంలో మొట్టమొదటిసారి 500 యూనిట్లు ఉచిత విద్యుత్ అందిస్తామని చంద్రబాబు హామీ ఇచ్చారు. అదే జరిగితే.. చేనేత కార్మికులకు కొన్ని కష్టాలు తీరినట్టే. వాళ్ల ఉత్పత్తికి మార్కెటింగ్ చేసుకోగలిగితే.. ఎక్కువ ప్రొడక్టును తయారు చేయొచ్చు.

ప్రజాగళం పేరుతో ఎన్నికల ప్రచారం చేస్తున్న చంద్రబాబు పలమనేరులో ఈ హామీ ఇచ్చారు. ఇప్పుడు దివ్యాంగులను ఆకట్టుకునే పనిలో పడ్డారు. ఏపీలో ఎన్డీఏ కూటమి అధికారంలోకి వస్తే దివ్యాంగుల పింఛన్ 6వేలు చేస్తానని ఆయన హామీ ఇచ్చారు. ఎన్ని ఆర్ధిక ఇబ్బందులున్నా 6వేలు ఇస్తానని చెప్పారు. అది కూడా అధికారంలోకి రాగానే అమలు చేస్తామని హామీ ఇచ్చారు. పల్నాడు జిల్లా సత్తెనపల్లిలో దివ్యాంగులతో చంద్రబాబు సమావేశం అయ్యారు. అక్కడ చాలా మంది దివ్యాంగులు.. చంద్రబాబుతో వారి సమస్యలు చెప్పుకున్నారు. గతంలో 2 వేలు ఉన్న పింఛన్ కు జగన్ కేవలం ఐదు వందల రూపాయలు మాత్రమే పెంచి 2,500 చేశారని అన్నారు. దీంతో చంద్రబాబు ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చిన వెంటనే 6 వేలు చేస్తామని చెప్పారు. ఈ కార్యక్రమంలో ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణమాదిగ కూడా ఉన్నారు. చంద్రబాబు ఇచ్చిన హామీపై ఆయన ప్రశంసలు వర్షం కురిపించారు.

సంక్షేమానికి పునాదులు టీడీపీయేనని చంద్రబాబు తెలిపారు. ఎన్టీఆర్ 30 రూపాయల పింఛన్ మొదలు పెట్టారు. ఆ తర్వాత చంద్రబాబు దాన్ని 75 రూపాయలు చేశారు. వైఎస్ దాన్ని 200 వందలు చేస్తే.. 2014 తర్వాత చంద్రబాబు ఏకంగా దాన్ని 2 వేలు చేశారు. కానీ, జగన్ విడతల వారీగా నాలుగు సార్లు పెంచి దాన్ని మూడు వేలు చేశారు. కానీ, చంద్రబాబు సమయంలో నిత్యవసర ధరలు పెంచలేదు. జగన్ హయాంలో నిత్యవసర వస్తువుల ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి. మొత్తానికి చంద్రబాబు దివ్యాంగులకు ఇచ్చిన హామీతో ఏపీలో పొలిటికల్ వేవ్ పూర్తిగా టీడీపీ వైపు తిరిగింది. చంద్రబాబు ముందు ముందు ఇంకెన్ని హామీలు ఇస్తారో చూడాలి.

Related Articles

ట్రేండింగ్

Pawan Kalyan: జనసేన పార్టీ నేతలకు కీలక ఆదేశాలు ఇచ్చిన పవన్ కళ్యాణ్.. ఆ నేతలు పాటిస్తారా?

Pawan Kalyan:  పవన్ కళ్యాణ్ లో ఇప్పుడు పరిపూర్ణ రాజకీయ నాయకుడు కనిపిస్తున్నాడు. పార్టీకి సంబంధించి అనేకమైన కీలక నిర్ణయాలను చాలా పరిణితితో తీసుకుంటున్నారు. పోలింగ్ రెండు వారాల్లో ఉంది కాబట్టి ఈ...
- Advertisement -
- Advertisement -