Chandrababu: ఏపీలో చంద్రబాబు మార్క్ మార్పులు.. సర్వేలు, స్థానిక పరిస్థితుల ద్వారా ఈ అభ్యర్థుల లెక్క మారుతోందా?

Chandrababu: చంద్రబాబు సీట్ల కేటాయింపులో ఆచీతూచీ అడుగులు వేస్తున్నారు. గెలుపు ఓటములను అంచనా వేసుకొని టికెట్లు ఇస్తున్నారు. కొన్ని నియోజవర్గాల్లో ఓటమి ఖాయం అని తెలిసినా.. కనీసం అక్కడ వైసీపీ నేతలను కట్టడి చేయడానికి కొత్త వ్యూహాలను రచిస్తున్నారు. చీపురుపల్లిలో మంత్రి బొత్సపై గెలవడం అంత సులభం కాదు. కానీ, బొత్స దూకుడు తగ్గించడానికి చంద్రబాబు గంటాను అక్కడ పరిశీలిస్తున్నారు. ఇలాంటి వ్యూహాలతో ఆయన ముందుకు వెళ్తున్నారు. అందులో భాగంగానే సీనియర్లకు టికెట్ కేటాయింపులో జాప్యం జరుగుతోంది. దీనికితోడు జనసేన, బీజేపీతో పొత్తు కూడా కొన్ని నియోజవర్గాల్లో సీట్ల సర్ధుబాటకు తలనొప్పిగా మారింది. అలా అని ఎవరికీ ఇబ్బంది లేకుండా టికెట్ల కేటాయింపు జరుగుతుంది. సర్వేలు, స్థానిక పరిస్థితుల ఆధారంగా సీట్ల సర్దుబాటు చేస్తున్నారు.

గెలుపు కోసం కఠినమైన నిర్ణయాలు తీసుకోవడానికి వెనడాటం లేదు. మొహమాటానికి పోవడం లేదు. మాజీ మంత్రి, టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యుడు కిమిడి కళావెంకట్రావును విజయనగరం జిల్లా గజపతినగరం పంపించాలని ఆలోచిస్తున్నారు. గత మూడు దఫాలుగా ఆయన ఎచ్చెర్ల నుంచి పోటీ చేస్తున్నారు. అయితే, పొత్తులో భాగంగా ఎచ్చెర్ల బీజేపీకి కేటాయించారు. మొదట శ్రీకాకుళం అసెంబ్లీ నియోజకవర్గాన్ని బీజేపీకి కేటాయించారు. ఆ తర్వాత శ్రీకాకుళానికి బదుల ఎచ్చెర్లను బీజేపీకి ఇచ్చారు. దీంతో.. కిమిడి కళావెంకటర్రావును విజయనగరం జిల్లా గజపతి నగరానికి పంపిచాలనే యోచనలో చంద్రబాబు ఉన్నారు. కొండపల్లి అప్పలనాయుడు గజపతి నుంచి ప్రాతినిథ్యం వహిస్తున్నారు. అయితే, ఇటీవల సీట్ల కేటాయింపులో కొండపల్లి శ్రీనివాస్ కు చంద్రబాబు టికెట్ ఇచ్చారు. అయితే, కొండపల్లి శ్రీనివాస్‌కు, కొండపల్లి అప్పలనాయుడు వర్గానికి పడటం లేదు. దీంతో, శ్రీనివాస్ గెలుపు కష్టమని సర్వేల్లో తేలింది. దీంతో సీనియర్ నాయకుడు కళావెంకట్రావును అక్కడికి పంపిస్తే అందరిని కలుపుకు పోతారనే అభిప్రాయానికి చంద్రబాబు వచ్చినట్టు తెలుస్తోంది.

చాలా నియోజకవర్గాల్లో సర్వేల ఆధారంగా చంద్రబాబు ఇలాంటి నిర్ణయాలు తీసుకుంటున్నారు. చీపురుపల్లికి కిమిడి నాగార్జున ఇంఛార్జీగా ఉన్నారు. యువకుడు, ఉత్సాహవంతుడు, విద్యావంతుడు కావడంతో గతం కంటే పార్టీ చీపురుపల్లిలో బలపడింది. కానీ, బొత్సను ఆయన ఢీ కొట్టగలరా? అనే అనుమానం ఉంది. అందుకే.. చీపురుపల్లి నుంచి గంటా శ్రీనివాస్ పేరును పరిశీలిస్తున్నారు. గంటా శ్రీనివాస్ అయితే.. బొత్సను కనీసం ఓటమి అంచుకు తీసుకొని వెళ్తారని లోకల్ టాక్ ఉంది. గంటా పోటీ చేస్తే.. బొత్స ప్రచారాన్ని చీపురుపల్లికే పరిమితం చేయొచ్చని.. విజయనగరం జిల్లా మొత్తం తిరగకుండా ఆపొచ్చని చంద్రబాబు ఆలోచన. అయితే, గంటా అడుగుతున్న భీమిలి ఇంకా పెండింగ్ లో ఉంది. అక్కడ ఏం చేయాలనే తర్జనభర్జన నడుస్తోంది.

మైలవరంలో మాజీ మంత్రి దేవినేని ఉమాకు వ్యతిరేకంగా సర్వే ఫలితాలు వెలువడ్డాయి. దీంతో.. ఆయనకు బదులు ఇటీవలే వైసీపీ నుంచి వచ్చిన వసంత కృష్ణ ప్రసాద్ కు టికెట్ కేటాయించారు. టీడీపీకి అత్యంత విశ్వాసపాత్రుడిగా ఉన్న దేవినేని ఉమాకు అధికారం వచ్చిన తర్వాత మరో రూపంలో న్యాయం చేస్తానని చంద్రబాబు మాట ఇచ్చినట్టు తెలుస్తోంది. ప్రకాశం జిల్లా దర్శిలో ప్రవాసాంధ్రుడు గరికపాటి వెంటక్, ప్రస్తుత ఇంఛార్జి గోరంట్ల రవికుమార్, గొట్టిపాటి లక్ష్మి పేర్లు పరిశీలనలో ఉన్నాయి. కానీ, స్థానిక పరిస్థితులు వెంకట్‌ కు అనుకూలంగా ఉన్నాయి.

అనంతపురం అర్బన్, గుంతకల్లు, అన్నమయ్య జిల్లా రాజంపేట, కర్నూలు జిల్లాలో ఆలూరుపై చంద్రబాబు ఇంకానిర్ణయం తీసుకోలేదు. కర్నూలు జిల్లా ఆదోని సీటు బీజేపీకి ఇచ్చారు. ఇప్పుడు దాన్ని వెనక్కి తీసుకొని ఆలూరు కేటాయించాలని చూస్తున్నారు.

Related Articles

ట్రేండింగ్

YSRCP Leaders Tension: టీడీపీ జనసేన కూటమి మేనిఫెస్టో విషయంలో వైసీపీ భయాలివేనా.. ఆ టెన్షన్ తగ్గట్లేదా?

YSRCP Leaders Tension:తెలుగుదేశం పార్టీ మేనిఫెస్టో విడుదల చేసిన తర్వాత జగన్ పార్టీలో భయం మొదలైనట్లుగా ఉంది. ఎందుకంటే వైసీపీ మేనిఫెస్టోలో ఉన్నా హామీల కన్నా కూటమి ఇచ్చిన హామీలు చాలా చాలా...
- Advertisement -
- Advertisement -