YCP – TDP: ఏపీ రాజకీయాలను షేక్ చేస్తున్న వాలంటీర్ వార్.. టీడీపీ, వైసీపీలలో గెలుపు ఎవరిదంటే?

YCP – TDP: ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నటువంటి తరుణంలో ప్రస్తుతం ఎన్నికల కోడ్ అమలులో ఉంది. ఇలా ఎన్నికల కోడ్ అమలులో ఉన్నటువంటి తరుణంలో వాలంటీర్లు వారి సేవల నుంచి పూర్తిగా తప్పుకోవాలని ఎన్నికల సంఘం ఆదేశించింది అంతేకాకుండా వారి వద్ద ఉన్నటువంటి ట్యాబ్ ఫోన్లను కూడా కలెక్టరేట్ లో సమర్పించాలని శనివారం ఎన్నికల సంఘం ఆదేశాలను జారీ చేశారు.

ఇలా ఎన్నికల కోడ్ అమలులో ఉన్నటువంటి తరుణంలో వాలంటీర్లు తమ విధులకు దూరంగా ఉండాలని ఎన్నికల అధికారులు చెప్పినప్పటికీ వైసీపీ ప్రభుత్వం మాత్రం దీనిని తమ ప్రచార కార్యక్రమాలకు ఆసరా చేసుకుని పెద్ద ఎత్తున టిడిపి పై దుష్ప్రచారం చేస్తూ ప్రచార కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. చంద్రబాబు నాయుడు కేసు వేయటం వల్లే ఇలాంటి ఆదేశాలు జారీ అయ్యాయని తన వల్ల రాష్ట్రవ్యాప్తంగా పెన్షన్ తీసుకునే వారికి నష్టం ఏర్పడుతుంది అంటూ పోస్టులు సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు.

ఎన్నికల కోడ్ అమలులోకి వచ్చిన తర్వాత వాలంటీర్ల ద్వారా ఇంటికి డబ్బులు పంపించడం చట్ట విరుద్ధం కనుక పెన్షన్లను స్థానిక సెక్రటేరియట్ వద్ద తీసుకోవాల్సిందిగా అధికారులు ఆదేశాలు జారీ చేశారు. ఇక సోమవారం ఏప్రిల్ ఒకటవ తేదీ ఆర్థిక సంవత్సరం మారడంతో సెలవు మూడో తేదీ పెన్షన్ వస్తుందని ఇప్పటికే అధికారులు చెప్పారు. అయినప్పటికీ ఇదే విషయాన్ని తమకు అనుకూలంగా మార్చుకున్నటువంటి వైసిపి మంత్రులు ఎమ్మెల్యేలు సైతం చంద్రబాబు నాయుడు వల్లే పెన్షన్ రావడంలేదని చెప్పడం ఎంతవరకు సమంజసం అని ప్రశ్నిస్తున్నారు.

ఏప్రిల్ మూడో తేదీ నుంచి పెన్షన్ తీసుకునే వారందరూ కూడా స్థానిక సెక్రటేరియట్ వద్దకు వెళ్లి ఆధార్ కార్డు లేదా ఇతర గుర్తింపు కార్డులను చూపించి పెన్షన్ తీసుకోవాలని అధికారులు సూచించారు కానీ తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు, ఆంధ్రప్రదేశ్ పిసిసి అధ్యక్షురాలు షర్మిల సైతం ప్రభుత్వ అధికారుల చేత ఇంటింటికి పెన్షన్ పంపించాలని తెలిపారు. ఇలా పెన్షన్ అందచేయడానికి 10 రోజుల సమయం పడుతుందని అధికారులు చెప్పడంతో షర్మిల ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వ యంత్రాంగం పెన్షన్ పంపిణీ చేసే విషయంలో కూడా ఇంత నిర్లక్ష్యంగా వహిస్తారా రెండు రోజులలో పెన్షన్ పంపిణీ పూర్తి చేయలేరా అంటూ ఈమె మండిపడ్డారు.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -