Chandrababu: రూ.500,200 నోట్ల రద్దుతోనే వైసీపీకి చెక్ పెట్టొచ్చన్న బాబు.. రద్దు చేయడం సాధ్యమేనా?

Chandrababu: 30 ఏళ్ల తర్వాత ప్రపంచం ఎలా ఉంటుందో అంచనా వేసి దానికి తగ్గట్టు ఇప్పుడు పునాదులు వేయడం చంద్రబాబు లక్షణం. అందుకే చంద్రబాబును అన్ని పార్టీల నేతలు విజనరీ లీడర్‌గా చెబుతారు. ఈ రోజు హైదరాబాద్ ప్రపంచస్థాయి నగరంలో ఎదిగింది అంటే అది చంద్రబాబు ముందు చూపే అని గతంలో ఉన్న టీఆర్ఎస్ నాయకులు, ఇప్పుడున్న కాంగ్రెస్ నాయకులు చెబుతున్నారు. ఈ ఒక్క విషయంలోనే కాకుండా టెక్నాలజీ వాడడంలో కూడా చంద్రబాబు ముందుంటారు. డిజిటలైజేషన్ ను దేశంలోనే ముందుగా గుర్తించిన రాజకీయ నాయకుడు చంద్రబాబే అనడంలో అతిశయోక్తి లేదు. డిజిటలైజేషన్ తో అవినీతిని అరికట్ట వచ్చని చంద్రబాబు బలంగా నమ్ముతారు. అందుకే, ఆయన టెక్నాలజీ వైపు ఎక్కువగా మొగ్గు చూపుతారు. ఈ విషయాన్ని మరోసారి ఆయన చెప్పారు. డిజిటల్ కరెన్సీతో అవినీతికి అడ్డుకట్ట వేయోచ్చని అన్నారు. పెద్దనోట్ల రద్దు చేయడంతో అవినీతి తగ్గిందని ఆయన చెప్పారు. పెద్ద నోట్ల రద్దును ప్రధాని మోడీకి గతంలో తాను సిఫారుసు చేశానని అన్నారు. ఇప్పుడు కూడా 200, 500 రూపాయల నోట్లు రద్దు చేస్తే అవినీతి పార్టీల ఆగడాలకు ముక్కు తాడు వేయొచ్చని చంద్రబాబు సూచించారు. కానీ, వైసీపీ లాంటి అవినీతి పార్టీని అడ్డుకోవాలంటే.. డిజిటల్ కరెన్సీ వైపు వెళ్లాలని తెలిపారు. ఈ విషయంలో రానున్న రోజుల్లో కేంద్రంపై ఒత్తిడి తీసుకొచ్చే ఆలోచన చంద్రబాబుకు ఉందని టీడీపీ నేతలు చెబుతున్నారు. చంద్రబాబు కేంద్రాన్ని ఈ విషయంలో ఒప్పించగలరని అంటున్నారు. విజనరీ లీడర్ గా గుర్తింపు ఉన్న చంద్రబాబు మాటకు కేంద్రం విలువ ఇస్తుందని అంటున్నారు.

అయితే, చంద్రబాబు చెప్పిన దాంట్లో నిజం లేకపోలేదు. డిజిటల్ కరెన్సీ కాకుండా మాన్యువల్ గా చెల్లింపులు జరిపితే.. ఎంత అవినీతి జరుగుతుందో ఏపీలో లిక్కర్ పాలసీలో అర్థం అయిపోతుంది. ఏపీలోని మద్యం షాపుల్లో డిజిటల్ పేమెంట్స్ జరగడం లేదు. ఏపీలో మద్యం దుకాణాలను ప్రభుత్వమే నిర్వహిస్తుంది. ఈ దుకాణాల్లో మొదటి మూడేళ్లు డిజిటల్ పేమెంట్స్ జరగలేదు. ఆ తర్వాత పెద్ద ఎత్తున విమర్శలు రావడంతో ఆరు నెలల పాటు.. డిజిటల్ పేమెంట్స్ జరుగాయి. అది కూడా అక్కడక్కడ జరిగాయి. మళ్లీ రెండు నెలలుగా రాష్ట్ర వ్యాప్తంగా డిజిటల్ పేమెంట్స్ ఆగిపోయాయి. చిన్న చిన్న వ్యాపారులు కూడా డిజిటప్ పేమెంట్స్ వైపే మొగ్గు చూపుతున్నారు. కానీ.. ప్రభుత్వమే నిర్వహిస్తున్న మద్యం దుకాణాల్లో మాత్రం ఆన్‌లైన్ పేమెంట్స్‌ను అంగీకరించడం లేదు. రాష్ట్రంలో 80 లక్షల మంది మద్యం సేవించే వారు ఉన్నారు. వారంతా రోజుకి కనీసం 200 రూపాయల మందు తాగినా.. ఏడాదికి 50 వేల కోట్ల రూపాయల ఆదాయం రాష్ట్రానికి వస్తుంది. కానీ… అందులో సగం మాత్రమే లెక్కలు చూపించి మిగిలిన సొమ్ముతో ప్రభుత్వం అవినీతికి పాల్పడుతోందని ఆరోపణలు ఉన్నాయి.

2019 నాటికి టీడీపీ ప్రభుత్వానికి రోజుకి 50 వేల కోట్లు మద్యం ద్వారా అర్జించేదని ఓ అంచనా. ఇప్పుడు జగన్ సీఎం అయిన తర్వాత ధరలు పెరిగాయి కనుక రోజుకు 80 కోట్లుకు చేరిందని లెక్కలు చెబుతున్నాయి. డిజిటల్ పేమెంట్ చేయడానికి ఓ ప్రైవేట్ కంపెనీ ఓ యాప్ కూడా తయారు చేసింది. కానీ, అది పని చేయడం లేదు. దీంతో డిజిటల్ చెల్లింపులు ఆగిపోయాయి. క్యాష్ తీసుకొని వచ్చిన వారికే లిక్కర్. లేదంటే ఒత్తి చేతులతో వెనుదిరగాల్సిందే. డిజిటల్ చెల్లింపులు లేవు కనుక.. ఎంత ఆదాయం వస్తుంది? అనేదాని పై స్పష్టత ఉండదు. లెక్కలు తక్కువ చూపించి జీఎస్టీని ఎగ్గొడుగున్నారనే ఆరోపణలు చాలా కాలంగా ఉన్నాయి. ఇలాంటి అవినీతిని అడ్డుకోవాలంటే డిజిటల్ చెల్లింపులు అవసరం.

Related Articles

ట్రేండింగ్

AP Roads: ఏపీలో రోడ్ల పరిస్థితిని చూపించి ఓట్లు అడిగే దమ్ముందా.. వైసీపీ నేతల దగ్గర జవాబులున్నాయా?

AP Roads:  ఒక రాష్ట్రం అభివృద్ధి బాటలో నడవాలి అంటే ముందుగా ఆ రాష్ట్రంలో మౌలిక సదుపాయాలన్నీ కూడా సక్రమంగా ఉండాలి మౌలిక సదుపాయాలు అంటే రోడ్లు కరెంట్ నీరు వంటి వాటివి...
- Advertisement -
- Advertisement -