Chandrababu: రాష్ట్రం 30 ఏళ్లు వెనక్కి వెళ్ళిపోయింది – చంద్రబాబు

Chandrababu: ఆంధ్రప్రదేశ్ లో వైసీపీ ప్రభుత్వం వచ్చాక రాష్ట్రం 30 ఏళ్లు వెనక్కి వెళ్లిపోయిందని టిడిపి జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు ఆరోపించారు. ప్రతి పార్లమెంట్ నియోజకవర్గంలో రా కదలిరా సభను నిర్వహిస్తున్న సందర్భంగా తిరువూరు సభలో చంద్రబాబు మాట్లాడారు. ఈ రాష్ట్రాన్ని కాపాడుకోవాలంటే ప్రజలందరూ ముందుకు కదలి రావాలని పిలుపునిచ్చారు.

 

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఒకపక్క హైదరాబాద్ వెలిగిపోతుంటే మరోపక్క అమరావతి వెలవెలబోతుంది అని అన్నారు. దినంతటికీ కారణం సీఎం జగన్మోహన్ రెడ్డి పాలన అని, ఒక వ్యక్తి అసమర్థుడైతే పరవాలేదు కానీ ఒక దుర్మార్గుడి పాలనలో రాష్ట్రం ఎందుకు పనికిరాకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. అమరావతిని దేశంలోని నెంబర్ వన్ రాజధానిగా తీర్చిదిద్దుదాం అని అనుకున్నానని కానీ జగన్మోహన్ రెడ్డి వచ్చాక అమరావతిని రూపురేఖలు లేకుండా చేసేసారని ఎక్కడ చూసినా అవినీతితో విధ్వంసం సృష్టిస్తున్నారని అన్నారు. ఈ రాష్ట్రంలో తనతో సహా ప్రతి ఒక్కరు జగన్ బాధితులేనని ఈ అరాచక పాలనకు చరమగీతం పాడాలని పిలుపునిచ్చారు

ప్రపంచంలోని నెంబర్ వన్ గా ఉండే సత్తా తెలుగు జాతికి ఉందని, తెలుగువారు ఎప్పుడు ప్రపంచంలోనే గొప్పగా ఉండాలనేది తన ఆకాంక్షగా చెప్పుకొచ్చారు. జాతీయ రాజకీయాల్లో రాణించే సత్తా తెలుగు వారికి ఉందని అన్నారు. ఈసారి వైసీపీకి ఓటు వేస్తే జాతికి ద్రోహం చేసిన వారమవుతామని, మరో మూడు నెలల్లో రైతు రాజ్యం తీసుకువస్తామని తెలిపారు. ఈ రాష్ట్రం బాగుండాలి అన్న రైతులు బాగుండాలి అన్న జనసేన తెలుగుదేశం ప్రభుత్వం రావాలని, ఈ సైతాన్ ప్రభుత్వం పోవాలని అన్నారు.

 

జగన్ ప్రభుత్వంలో మన రాజధాని ఏది అంటే చెప్పుకోలేని స్థితి వచ్చిందని తమ ప్రభుత్వం రాగానే అమరావతి మన రాజధాని అని గర్వంగా చెప్పుకునే స్థితికి తీసుకువస్తామని మాటిచ్చారు. దొంగ ఓట్లు చేర్పించి ఈసారి గెలుద్దామని వైసిపి నాయకులనుకుంటున్నారని ఆటలు సాగవని వారు తెలుసుకోవాలని హేతవు పలికారు.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -