Gudivada Amarnath: చంద్రబాబు స్కిల్డ్ క్రిమినల్.. అన్ స్కిల్డ్ పొలిటీషియన్.. చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు వైరల్!

Gudivada Amarnath: చంద్రబాబుకి ఐటి శాఖ ఇచ్చిన నోటీసుల గురించి సంచలన వ్యాఖ్యలు చేశారు మినిస్టర్ గుడివాడ అమర్నాథ్. చంద్రబాబు జీవితం అంతా కుట్రలు, కుతంత్రాలు, మోసాలు, వెన్నుపోటులతో సాగింది అంటూ ఆరోపించారు. వ్యవస్థలను మేనేజ్ చేయడంలో చంద్రబాబును మించిన వాళ్ళు ఎవరూ ఉండరు అంటూ కామెంట్లు చేశారు. పెద్ద ఎత్తున స్కాం చేసి కోటల్లో డబ్బులు కొట్టేసాడని నోటీసులు జారీ చేస్తే ఆయన కనీసం స్పందించకపోవడం దారుణం.

కనీసం ఈ తప్పు నేను చేయలేదు అని కూడా స్పందించడం లేదు. దీన్ని బట్టి చంద్రబాబు నాయుడు తప్పు చేసినట్లు అర్థమవుతుందని చెప్పుకొచ్చారు అమర్నాథ్. 118 కోట్ల స్కాం నుంచి చంద్రబాబు నాయుడు తప్పించుకోలేరు. ఐటీ శాఖ మొత్తం 46 పేజీలతో ఆగస్టు 4వ తేదీన నోటీసులు జారీ చేసింది. వీటికి ఏమాత్రం సంబంధం లేకుండా చంద్రబాబు ఇన్కమ్ టాక్స్ ఆఫీస్ కి నాలుగు లేఖలు రాశారు. వాళ్లు నోటీసులు ఇచ్చినప్పుడు ఈయన స్పందించవలసింది పోయి ఈ లేఖలు రాయటం ఏంటి అంటూ ప్రశ్నించారు అమర్నాథ్.

నా పేరు ఎవరు చెప్పారు, అసలు నాకు నోటీసులు ఇవ్వటానికి మీరెవరు అంటూ చంద్రబాబు నాయుడు అడిగిన ప్రశ్నలకు ఐటి అధికారులు సమాధానం చెప్పారని వివరించారు. ఈ విషయం తనని చాలా ఆశ్చర్యంగా గురి చేస్తుందని చెప్పుకొచ్చారు అమర్నాథ్ చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి స్కిల్డ్ క్రిమినల్ అని అన్స్కిల్డ్ పొలిటీషియన్ అంటూ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు అమర్నాథ్. స్కామ్ ల ద్వారా చంద్రబాబు దోచేసిన డబ్బు మొత్తాన్ని రికవరీ చేసి రాష్ట్ర ఖజానాకి తీసుకొస్తామన్నారు.

అలాగే కేసులో బాబుకి సహకరించిన ఆయన కుమారుడు నారా లోకేష్ పేరు కూడా నోటీసుల్లో ఉందని మంత్రి గుడివాడ అమర్నాథ్ చెప్పుకొచ్చారు. రాష్ట్రంలో టీడీపీ హయంలో చేపట్టిన అన్ని సంక్షేమ పథకాల్లో చంద్రబాబు డబ్బు దోచేసారని ఆరోపించారు. సీమన్స్ పేరు చెప్పి 350 కోట్లు చంద్రబాబు నాయుడు కొట్టేసారని, ఈ అవినీతిని ప్రజల ముందు పెడతామని ఇంకా చాలా అంశాలు బయటికి తీసుకువస్తామని చెప్పారు అమర్నాథ్. ఈడీ వంటి దర్యాప్తు సంస్థలు చంద్రబాబు అవినీతిపై దృష్టి సారించాలన్నారు. అమర్నాథ్ అన్న మాటలు ఇప్పుడు సంచలనంగా మారాయి. మరి చంద్రబాబు ఏ విధంగా స్పందిస్తారో వేచి చూడాల్సిందే.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -