TDP Senior Leaders: టీడీపీలో ఈ 10 మంది సీనియర్ నేతలకు టికెట్ దక్కకపోవడానికి కారణాలివేనా.. ఏం జరిగిందంటే?

TDP Senior Leaders: అసెంబ్లీ ఎన్నికలు దగ్గర పడుతున్నటువంటి తరుణంలో అన్ని పార్టీ అధినేతలు అభ్యర్థుల జాబితాను విడుదల చేశారు. ఇప్పటికే వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి అభ్యర్థుల జాబితాను విడుదల చేసి నేటి నుంచి బస్సు యాత్ర ప్రచార కార్యక్రమాలను మొదలు పెట్టబోతున్న సంగతి మనకు తెలిసిందే. మరోవైపు తెలుగుదేశం పార్టీతో పాటు జనసేన బీజేపీ కూటమిగా ఏర్పడి ఎన్నికల బరిలోకి రాబోతున్న సంగతి మనకు తెలిసిందే.

ఈ కూటమిలో భాగంగా కొంతమంది సీనియర్ తెదేపా నాయకులకు సీట్లు దక్కకపోవడంతో పెద్ద ఎత్తున ఆందోళన నెలకొంది. ఇప్పటికే మూడు దశలుగా చంద్రబాబు నాయుడు అభ్యర్థుల జాబితాను ప్రకటించారు. మొదటి విడుదల లేని పేర్లు రెండో విడతలో ఉంటాయని మూడో విడతలో ఉంటాయని ఆసక్తిగా ఎదురు చూశారు కానీ మూడో విడతలుగా అభ్యర్థుల జాబితాను విడుదల చేసినప్పటికీ తమ పేర్లు లేకపోవడంతో కొంతమంది సీనియర్ తెదేపా నాయకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

ఇలా టిడిపిలో సీనియర్ నాయకులుగా పేరు పొందినటువంటి గంటా శ్రీనివాసరావు, రఘురామ కృష్ణరాజు, కిమిడి కళావెంకటరావు,ఆలపాటి రాజా, దేవినేని ఉమ,పరిటాల శ్రీరామ్, జేసీ పవన్ కుమార్ రెడ్డి, ఎస్వీఎస్ఎన్ వర్మ, బండారు సత్యనారాయణమూర్తి, అశోక్ గజపతిరాజు వంటి పదిమంది సీనియర్ నేతలకు చంద్రబాబు నాయుడు టికెట్ ఇవ్వలేదు. ఇలా ఈ సీనియర్లను పక్కన పెట్టడానికి గల కారణమేంటి కూటమితో ఎన్నికల బరిలో దిగడమే కారణమా లేకపోతే బడా నేతల లెక్క తప్పిందా? తాజా సమీకరణాలు కారణమా? లేదంటే ఆ నేతల స్వయంకృతాపరాధమా? ఏది ఏమైనా ఈ పదిమందికి చోటు దక్కకపోవడంతో ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

Related Articles

ట్రేండింగ్

Union Minister Piyush Goyal: వైఎస్సార్ ను సైతం ముంచేసిన సీఎం జగన్.. ఆ కేసులో కావాలనే ఇరికించారా?

Union Minister Piyush Goyal: వైయస్సార్ కాలనీ పట్ల కేంద్రమంత్రి పియూష్ గోయెల్ తన ఆవేదన వ్యక్తం చేశారు. విజయవాడలో పీయూష్ గోయల్ విలేకరులతో మాట్లాడుతూ జగన్ పాలనపట్ల విరుచుకుపడ్డారు. వైయస్సార్ కాంగ్రెస్...
- Advertisement -
- Advertisement -