Chandramukhi: చంద్రముఖి సినిమాకి చిరంజీవికి ఉన్న సంబంధం ఏంటో తెలుసా?

Chandramukhi: సినీప్రియులకు చంద్రముఖి సినిమా గురించి పెద్దగా పరిచయం అక్కర్లేదు. అప్పట్లో ఏ సినిమాకి భారీ స్థాయిలో ప్రేక్షక ఆదరణ దక్కింది. 2005లో విడుదలైన ఈ సినిమాలో సూపర్ స్టార్ రజినీకాంత్ హీరో పాత్ర పోషించాడు. ఇక ఈ సినిమాలో తొలి పరిచయం నయనతార హీరోయిన్ గా నటించింది. నిజానికి ఇది మలయాళం చిత్రం.

మొదట మలయాళం లో మణిచిత్రతాము గా విడుదలయ్యింది. మలయాళం లో భారీ స్థాయిలో విజయం ను అందుకోవటంతో ఈ సినిమాను తెలుగులో కూడా డబ్బింగ్ చేశారు. కాగా ఈ సినిమాకు పి వాసు దర్శకత్వం వహించాడు. ఇక ఈ సినిమాలో రామకృష్ణ గారు అద్భుతమైన సంభాషణలు వినిపించారు. అప్పట్లో భారీ అంచనాలతో చేసిన తెలుగు ప్రేక్షకులు ముందుకు వచ్చింది. నిజంగా ఈ సినిమా స్టోరీ మిగతా చిత్రాల సినిమాల స్టోరీల కంటే భిన్నంగా ఉంటుంది.

ఎందుకంటే ఈ కథలో మొత్తం పెద్ద బంగ్లా, 32 అడుగుల పాము అలా మరో స్థాయిలో కథా నైపుణ్యాలు చిత్రీకరించారు. అలా ఈ సినిమా అప్పట్లో భారీ స్థాయిలో హైప్ ను సంపాదించుకుంది. ఇక ప్రస్తుతం చంద్రముఖి 2 సీక్వెల్ కూడా తీస్తున్నట్లు తెలుస్తుంది. కాగా లారెన్స్ రాఘవయ్య సినిమాలో నటిస్తున్నాడట. మరి ఇదంతా పక్కన పెడితే చంద్రముఖి సినిమాలో మొదట రజనీకాంత్ పాత్రలో చిరంజీవి చేయాల్సి ఉందట.

మలయాళం లో బాగా సక్సెస్ అయిన ఈ సినిమాను చిరంజీవి రీమేక్ చేయాలనుకున్నారట. ఇక డైరెక్టర్ గా విఎన్ ఆదిత్యను చిరంజీవి ఫైనల్ చేశాడట. కాగా అనుకున్నప్పటి నుంచి ఈ సినిమా వాయిదా అవుతూ వస్తుందట. కాగా చిరంజీవి సినిమాను పక్కన పెట్టేశారు. ఆ తర్వాత కొంతకాలానికి రజనీకాంత్ ఈ సినిమా గురించి ఇంట్రెస్ట్ పెట్టి చంద్రముఖి సినిమాతో ప్రేక్షకులు ముందుకు వచ్చేసాడు. అప్పట్లో ఈ సినిమా ప్రేక్షకులను ఒక రేంజ్ లో ఆకట్టుకుంది. ఈ సినిమాలో రజనీకాంత్ మేనరిజం కు జ్యోతిక పర్ఫామెన్స్ తోడైంది. ఇక నయనతార కూడా ఈ సినిమాతో తెలుగు ఇండస్ట్రీలో అడుగుపెట్టింది.

Related Articles

ట్రేండింగ్

YCP-TDP: చంద్రబాబు అరెస్ట్ తో రగిలిపోతున్న టీడీపీ.. అరెస్ట్ పై వైసీపీ రియాక్షన్ ఏంటంటే?

YCP-TDP:  చంద్రబాబు నాయుడుని ఆధారాలు లేని కేసులో అరెస్టు చేసి జైల్లో పెట్టిన జగన్మోహన్ రెడ్డి ప్రస్తుతం ఏం చేస్తున్నాడు అంటే చంద్రబాబు నాయుడుని జైల్లో పెట్టిన సందర్భంగా పండగ చేసుకుంటూ బాగా...
- Advertisement -
- Advertisement -