Ram Charan: నెపోటిజంపై చరణ్ షాకింగ్ కామెంట్స్.. నాన్న వల్లే ఇప్పటికీ అంటూ?

Ram Charan: మామూలుగా సినీ ఇండస్ట్రీలో నెపోటిజం బాగా ఉంటుందన్న సంగతి అందరికీ తెలిసిందే. ఇప్పటికే చాలామంది నటీనటులు బంధు ప్రీతితోనే అడుగుపెట్టారు. ఇక దీని గురించి ఇండస్ట్రీలో బాగా వార్తలు వస్తూనే ఉంటాయి. అయితే తాజాగా ఈ విషయం గురించి రామ్ చరణ్ షాకింగ్ కామెంట్ చేశాడు. ఇంతకు ఆయన చెప్పిన మాటలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.

 

తన తండ్రి మెగాస్టార్ చిరంజీవి హోదాతో అడుగుపెట్టాడు రామ్ చరణ్. ఆ తర్వాత నటుడుగా తనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకొని ప్రస్తుతం పాన్ ఇండియా లెవెల్ లో దూసుకుపోతున్నాడు. అయితే ఇదంతా పక్కన పెడితే తాజాగా ఆయన ఢిల్లీ వేదికగా జరిగిన ఇండియా టుడే కాన్ క్లేవ్ లో పాల్గొని నెపోటిజం గురించి కొన్ని కామెంట్లు చేశాడు.

స్టార్ హీరో కుమారుడిగా ఇండస్ట్రీ లోకి వచ్చినప్పటికీ టాలెంట్ లేకపోతే ఇక్కడ నెట్టుకు రావడం కష్టమని అన్నాడు. అంటే ప్రతిభ ఉంటేనే ప్రేక్షకులు ప్రోత్సహిస్తారు అని తెలిపాడు. నిజం చెప్పాలంటే ఈ నెపోటిజం ఏంటో తనకు అస్సలు తనకు అర్థం కావడం లేదు అంటూ.. ఇటీవల దీని గురించే అందరు ఎక్కువగా మాట్లాడుకుంటున్నారు అని బంధుప్రీతి ఉందని భావించే వాళ్ల వల్లే ఇది ఇంతటి చర్చకు దారితీసిందని అన్నాడు.

 

ఇక తనకు నటన అంటే ఇష్టమని.. చిన్నప్పటి నుంచి తను పరిశ్రమలో ఉన్నాను అని.. సినిమానే ఊపిరిగా తీసుకుంటూ ఎంతో మంది నిర్మాతలను కలుస్తూ ప్రాజెక్టులు చేస్తున్నాను అంటూ.. తన మనసుకు నచ్చిన పని చేయటం వల్లే 14 ఏళ్లుగా ఇక్కడే నిలబడగలిగాను అని.. తన నాన్న వల్లే పరిశ్రమలోకి వచ్చినప్పటికీ ఈ ప్రయాణాన్ని తనకు తానుగా ముందుకు సాగించాలని.. ప్రతిభ లేకపోతే ఈ ప్రయాణం సులభం కాదంటూ.. సక్సెస్ లేదా ఫెయిల్యూర్.. నీకోసం పనిచేసే వాళ్ళని జాగ్రత్తగా చూసుకో చాలు అని తన తండ్రి మొదట్లో చెప్పిన మాటను ఎప్పుడు గుర్తుపెట్టుకుంటాను అని అన్నాడు చరణ్. ప్రస్తుతం ఆయన చేసిన కామెంట్లు వైరల్ అవుతున్నాయి.

Related Articles

ట్రేండింగ్

KCR: ఏపీలో అధికారంపై కేసీఆర్ వ్యాఖ్యలివే.. ఆ కామెంట్లు నిజమయ్యే ఛాన్స్ లేనట్టేగా?

KCR:  మే 13వ తేదీ ఏపీ అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నటువంటి తరుణంలో ఏపీ ఎన్నికలపై తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. అదే రోజే తెలంగాణలో కూడా లోక సభ...
- Advertisement -
- Advertisement -